రైల్వే మంత్రిత్వ శాఖ
వందే భారత్ రైళ్లలో ప్రాంతీయ వంటకాలు.. ప్రయాణికులకు మరిన్ని అనుభూతులు
పలకరించనున్న మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, కాశ్మీర్ ప్రాంతాల రుచులు
प्रविष्टि तिथि:
18 DEC 2025 2:08PM by PIB Hyderabad
ఐఆర్‌సీటీసీ ద్వారా భారతీయ రైల్వేలు ప్రాంతీయ వంటకాలను వందే భారత్ రైళ్లలో అందజేయడం మొదలుపెట్టింది. ప్రయాణికులు భిన్న సంస్కృతులకు చెందిన ఆహారాన్నీ, ప్రామాణిక స్థానిక రుచుల్ని ఆరగించేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ చొరవ.. భారతదేశంలోని వైవిధ్యమైన విశిష్ట వంటకాల్ని నేరుగా ప్రయాణికుల చెంతకు చేర్చుతోంది.. వారు కూర్చున్న సీట్లలో నుంచి మరెక్కడికో వెళ్లనక్కరలేకుండానే, హాయిగా ప్రాంతీయ వంటకాల మజాను పొందే సౌలభ్యాన్ని వారికి కల్పిస్తోంది.
మహారాష్ట్రకు చెందిన కంద పోహాతోపాటు ఆంధ్రప్రదేశ్ వంటకమైన దక్షిణ భారతీయ దొండకాయ కారం పొడి ఫ్రైతో పాటు ఆంధ్రా కోడి కూరనూ 20101/20102 నంబర్లతో నాగపూర్, సికిందరాబాద్ల మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించే వారు రుచి చూడవచ్చు. గుజరాతీ ఆహార పదార్థాలైన మేథీ థెప్లాను నంబర్ 20901 ఎంఎంసీటీ-జీఎన్‌సీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లోనూ, మసాలా లౌకీని 26902 నంబరు ఎస్‌బీఐబీ-వీఆర్ఎల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లోనూ సరఫరా చేస్తున్నారు. ఒడిశా వంటకం ఆలూ ఫూల్‌కోపీని నంబర్ 22895 హౌరా-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆస్వాదించవచ్చు.
కేరళ సంప్రదాయ భోజనాన్ని కాసర్గోడ్, త్రివేండ్రం మధ్య నడుస్తున్న 20633/34 నంబర్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లలోనూ, మంగళూరు, త్రివేండ్రమ్ మధ్య నడిచే 20631/32 నంబర్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ అందిస్తున్నారు. దీనిలో అన్నం, పచ్చక్క చెరుపయార్ మెళుక్కు పెరటి, కడల కరీ, కేరళ పరాఠా, సాదా పెరుగు, అప్పంతో పాటు పలడ పాయసం కూడా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ కోశా పనీర్‌ను నంబర్ 20872 ఆర్ఓయూ-హెచ్‌డబ్ల్యూహెచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో, ఆలూ పాటోల్ భజాను నంబరు 22895 హెచ్‌డబ్ల్యూహెచ్-పూరీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అందజేస్తున్నారు. బీహార్‌కు చెందిన ప్రత్యేకమైన చంపారణ్ పనీర్‌ను నంబరు 22349 పీఎన్‌బీఈ-ఆర్ఎన్‌సీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో, చంపారణ్ చికెన్‌ను 22348 -హెచ్‌డబ్ల్యూహెచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆరగించవచ్చు.


అంబల్ కద్దూ, జమ్మూ చనా మసాలాలు సహా డోగ్రీ పద్ధతి వంటకాల్ని 26401–02, 26403–04 నంబర్ల వందే భారత్ రైళ్లలోనూ, టొమాటో చమన్, కేసర్ ఫిర్నీ వంటి కాశ్మీరీ ప్రత్యేక తినుబండారాల్ని 26401/02, 26403/04 నంబర్లతో ఉన్న ఎస్‌వీడీకే-ఎస్ఐఎన్ఏ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోనూ అందిస్తున్నారు.


నంబరు 22229 సీఎస్‌ఎంటీ-ఎంఏఓ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మహారాష్ట్ర మసాలా ఉప్మా దొరుకుతోంది. నంబరు 22302 ఎన్‌జేపీ-హెచ్‌డబ్ల్యూహెచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పశ్చిమ బెంగాల్ ముర్గీర్ ఝోల్‌ను వడ్డిస్తున్నారు.


భారతీయ రైల్వేలు భారత విశిష్ట పాకశాస్త్ర వైవిధ్యాన్ని అందరికీ పరిచయం చేస్తోంది. సరికొత్త రుచులతో.. రైలు ప్రయాణాన్ని ఆనందించండి.
***
(रिलीज़ आईडी: 2206117)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam