ప్రధాన మంత్రి కార్యాలయం
భారత ప్రధానమంత్రికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయటం గురించి చర్చించిన ఇద్దరు నాయకులు
ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరిని వ్యక్త్యం చేసిన ఇరువురు నేతలు
న్యాయమైన శాశ్వత శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు: ప్రధాని మోదీ
प्रविष्टि तिथि:
10 DEC 2025 7:59PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడారు.
భారత్-ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో నిరంతర పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనం కోసం సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు నిబద్ధతతో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని గట్టిగా ఖండిస్తున్నట్లు ఇద్దరు ప్రధానులు తెలిపారు. అన్ని రూపాలు, వ్యక్తీకరణలలోని ఉగ్రవాదం పట్ల ఏమాత్రం ఉపేక్షించని విధానాన్ని పునరుద్ఘాటించారు.
పశ్చిమాసియాలోని పరిస్థితిపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. గాజా శాంతి ప్రణాళికను తొందరగా అమలు చేయడంతో సహా ఈ ప్రాంతంలో న్యాయమైన శాశ్వత శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మరోసారి తెలియజేశారు.
భవిష్యత్తులో మరింత విస్తృత ప్రాతిపదికన పనిచేయాలని ఇరువురు నిర్ణయించారు.
(रिलीज़ आईडी: 2202147)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada