రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారులపై మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరిచేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించిన ఎన్‌హెచ్ఏఐ

प्रविष्टि तिथि: 06 JAN 2026 2:19PM by PIB Hyderabad

జాతీయ రహదారుల వెంబడి అనేక చోట్లముఖ్యంగా కొత్తగా నిర్మిస్తున్న (గ్రీన్ ఫీల్డ్), మారుమూల ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలను గుర్తించిన ఎన్‌హెచ్ఏఐ... ఈ విషయమై జోక్యం చేసుకోవాల్సిందిగా టెలికాం శాఖభారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్)లను కోరిందిఈ మేరకు సమస్యను పరిష్కరించేలా టెలికాం సేవా సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసిందిజాతీయ రహదారుల వ్యూహాత్మక ప్రాధాన్యాన్నీప్రయాణికుల భద్రతనూ దృష్టిలో ఉంచుకుని.. దేశవ్యాప్తంగా హైవే కారిడార్లలో మొబైల్ కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం సమన్వయంతో కూడిన వేగవంతమైన చర్యలు చేపట్టాలని ఎన్‌హెచ్ఏఐ సూచించింది.

జాతీయ రహదారులపై దాదాపు 1,750 కిలోమీటర్ల పరిధిలోని 424 ప్రాంతాలు.. మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ సమగ్ర అంచనా ద్వారా గుర్తించిందిఈ ప్రదేశాలకు సంబంధించిన వివరణాత్మక సమాచారం మొత్తాన్నీ ఒక్కచోట చేర్చి.. అవసరమైన చర్యల కోసం టెలికాం శాఖట్రాయ్‌లకు అధికారికంగా అందించింది.

జాతీయ రహదారులు మారుమూలగ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్తున్నందున.. ఆయా మార్గాల్లో పటిష్టమైన మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో హైవే కార్యకలాపాలుఅత్యవసర సహాయక చర్యలుసాంకేతికతపై ఆధారపడిన ప్రజా సేవల పంపిణీపై తీవ్ర ప్రభావం పడుతోంది.

పశు సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలుప్రమాదకర ప్రదేశాలతోపాటు భౌగోళిక మ్యాపింగ్‌తో గుర్తించిన ప్రమాద ప్రభావిత ప్రాంతాల్లో.. ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్‌లు లేదా ఫ్లాష్ ఎస్ఎంఎస్ హెచ్చరికలను జారీ చేసేలా టెలికాం ఆపరేటర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ట్రాయ్‌ను ఎన్‌హెచ్ఏఐ కోరిందిఆ ప్రదేశాలకు చేరుకోవడానికి ముందే ప్రయాణికులకు ఈ హెచ్చరికలు అందేలా చూడాలని సూచించిందితద్వారా సకాలంలో భద్రతా చర్యలు తీసుకోవడానికిసురక్షిత ప్రయాణానికీ వీలవుతుందిపశు సంచారం ఎక్కువగా ఉండడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్న రహదారి మార్గాల జాబితాను కూడా ట్రాయ్ కు ఎన్‌హెచ్ఏఐ అందించింది.

నెట్‌వర్క్ అవాంతరాలను తొలగించడంజాతీయ రహదారులపై భద్రతను మెరుగుపరిచేందుకు చొరవ తీసుకోవడం ద్వారా.. ఎన్‌హెచ్ఏఐ తన నిబద్ధతను పునరుద్ఘాటించిందిసంబంధిత భాగస్వాములందరితో సమన్వయంతో పనిచేస్తూ.. దేశవ్యాప్తంగా రహదారి వ్యవస్థను అనుసంధానించడం మాత్రమే కాకుండాడిజిటల్ పరంగానూ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసిందిదేశవ్యాప్తంగా పౌరులకు సురక్షితమైనసమర్థమైనప్రయాణికుల అవసరాలకు అనుగుణమైన జాతీయ రహదారి మౌలిక సదుపాయాలను అందించాలన్న ఎన్‌హెచ్ఏఐ విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2211934) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Tamil , Malayalam