ప్రధాన మంత్రి కార్యాలయం
విశాఖ రిఫైనరీలో అవశేషాల ఉన్నతీకరణ సదుపాయం ప్రారంభం..ప్రధానమంత్రి ప్రశంసలు
प्रविष्टि तिथि:
06 JAN 2026 8:42AM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రిఫైనరీలో హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)కు చెందిన అవశేషాల ఉన్నతీకరణ సదుపాయాన్ని (ఆర్యూఎఫ్) విజయవంతంగా ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ఇంధన భద్రత, స్వయంసమృద్ధి సాధన దిశగా భారత్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన వర్ణించారు.
స్వయంసమృద్ధ భారత్‌ను సాకారం చేయడంలో భాగంగా ఇంధన స్వావలంబనను ప్రోత్సహించాలన్న దేశ ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సదుపాయం ఊతాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురీ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘ఇంధన భద్రతను పెంచే దిశగా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సదుపాయం ఊతాన్ని అందిస్తుంది.. దీనితో, ఈ రంగంలో స్వయంసమృద్ధిని మనం సాధించగలుగుతాం’’.
***
(रिलीज़ आईडी: 2211936)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam