హోం మంత్రిత్వ శాఖ
బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులు, గొప్ప సంఘ సంస్కర్త భారతరత్న మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
సామాజిక సంస్కరణల ప్రాథమిక సూత్రంగా విద్యను పరిగణిస్తూ... బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపన ద్వారా భారతీయ సాంస్కృతిక విలువల ఆధారంగా ఆధునిక విద్యను అభ్యసించడంలో యువతకు స్ఫూర్తినిచ్చిన మాలవ్య జీ
జాతీయ నిర్మాణానికి పత్రికా రంగాన్ని ఒక మాధ్యమంగా మార్చడంలో గణనీయమైన కృషి
అంటరాని తనం నిర్మూలనకు మహామన జీవితకాల నిబద్ధత, రైతు అనుకూల కార్యక్రమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి: శ్రీ అమిత్ షా
प्रविष्टि तिथि:
25 DEC 2025 12:07PM by PIB Hyderabad
బనారస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపకులు, గొప్ప సామాజిక సంస్కర్త, భారతరత్న మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య జయంతి సందర్భంగా కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు.
'ఎక్స్' వేదికగా చేసిన ఒక పోస్టులో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు..
విద్యను సామాజిక సంస్కరణల ప్రాథమిక సూత్రంగా పరిగణించి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం ద్వారా భారతీయ సాంస్కృతిక విలువల ఆధారంగా ఆధునిక విద్యను అభ్యసించడానికి మాలవ్య జీ యువతకు స్ఫూర్తినిచ్చారని పేర్కొన్నారు. జాతి నిర్మాణానికి పత్రికా రంగాన్ని ఒక మాధ్యమంగా మార్చడంలో మహామన గణనీయమైన కృషి చేశారని ఆయన తెలిపారు. అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం జీవితాంతం కృషి చేసిన మహామన నిబద్ధత, ఆయన చేపట్టిన రైతు అనుకూల కార్యక్రమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని శ్రీ షా పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2208592)
आगंतुक पटल : 6