ప్రధాన మంత్రి కార్యాలయం
ఎల్‌వీఎం3-ఎం6 ద్వారా బ్లూబర్డ్ బ్లాక్-2ను విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను అభినందించిన ప్రధాని
प्रविष्टि तिथि:
24 DEC 2025 10:04AM by PIB Hyderabad
ఎల్‌వీఎం3-ఎం6 వాహక నౌక ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారత భూభాగం అత్యంత బరువైన ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. ఇది భారత అంతరిక్ష ప్రయాణంలో గర్వించదగిన విజయమని, ఆత్మనిర్భర భారత్ దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
‘‘భారీ ఉపగ్రహాన్ని విశ్వసనీయంగా ప్రయోగించిన ఎల్‌వీఎం3తో భవిష్యత్తులో చేపట్టే గగన్‌యాన్ లాంటి కార్యక్రమాల పునాదులను బలోపేతం చేస్తున్నాం. ఉపగ్రహ ప్రయోగాల్లో వాణిజ్య సేవలను విస్తరిస్తూ, అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొదిస్తున్నాం’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని పోస్టు:
‘‘భారత అంతరిక్ష రంగంలో ముఖ్యమైన విజయం..
‘‘భారత భూభాగం నుంచి ప్రయోగించిన అత్యంత బరువైన, అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి చేర్చిన ఎల్‌వీఎం3-ఎం6 ప్రయోగం భారత అంతరిక్ష ప్రయాణం లో గర్వించదగిన విజయం.
ఇది భారీ ఉపగ్రహాలను ప్రయోగించే భారత సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ ప్రయోగ వాణిజ్య మార్కెట్లో పెరుగుతున్న మన పాత్రను స్పష్టం చేస్తోంది.
ఇది ఆత్మనిర్భర భారత్ దిశగా మన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. విశేష కృషి చేస్తున్న అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు అభినందనలు.
అంతరిక్ష రంగంలో భారత్ ఉన్నత స్థానాలను అధిరోహించడాన్ని కొనసాగిస్తుంది!’’
@isro
‘‘యువశక్తితో నిండిన భారత అంతరిక్ష కార్యక్రమం మరింత ఆధునికంగా, ప్రభావవంతంగా మారుతోంది.
భారీ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఎల్‌వీఎం3తో.. భవిష్యత్తులో చేపట్టే గగన్‌యాన్ లాంటి అంతరిక్ష కార్యక్రమాల పునాదులను బలోపేతం చేస్తున్నాం. వాణిజ్య ప్రయోగ సేవలను విస్తరించి, అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందిస్తున్నాం.
మెరుగైన ఈ సామర్థ్యం, స్వావలంబన భవిష్యత్తు తరాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి.’’
@isro
(रिलीज़ आईडी: 2208100)
आगंतुक पटल : 5