సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీబీఎఫ్‌సీ పరిధిలో లేని ఓటీటీ కంటెంట్: ఐటీ నియమాల ప్రకారం మూడంచెల సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు

నాడు పోస్టు చేయడమైనది: 17 DEC 2025 2:51PM by PIB Hyderabad

సినిమాటోగ్రఫీ చట్టం-1952 ప్రకారం ఏర్పాటైన చట్టబద్ధమైన సంస్థ కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సీబీఎఫ్‌సీ). ఇది ప్రజల కోసం ప్రదర్శించడానికి వీలుగా చలన చిత్రాలను పరిశీలించి, ధ్రువీకరిస్తుంది

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తిత్వ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు-2021లోని పార్ట్ III లోని నిబంధనల ప్రకారం ఓటీటీ కంటెంట్‌ను నియంత్రిస్తారు.

చట్టం నిషేధించిన అంశాలను ఓటీటీలు ప్రచురించకూడదని, నియమాల్లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా వయస్సుల వారీగా కంటెంట్‌ను వర్గీకరించాలని ఈ కోడ్ ఆఫ్ ఎథిక్స్ చెబుతుంది.

విషయ సంబంధిత ప్రమాణాలకు తగినట్టు ఉండేలా, ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేలా మూడంచెల సంస్థాగత వ్యవస్థను ఈ నియమాలు రూపొందించాయి.

మొదటి అంచె: ప్రచురణకర్తల స్వీయ నియంత్రణ

రెండో అంచె: ప్రచురణకర్తలకు చెందిన నియంత్రణ సంస్థలతో స్వీయ నియంత్రణ

మూడో అంచె: కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ

ఐటీ నియమాలు-2021 ప్రకారం, ఓటీటీ కంటెంటుపై వచ్చిన ఫిర్యాదులను మొదటి దశ పరిష్కార వ్యవస్థ ప్రకారం అంటే ప్రచురణకర్త స్వీయ నియంత్రణ ద్వారా తగిన చర్యలు తీసుకునేందుకు సంబంధిత ఓటీటీ వేదికలకు పంపిస్తారు.

డాక్టర్ ఎంకే విష్ణు ప్రసాద్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2205265) సందర్శకుల సూచీ సంఖ్య : : 79
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Malayalam , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Tamil , Kannada