హోం మంత్రిత్వ శాఖ
భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలో ప్రచురించాలన్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
భారతీయ భాషలను గౌరవించే దిశగా ఇది మరో కీలక ముందడుగు
సంతాలీ భాషలో రాజ్యాంగ ప్రచురణ.. సంతాలీ సమాజానికే కాక, యావత్ దేశానికి గర్వకారణం
మన రాజ్యాంగ ఆశయాలను, విలువలను గిరిజన సమాజానికి స్పష్టంగా చేరవేయనున్న ఓల్ చికి లిపిలో ప్రచురితమైన రాజ్యాంగం.. రాజ్యాంగ నిర్మాతల కల సాకారం
प्रविष्टि तिथि:
26 DEC 2025 4:40PM by PIB Hyderabad
భారత రాజ్యాంగాన్ని సంతాలీ భాషలో ప్రచురించాలన్న చారిత్రాత్మక నిర్ణయం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయ భాషలను గౌరవించే దిశగా మరో కీలక ముందడుగు పడిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని ప్రచురించటం.. సంతాలీ సమాజానికే కాక, యావత్ దేశానికి గర్వకారణమని తెలిపారు. ఓల్ చికి లిపిలో ప్రచురితమైన రాజ్యాంగం ద్వారా మన రాజ్యాంగ విలువలు, ఆశయాలు గిరిజన సమాజానికి మరింత స్పష్టంగా చేరతాయన్నారు. రాజ్యాంగ నిర్మాతల కలలను సాకారం చేయటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని శ్రీ అమిత్ షా కాంక్షించారు.
(रिलीज़ आईडी: 2209002)
आगंतुक पटल : 16