ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబర్ 20, 21న అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి


అస్సాంలో రూ. 15,600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

గువాహటిలోని లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

సుమారు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్ భవనం ఏటా గరిష్టంగా 1.3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన

వెదురు పూల ఇతివృత్తంతో, అస్సాం జీవవైవిధ్యం, సాంస్కృతిక వారసత్వ స్పూర్తితో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం

దిబ్రూగఢ్‌లోని నాంరూప్ వద్ద అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీకి చెందిన అమోనియా-యూరియా ఎరువుల

ప్రాజెక్టు నిర్మాణానికి ప్రధానమంత్రి భూమిపూజ

రూ.10,600 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం.. అస్సాంతోపాటు పొరుగు రాష్ట్రాల ఎరువుల అవసరాలను

తీర్చడంలో, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయం

బోరగావ్ లోని స్వాహిద్ స్మారక క్షేత్రంలో వీరమరణం పొందిన అమరులకు నివాళులు అర్పించనున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 19 DEC 2025 2:29PM by PIB Hyderabad

డిసెంబర్ 20, 21 తేదీల్లో అస్సాం రాష్ట్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారుడిసెంబర్ 20న మధ్యాహ్నం గంటలకు ప్రధానమంత్రి గువాహటికి చేరుకుంటారుఅక్కడ లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

డిసెంబర్ 21న ఉదయం 9:45 గంటలకు గువాహటిలోని బొరాగావ్‌లో ఉన్న ‘‘స్వాహిద్ స్మారక క్షేత్రం’’ వద్ద అమరవీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పిస్తారుఅనంతరం ఆయన దిబ్రూగఢ్ జిల్లాలోని నాంరూప్ ప్రాంతానికి వెళతారు

అక్కడ అస్సాం వ్యాలీ ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించనున్న అమోనియా-యూరియా ప్రాజెక్టుకు భూమిపూజ నిర్వహిస్తారుఈ సందర్భంగా జరిగే సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

డిసెంబర్ 20న గువాహటిలోని లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారుఇది అస్సాం రాష్ట్ర రవాణా వ్యవస్థఆర్థిక వృద్ధిఅంతర్జాతీయ గుర్తింపులో ఒక విప్లవాత్మక ప్రస్థానంగా 

నిలవనుంది.

ఈ కొత్త టెర్మినల్ భవనాన్ని సుమారు 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారుఇది ఏటా దాదాపు 1.3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించగలదువిమానాశ్రయంలో రన్‌వేఎయిర్‌ఫీల్డ్ వ్యవస్థలుఎప్రాన్‌ ప్రాంతాలుటాక్సీవేలను భారీగా ఆధునీకరించారు.

దేశంలోని తొలి ప్రకృతి నేపథ్య విమానాశ్రయ టెర్మినల్‌గా ఈ విమానాశ్రయం ప్రత్యేకతను చాటుకుంటోందిఅస్సాం 

జీవవైవిధ్యంసాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా వెదురు పూల ఇతివృత్తంతో దీనిని రూపొందించారుఈశాన్య రాష్ట్రాల నుంచి సేకరించిన సుమారు 140 మెట్రిక్ టన్నుల వెదురును దీని నిర్మాణంలో ఉపయోగించారుకాజీరంగా జాతీయ 

ఉద్యానవనాన్ని తలపించే పచ్చని ప్రకృతి దృశ్యాలుసంప్రదాయ ‘‘జాపి’’ ఆకృతులుప్రసిద్ధ ఒంటికొమ్ము ఖడ్గమృగం చిహ్నాలు ఇక్కడ కొలువుదీరాయిఅస్సాం రాష్ట్ర పుష్పమైన ‘‘కోపౌ’’ను పోలి ఉండేలా 57 ఆర్కిడ్ స్తంభాలను ఏర్పాటు చేశారుదాదాపు 

లక్ష దేశీయ మొక్కలతో కూడిన ప్రత్యేకమైన 'స్కై ఫారెస్ట్.. విమానాశ్రయానికి విచ్చేసే ప్రయాణికులకు అటవీ అనుభూతిని అందిస్తుంది.

ప్రయాణికుల సౌకర్యంభద్రత కోసం అత్యున్నత డిజిటల్ ఆవిష్కరణలను ఈ టెర్మినల్ లో ప్రవేశపెట్టారువేగవంతమైన

అంతరాయం లేని భద్రతా తనిఖీల కోసం ఫుల్-బాడీ స్కానర్లను ఏర్పాటు చేశారుడిజియాత్రా సౌకర్యంతో కాంటాక్ట్‌లెస్ (స్పర్శ లేకుండాప్రయాణ సౌకర్యంస్వయంచాలక సామాను నిర్వహణ వ్యవస్థఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్కృత్రిమ మేధ ఆధారిత 

విమానాశ్రయ కార్యకలాపాలు వంటి సౌకర్యాలు ప్రయాణికులకు అత్యంత సులభంగాసురక్షితమైనసమర్థవంతమైన ప్రయాణాలను అందిస్తాయి..

నాంరూప్ ప్రాంతానికి వెళ్లే ముందు డిసెంబర్ 21వ తేదీ ఉదయం స్వాహిద్ స్మారక క్షేత్రాన్ని సందర్శించి అస్సాం ఉద్యమ 

అమరవీరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పిస్తారుఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ ప్రజా ఉద్యమంలో.. 

విదేశీయులు లేని అస్సాంను నిర్మించడంరాష్ట్ర అస్తిత్వాన్నిసంస్కృతిని కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశ్యం.

మరుసటి రోజు దిబ్రూగఢ్ జిల్లా నాంరూప్‌లోని బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో కొత్త బ్రౌన్‌ఫీల్డ్ అమోనియా-యూరియా ఎరువుల ప్రాజెక్టుకు ప్రధాని భూమిపూజ చేస్తారు.

రైతుల సంక్షేమంపై ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకెళ్తూ.. 

రూ.10,600 కోట్ల అంచనా వ్యవయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారుఇది అస్సాంతో పాటు పొరుగున ఉన్న ఈశాన్య 

రాష్ట్రాల ఎరువుల అవసరాలను కూడా తీరుస్తుందిదీనివల్ల రైతులకు సకాలంలోతక్కువ ధరకే ఎరువులు అందుబాటులోకి 

వస్తాయివిదేశాల నుంచి ఎరువుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందిఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగాపరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది.  ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందిపారిశ్రామిక పునరుజ్జీవనానికిరైతు సంక్షేమానికి ఈ ప్రాజెక్టు పునాదిగా నిలవనుంది.

 

***


(रिलीज़ आईडी: 2206590) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , Odia , English , Khasi , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada