హోం మంత్రిత్వ శాఖ
ఆసియా యూత్ పారా గేమ్స్-2025లో 36 బంగారు, 28 వెండి, 38 కాంస్య పతకాలు సాధించిన భారత యువ పారా అథ్లెట్లను అభినందించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
క్రీడాకారుల అంకితభావం, పట్టుదల, దృఢ సంకల్పానికి నిదర్శనం ఈ ఘన విజయం
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడా నైపుణ్యానికి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతున్న భారత్
భవిష్యత్తులో పారా అథ్లెట్లు మరిన్ని విజయాలు, కీర్తిని సాధించాలని ఆకాంక్ష
प्रविष्टि तिथि:
19 DEC 2025 8:33PM by PIB Hyderabad
ఆసియా యూత్ పారా గేమ్స్-2025లో 36 బంగారు, 28 వెండి, 38 కాంస్య పతకాలను సాధించిన భారత యువ పారా అథ్లెట్లను కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. “#AsianYouthParaGames2025లో భారత యువత సత్తా చాటింది! 36 స్వర్ణాలు, 28 రజతాలు, 38 కాంస్యాలు.. మొత్తం 102 పతకాలతో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన మన యువ పారా-అథ్లెట్లకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుత విజయం క్రీడాకారుల అంకితభావానికి, పట్టుదలకు, అలుపెరుగని పోరాట స్ఫూర్తికి నిదర్శనం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో క్రీడా నైపుణ్యానికి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదుగుతోంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, కీర్తిని పొందాలని కోరుకుంటున్నాను"
#AsianYouthParaGames2025లో భారత యువత మెరిశారు!
36 స్వర్ణాలు, 28 రజతాలు, 38 కాంస్యాలు.. మొత్తం 102 పతకాలతో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన మన యువ పారా-అథ్లెట్లకు హృదయపూర్వక అభినందనలు. ఈ అద్భుత విజయం క్రీడాకారుల అంకితభావానికి, పట్టుదలకు, అలుపెరుగని పోరాట స్ఫూర్తికి నిదర్శనం... pic.twitter.com/wbxkO6aD8r
— అమిత్ షా (@AmitShah) December 19, 2025
(रिलीज़ आईडी: 2207045)
आगंतुक पटल : 8