హోం మంత్రిత్వ శాఖ
భారత పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి జయంతి.. నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
ప్రజాసేవకు అంకితమైన నేత ముఖర్జీ గారు.. రాజ్యాంగంపై ఆయనకున్న లోతైన అవగాహన
ప్రభుత్వ పదవుల్లో ఆయన పదవీకాలాన్ని నిర్వచించింది
ఆయన జీవితం, ఆయన చేసిన పనులు మన ప్రజాస్వామ్య ప్రస్థానానికి స్ఫూర్తిదాయకం
నాడు పోస్టు చేయడమైనది:
11 DEC 2025 12:26PM by PIB Hyderabad
భారత పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు.
ఎక్స్ వేదికలో శ్రీ అమిత్ షా ఒక సందేశాన్ని ఇలా రాశారు.. ‘‘భారత పూర్వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి జయంతి సందర్బంగా ఆయనకు ఇవే నివాళులు. ముఖర్జీ గారు ప్రజాసేవకు అంకితమైన నేత. రాజ్యాంగంపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రభుత్వ పదవుల్లో ఆయన పదవీకాలానికి భాష్యం చెప్పింది. ఆయన జీవితం, ఆయన చేసిన పనులు మన ప్రజాస్వామ్య ప్రస్థానానికి స్ఫూర్తినిస్తాయి.’’
(రిలీజ్ ఐడి: 2202157)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali-TR
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam