ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-IIతో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 15 DEC 2025 11:48PM by PIB Hyderabad

గౌరవ రాజు గారు,

నాకునా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయ పూర్వక ధన్యవాదాలుభారత్-జోర్డాన్ మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సానుకూల ఆలోచనలను మీరు ప్రతిపాదించారుమీ స్నేహానికిభారత్ పట్ల చూపిన ప్రాధాన్యతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఈ ఏడాది మన రాజకీయ సంబంధాల విషయమై 75వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాంరాబోయే ఎన్నో ఏళ్లపాటు నూతనోత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ కీలక ఘట్టం స్ఫూర్తినిస్తూనే ఉంటుందిఇవాళ్టి సమావేశం మన బంధానికి నూతనోత్తేజాన్ని ఇస్తుందనిమరింత దృఢపరుస్తుందని నేను విశ్వసిస్తున్నానువాణిజ్యంఎరువులుడిజిటల్ సాంకేతికతమౌలిక సదుపాయాలుప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకుంటాం.

గౌరవ రాజు గారు,

ప్రపంచ స్థాయిలో మనం సన్నిహిత సంబంధాలను కొనసాగించాంగాజా విషయంలో మీరు ప్రారంభం నుంచి క్రియాశీలకంగాసానుకూలంగా వ్యవహరించారుఆ ప్రాంతంలో శాంతిస్థిరత్వం నెలకొంటుందని మేమంతా విశ్వసిస్తున్నాంఉగ్రవాదంపై మాకు స్పష్టమైనఉమ్మడి వైఖరి ఉందిఉగ్రవాదంతీవ్రవాదంతీవ్రవాద భావజాలానికి వ్యతిరేకంగా మీ నాయకత్వంలో మానవాళికి బలమైనవ్యూహాత్మక సందేశాన్ని జోర్డాన్ అందించిందిఈ కీలక రంగంలో సహకారాన్ని మరింత బలపరచటంపై ప్రత్యేక సమావేశంలో మనం చర్చించాంమీరు 2018లో భారతదేశాన్ని సందర్శించినప్పుడుఇస్లామిక్ వారసత్వంపై జరిగిన ఓ సదస్సులో మనం పాల్గొన్నాంహింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంపై జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశం సందర్భంగా 2015లో మనం మొదటిసారి కలుసుకున్న విషయం నాకు గుర్తుందిఅప్పుడు మీరు ఈ అంశంపై స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారుమితవాద ప్రోత్సాహానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రాంతీయ శాంతి కోసమే కాకప్రపంచ శాంతికి అత్యంత కీలకమైనవిఈ దిశగా మేం కలిసికట్టుగామరింత పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతాంపరస్పర సహకారంలోని అంశాలన్నింటినీ మేం మరింత బలోపేతం చేస్తాంఅద్భుతమైన ఆతిథ్యమిచ్చిన మీకుజోర్డాన్ ప్రజలకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

 

***


(रिलीज़ आईडी: 2204522) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam