సాంస్కృతిక విస్తరణను ప్రోత్సహించడానికి... కంటెంట్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించడానికి... ప్రజా సేవ దృక్పథాన్ని కొనసాగించడానికి ప్రసార భారతి 2025 కంటెంట్ సిండికేషన్ పాలసీ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ ముసాయిదాను ప్రజల సంప్రదింపుల కోసం ప్రసార భారతి వెబ్‌సైట్‌లో ఉంచారు.
మీడియా రంగంలోని కీలక వాటాదారులైన ఓటీటీ వేదికలు, లీనియర్ టీవీ ప్రసారకులు, రేడియో నెట్‌వర్క్‌లు, టెలికాం క్యారియర్లు, ఐపీటీవీ ఆపరేటర్లు, కంటెంట్ అగ్రిగేటర్లు నిర్మాణాత్మక సంప్రదింపులు జరిపారు.
దూరదర్శన్, ఆకాశవాణి ఉత్పత్తి చేసే కంటెంట్... ఆర్కైవ్ చేసిన జాతీయ, ప్రాంతీయ కంటెంట్, ప్రత్యక్ష ప్రసారాల (ప్రభుత్వ కార్యక్రమాలు, పండగలు, క్రీడలు మొదలైనవి) ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం ఈ విధాన ప్రణాళిక లక్ష్యం. ఇది ప్రసార భారతి ఓటీటీ వేదికపై పబ్లిష్ చేసిన డిజిటల్-ఫస్ట్ కంటెంట్‌నూ పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈ ముసాయిదా విధానం ప్రసార భారతి యాజమాన్యంలోని కమిషన్డ్, సహ-నిర్మాణం, లైసెన్స్ పొందిన, ఇతర కంటెంట్‌ను మానిటైజ్ చేయాలని ప్రతిపాదిస్తుంది.
ఈ కంటెంట్ సిండికేషన్ పాలసీ ముసాయిదా... ప్రసార భారతి కంటెంట్ పరిధిని విస్తరించడానికి, ప్రపంచ వ్యాప్తంగా భారత సాంస్కృతిక ఉనికిని బలోపేతం చేయడానికి దేశీయ, అంతర్జాతీయ వేదికలతో వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినది.
ఇది ఫ్లాట్ ఫీజు, ఆదాయంలో వాటా, ఆదాయ వాటాతో కనీస హామీ వంటి సౌకర్యవంతమైన లైసెన్సింగ్ నమూనాలను అందిస్తుంది.
ఈ సమాచారాన్ని ఈరోజు లోక్‌సభలో శ్రీ సెల్వగణపతి టి.ఎం. అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ సమర్పించారు.
***