ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న అర్జున్ ఎరిగైసికి ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
31 DEC 2025 9:04AM by PIB Hyderabad
దోహాలో నిర్వహించిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. ఫిడే రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలిచిన కొన్ని రోజులకే ఆయన ఈ విజయాన్ని సాధించారు. ప్రపంచ చదరంగంలో భారత్‌కు గర్వకారణంగా నిలిచే మరో అపురూపమైన ఘట్టమిది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“చదరంగంలో భారత దూకుడు కొనసాగుతోంది!
దోహాలో నిర్వహించిన ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని గెలుచుకున్న అర్జున్ ఎరిగైసికి అభినందనలు. ఇటీవలే ఫిడే రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆయన కాంస్య పతకాన్ని సాధించారు. ఆయన నైపుణ్యం, ఓర్పు, అభిరుచి అసామాన్యమైనవి. ఆయన విజయాలు మన యువతకు నిరంతర స్ఫూర్తి. ఆయనకు నా శుభాకాంక్షలు.
***
(रिलीज़ आईडी: 2210085)
आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam