రాష్ట్రపతి సచివాలయం
నూతన సంవత్సర సందర్భంగా భారత రాష్ట్రపతి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
31 DEC 2025 4:50PM by PIB Hyderabad
2026 నూతన సంవత్సర సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి తన సందేశంలో ఇలా పేర్కొన్నారు - “నూతన సంవత్సర శుభ సందర్భంలో దేశవిదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను.
నూతన శక్తికి, సానుకూల మార్పులకు నూతన సంవత్సరం ప్రతీక. ఇది ఆత్మపరిశీలన, కొత్త సంకల్పాలకు ఒక అవకాశం. ఈ సందర్భంలో దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ పట్ల మన నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుందాం.
2026వ సంవత్సరం మన జీవితాల్లోకి శాంతి, సంతోషం, శ్రేయస్సులను తీసుకురావాలనీ… మరింత బలమైన, సుసంపన్నమైన భారత్ నిర్మాణం కోసం కొత్త శక్తిని అందించాలని ఆకాంక్షిస్తున్నాను.”
రాష్ట్రపతి సందేశాన్ని చూడటానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి-
***
(रिलीज़ आईडी: 2210262)
आगंतुक पटल : 11