ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన నివేదికలపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని
प्रविष्टि तिथि:
30 DEC 2025 12:53PM by PIB Hyderabad
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన నివేదికలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వైరుధ్యాలను తొలగించడానికి, శాశ్వత శాంతి స్థాపనకు కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలే అత్యంత ఆచరణీయమైన మార్గమని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాలపై దృష్టి సారించాలని, వాటికి విఘాతం కలిగించే చర్యలను విడిచిపెట్టాలని సంబంధిత పక్షాలను కోరారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘రష్యన్ ఫెడరేషన్ అధ్యక్ష నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వచ్చిన నివేదికలు తీవ్ర ఆందోళన కలిగించాయి. వైరుధ్యాలను తొలగించడానికి, శాంతి స్థాపనకు అవసరమైన అత్యంత ఆచరణీయమైన మార్గాన్ని కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు అందిస్తాయి. ఈ ప్రయత్నాలపై దృష్టి సారించాలని, వాటికి విఘాతం కలిగించే చర్యలను చేపట్టవద్దని సంబంధిత పక్షాలను కోరుతున్నాం”.
***
(रिलीज़ आईडी: 2209766)
आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam