ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిసెంబర్ 20న పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధానమంత్రి


పశ్చిమబెంగాల్ లో రూ. 3,200 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారుల

ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ప్రధానమంత్రి

నదియా జిల్లాలో 66 కిలోమీటర్ల పొడవైన నాలుగు లైన్ల బరజగులి- కృష్ణానగర్ సెక్షన్ (ఎన్ హెచ్ 34) రహదారిని ప్రారంభించనున్న ప్రధాని

కోల్‌కతా, సిలిగురి నగరాల మధ్య అత్యంత కీలకమైన అనుసంధాన మార్గాలుగా మారనున్న ఈ ప్రాజెక్టులు

प्रविष्टि तिथि: 19 DEC 2025 2:28PM by PIB Hyderabad

డిసెంబర్ 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారుఉదయం సుమారు 11:15 గంటలకు నదియా జిల్లాలోని రాణాఘాట్ లో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిప్రారంభించనున్నారు.  అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.

సుమారు రూ. 3,200 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు.

నదియా జిల్లాలో ఎన్‌హెచ్-34లోని 66.7 కిలోమీటర్ల పొడవైన బరజగులి కృష్ణానగర్ సెక్షన్‌ను నాలుగు లైన్లుగా విస్తరించే పనులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారుదీంతోపాటు ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఎన్‌హెచ్-34లోని 17.6 కిలోమీటర్ల పొడవైన బరాసత్-బరజగులి సెక్షన్‌ను నాలుగు లైన్లు రహదారిగా అభివృద్ధి చేసే పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

ఈ రెండు ప్రాజెక్టులు కోల్‌కతాసిలిగురి మధ్య ఒక కీలకమైన అనుసంధాన వారధిగా పనిచేయనున్నాయిఇవి ప్రయాణ సమయాన్ని సుమారు గంటల వరకు తగ్గించేందుకు సహాయపడతాయితద్వారా ట్రాఫిక్ తగ్గివాహనాల రాకపోకలు వేగంగాసులభంగా జరగనున్నాయివాహనాల నిర్వహణ ఖర్చులు కూడా తగ్గనున్నాయికోల్‌కతాకు పశ్చిమ బెంగాల్‌లోని ఇతర జిల్లాలతో పాటు పొరుగు దేశాలతో కూడా అనుసంధానాన్ని మెరుగుపరుస్తాయిఈ ప్రాజెక్టులు స్థానికంగా ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ఆ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడనున్నాయి.

 

***


(रिलीज़ आईडी: 2206512) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam