ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్‌లో అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపదపై యునెస్కో కమిటీ 20వ సమావేశాల ప్రారంభంపై ప్రధానమంత్రి హర్షం
प्रविष्टि तिथि:
08 DEC 2025 8:53PM by PIB Hyderabad
అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపదపై యునెస్కో కమిటీ 20వ సమావేశాలు భారత్లో ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. సజీవ సంస్కృతి , సంప్రదాయాలను పరిరక్షించడం, వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే ఉమ్మడి లక్ష్యంతో 150కి పైగా దేశాల ప్రతినిధులను ఈ సమావేశాలు ఒకచోట చేర్చాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ముఖ్యమైన సమావేశాన్ని చారిత్రక ఎర్రకోటలో నిర్వహించడం దేశానికి చాలా గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. సమాజాలను, తరాలను అనుసంధానించేందుకు సంస్కృతి శక్తిని వినియోగించుకోవడంలో దేశ నిబద్ధతను ఈ సందర్భం ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపదపై యునెస్కో కమిటీ 20వ సమావేశాలు భారత్లో ప్రారంభమవడం అత్యంత సంతోషకరం. మన ఉమ్మడి సజీవ సంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో 150కి పైగా దేశాల ప్రతినిధులను ఈ వేదిక ఒకచోట చేర్చింది. ఈ సమావేశాన్నిముఖ్యంగా ఎర్రకోట వద్ద నిర్వహించడం దేశానికి సంతోషకరం. సమాజాలను, తరాలను కలిపేందుకు సంస్కృతి శక్తిని ఉపయోగించుకోవాలనే మా నిబద్ధతను కూడా ఇది ప్రతిబింబిస్తుంది’’.
(रिलीज़ आईडी: 2201213)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam