ప్రధాన మంత్రి కార్యాలయం
సామూహిక సంఘీభావంలోనే నిజమైన శక్తి ఇమిడి ఉందని చాటిచెప్పే సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
05 JAN 2026 9:17AM by PIB Hyderabad
భారత చిరస్థాయి సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున నివాళులు అర్పించారు. శతాబ్దాల తరబడి లెక్కలేనన్ని దాడుల్ని ఎదుర్కోవడంలో భారత్ సాహసాన్ని కనబరిచిందని ఆయన స్పష్టం చేశారు.
భారత ప్రజల ఉమ్మడి శక్తే దేశ నాగరికత ప్రస్థానాన్ని తీర్చిదిద్దిందనీ, ప్రజలు అత్యంత దృఢంగా నిలిచి మరీ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించారనీ ప్రధానమంత్రి అన్నారు.
సంస్కృత శ్లోకాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఉదాహరిస్తూ, సాహసం తాలూకు లోతైన అర్థాన్ని ఇలా వివరించారు :
‘‘మన మహా సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాలపైన అనేక దాడులు జరిగినప్పటికీ, దేశ ప్రజల సామూహిక శక్తి ఎల్ల వేళలా మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూవచ్చింది.
వనాని దహతో వహనే: సఖా భవతి మారుత:
స ఏవ దీపనాశాయ కృశే కస్యాస్తి సౌహృదమ్’’
(रिलीज़ आईडी: 2211529)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam