ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వందేమాతరం 150 సంవత్సరాల ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్ సభలో ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 08 DEC 2025 4:30PM by PIB Hyderabad

గౌరవనీయులైన అధ్యక్షా,

ఈ ప్రత్యేక సందర్భంలో సామూహికంగా చర్చించేందుకు ముందుకు వచ్చినందుకు మీకుఈ సభలోని గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని శక్తిత్యాగస్పూర్తినిరాడంబరతను నింపిన ఆ మంత్రాన్నిఆ స్పష్టమైన పిలుపును గౌరవంగా గుర్తుచేసుకుంటూ.. ఈ సభలో వందేమాతరాన్ని స్మరించుకోవడం మనందరికీ గొప్ప గౌరవంవందేమాతరం 150 సంవత్సరాల చారిత్రక ఘట్టానికి మనం సాక్షులుగా నిలబడటం చాలా గర్వకారణంఈ కాలం చరిత్ర విస్తృతి నుంచి లెక్కలేనన్ని సంఘటనలను మన ముందుకు తీసుకువస్తుందిఈ చర్చ ఖచ్చితంగా సభ నిబద్ధతను ప్రతిబింబిస్తుందికానీ మనం ఈ క్షణాన్ని సమష్టిగా ఉపయోగించుకుంటే రాబోయే తరాలకుప్రతి తరానికి కూడా నేర్చుకునే మూలంగా ఉపయోగపడుతుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

 

చరిత్రలోని అనేక స్ఫూర్తిదాయకమైన అధ్యాయాలు మరోసారి మన ముందు సజీవంగా ఉన్న కాలమిదిఇటీవలే మన రాజ్యాంగం 75 సంవత్సరాల వేడుకను ఎంతో గర్వంగా జరుపుకున్నాంఅదే విధంగా దేశం సర్దార్ వల్లభాయ్ పటేల్భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని కూడా జరుపుకుంటోందిమనం గురు తేగ్ బహదూర్ గారి 350వ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకున్నాంనేడు వందేమాతరం 150 సంవత్సరాల సందర్భంగా ఈ సభ సమిష్టి శక్తిని అనుభవించడానికి ప్రయత్నిస్తూ మనం ఇక్కడ నిలబడి ఉన్నాంఈ 150 సంవత్సరాల ప్రయాణం అనేక దశలను దాటింది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు.. దేశం బానిసత్వ సంకెళ్లలో జీవించాల్సి వచ్చిందిఅది 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితి సంకెళ్లలో చిక్కుకుందిశతాబ్ది ఉత్సవాలను గొప్ప వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో భారత రాజ్యాంగం గొంతు కోశారువందేమాతారానికి 100 సంవత్సరాలు నిండినప్పుడు దేశభక్తి కోసం జీవించిమరణించిన వారు జైళ్ల పాలయ్యారుదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి శక్తినిచ్చిన ఆ పాటదాని శత జయంతిని చేరుకునే సమయంలో మన చరిత్రలో ఒక చీకటి అధ్యాయం విప్పుకుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

ఆ అధ్యాయం గొప్పతనాన్నిఆ వైభవాన్ని తిరిగి స్థాపించేందుకు ఈ 150వ సంవత్సరం మనకు అవకాశాన్ని ఇస్తోందిఈ అవకాశాన్ని ఈ సభ గానీదేశం గానీ వదులుకోకూడదని నేను భావిస్తున్నాను. 1947లో దేశాన్ని చివరికి స్వాతంత్ర్యానికి నడిపించింది వందేమాతరమేస్వాతంత్ర్య పోరాటానికి భావోద్వేగ నాయకత్వం ‘వందేమాతరం’ అనే విజయవంతమైన నినాదంలోనే నిక్షిప్తమైంది.

 

గౌరవనీయలైన అధ్యక్షా,

వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ చర్చను ప్రారంభించడానికి నేను నేడు మీ ముందు నిలబడి ఉన్నానుఇక్కడ అధికార పక్షంగానీప్రతిపక్షంగానీ ఏదీ లేదుఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనందరికీ ఇది లోతైన భావాన్ని కలిగించే సందర్భంవందేమాతరం వల్లే దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులు స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపారుదాని ఫలితమే నేడు మనమందరం ఇక్కడ కూర్చున్నాంఅందుకే పార్లమెంటు సభ్యులందరూప్రజాప్రతినిధులందరూ వందేమాతరానికి రుణపడి ఉన్నామని అంగీకరించేందుకు ఇది ఒక పవిత్ర క్షణందాని నుంచి స్ఫూర్తి పొంది వందేమాతరం ద్వారా దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఏకం చేసిన స్ఫూర్తిని మనం మరోసారి పునరుద్ధరించాలిఉత్తరందక్షిణంతూర్పుపశ్చిమం ఇలా దేశమంతా ఒకే స్వరంతో ముందుకు సాగిందిమరోసారి మనల్ని కలిసి నడవాలనిదేశాన్ని మనతో పాటు తీసుకువెళ్లాలని ఈ క్షణం పిలుస్తోందిమన స్వాతంత్ర్య సమరయోధులు కన్న కలలువందేమాతరం 150 మనకు స్పూర్తిగాశక్తిగా మారి.. 2047 నాటికి భారత్ ను స్వావలంబనగాఅభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మనల్ని ప్రేరేపించాలివందేమాతరం అనే ఈ సందర్భం ఆ ప్రతిజ్ఞను పునరుద్ఘాటించడానికి మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

దాదామీరు బాగానే ఉన్నారాలేదులేదుకొన్నిసార్లు ఈ వయసులో కూడా అలాంటివి జరుగుతాయి.

1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం తీవ్ర కుదుపునకు గురైన సమయంలోబంకిమ్ చంద్ర గారు 1875లో వందేమాతరం రచించిన సమయంలో దీని ప్రయాణం మొదలైందివారు భారత్‌పై అనేక రకాలుగా ఒత్తిని పెంచుతూలెక్కలేనన్ని దారుణాలకు పాల్పడుతూదేశ ప్రజలను బలవంతంగా హింసకు గురిచేశారుఆ సమయంలో వారి జాతీయ గీతం ‘‘గాడ్ సేవ్ ది క్వీన్’’ను భారత్‌లోని ప్రతి ఇంట్లోనూ ప్రచారం చేయడానికి కుట్ర జరిగిందిఅలాంటి సమయంలోనే బంకిం దా ఆ సవాలును స్వీకరించి తాను ఎదుర్కొన్న దానికంటే ఎక్కువ శక్తితో స్పందించాడుఅప్పుడే వందేమాతరం పుట్టిందికొన్ని సంవత్సరాల తరువాత 1882లో అతను ఆనందమఠం రాసినప్పుడు ఈ పాటను అందులో చేర్చాడు.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

వేల సంవత్సరాలుగా దేశ నరనరాల్లో నిక్షిప్తమై ఉన్న ఆ ఆలోచనను వందేమాతరం పునరుద్ధరించిందిఆయన మనకు అదే భావననుఅదే విలువలనుఅదే సంస్కృతినిసంప్రదాయాన్నిలోతైనఉన్నతమైన పదాల ద్వారా బహుమతిగా ఇచ్చారువందేమాతరం కేవలం రాజకీయ స్వేచ్ఛ కోసం ఒక మంత్రం కాదుబ్రిటిష్ వారు వెళ్లిపోవాలనితద్వారా మనం మన సొంత మార్గంలో స్వతంత్రంగా నిలబడగలమని చెప్పే పిలుపు మాత్రమే కాదుఅది అంతకు మించి స్ఫూర్తినిచ్చిందిఈ మాతృభూమిని విముక్తం చేయడానికి స్వాతంత్ర్య పోరాటం ఒక పవిత్రమైన యజ్ఞంభారత మాతను తన సంకెళ్ల నుంచి విడిపించేందుకు సాగిన ధర్మ యుద్ధంవందేమాతరం నినాదం సాంస్కృతిక పునాదిని పరిశీలిస్తే దాని విలువల పరంపరం వేద యుగం వరకు సాగిందిమనం వందేమాతరం పలికినప్పుడల్లా వేద కాలం నాటి అదే ఆలోచన వస్తుంది: ‘‘భూమి తల్లి భూమి పుత్రుడు’’, ‘‘భూమి నా తల్లినేను ఆమె కొడుకును’’

 

గౌరవనీయులైన అధ్యక్షా,

శ్రీ రాముడు కూడా లంక వైభవాన్ని తిరస్కరించినప్పుడు వ్యక్తం చేసిన భావన ఇదే... ‘‘తల్లిమాతృభూమి స్వర్గం కంటే గొప్పవి’’వందేమాతరం ఈ ఉన్నతమైన సాంస్కృతిక సంప్రదాయానికి ఆధునిక రూపం.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

బంకిం దా వందేమాతరాన్ని రచించినప్పుడు అది సహజంగానే స్వాతంత్ర్య ఉద్యమ గొంతుకగా మారిందితూర్పు నుంచి పడమర వరకుఉత్తరం నుంచి దక్షిణం వరకువందేమాతరం ప్రతి భారతీయుడి సంకల్పంగా మారిందివందేమాతరాన్ని ప్రశంసిస్తూ.. ఈ కింది వాక్యాలు రాశారు.

 

"స్వాతంత్ర్య వేదికపై మాతృభూమి ఆనందంతో ఉందిస్వాతంత్ర్య వేదికపై మాతృభూమి ఆనందంతో ఉందిస్వార్థాన్ని త్యజించే బలిదానం ఇదిఈ మాటలే వందేమాతరంఇది జీవిత మంత్రం కూడాఇది ప్రపంచాన్ని జయించే మంత్రం కూడా.. ఇది శక్తిని ఆవహించే మంత్రంఈ మాటలే వందేమాతరంవేడి రక్తంతో లిఖించండిహృదయాన్ని చీల్చి వెలువడే వీరుడి గర్వం ఇదిఈ మాటలే వందేమాతరం.’’

అర్థం.. మాతృభూమి స్వాతంత్ర్యపు బలిపీఠంపై స్వార్థాన్ని సంతోషంగా త్యాగం చేయడమే-ఈ మాటలే వందేమాతరం.

ఇది జీవాన్ని ఇచ్చే మంత్రంలోకాన్ని జయించే మంత్రంఇది శక్తిని ఆవాహనం చేసే మంత్రం-ఈ మాటలే వందేమాతరం.

వెచ్చని రక్తంతో లిఖించండిగుండెను చీల్చి రాయండి-ఇదే వీరుల గర్వం-ఈ మాటలే వందేమాతరం.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

కొన్ని రోజుల క్రితం వందేమాతరం 150 వేడుకలు ప్రారంభమైనప్పుడు ఆ కార్యక్రమంలో వందేమాతరం వేల ఏళ్ల సాంస్కృతిక శక్తికి ప్రతీక అని నేను చెప్పానుఇది స్వాతంత్ర్య స్పూర్తిని మాత్రమే కాకుండాస్వతంత్ర భారతదేశ ధృక్పథాన్ని కూడా ప్రతిబింబించిందిబ్రిటిష్ పాలన సమయంలో దేశాన్ని బలహీనంగాపనికి రానిదిగాసోమరిగాచిత్రీకరించడం ఒక ఫ్యాషన్ గా మారిందిభారత్‌ను అన్ని విధాలుగా తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందిఆ బ్రిటిష్ ప్రభావంలో పెరిగిన వారు కూడా అదే భాషఅదే భావజాలాన్ని అవలంభించారుఆ అల్పత్వ భావన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకుభారత్ శక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి బంకిమ్ దా తన శక్తిమంతమైన గీతంలో ఇలా రారు.

 

"నీవు పది ఆయుధాలు ధరించిన దుర్గాదేవివి.. కమల దళాలపై విహరించే కమలవు... విద్యను ప్రసాదించే వాణివినిన్ను నమస్కరిస్తున్నానుకమల స్వరూపిణికి నమస్కరిస్తున్నానునిర్మలమైనసాటిలేనిమంచి నీటినిమంచి ఫలాలను ఇచ్చే తల్లినీకు నేను నమస్కరిస్తున్నానువందే మాతరం!

 

దీని అర్థం.. భారత మాత జ్ఞానంశ్రేయస్సుకు దేవతగా ఉండటమే కాదు..తన శత్రువుల ముందు తన ఆయుధాలతో నిలబడే యోధురాలు కూడా దుర్గా.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

ఈ మాటలుఈ భావోద్వేగంఈ స్ఫూర్తి వలస పాలనలో నిరాశలో కూరుకుపోతున్న భారతీయులను ఉత్తేజపరిచిందిఈ పంక్తులు కోట్లాది మంది దేశ ప్రజలకు ఈ పోరాటం కేవలం ఒక భూమి కోసం కాదనికేవలం అధికార పీఠం కోసం కాదనిబానిసత్వ సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికిదాని పురాతన సంప్రదాయాలుగొప్ప సంస్కృతిఅద్భుతమైన చరిత్రకు పునర్జన్మనివ్వడం కోసం అని తెలియజేశాయి.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

ప్రజలతో వందేమాతరానికి ఉన్న లోతైన అనుబంధం మన స్వాతంత్ర్య పోరాట సుదీర్ఘ గాథ ద్వారా వ్యక్తమవుతుంది.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

సింధుసరస్వతికావేరిగోదావరిగంగా లేదా యమున ఏ నది గురించి మాట్లాడినా దాని పక్కనే ఒక సాంస్కృతిక ప్రవాహంఅభివృద్ధి ప్రయాణంమానవ జీవిత చరిత్ర కూడా ప్రవహిస్తుందికానీ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలోని ప్రతి దశ వందేమాతరం భావోద్వేగాల ద్వారానే ప్రవహించిందని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారాఅది దాని ఒడ్డున వికసించిందిఅలాంటి కవితాత్మక భావోద్వేగం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

 

గౌరవనీయులైన అధ్యక్షా,

1857 తర్వాత భారత్‌లో తమ పాలన ఎక్కువ కాలం నిలబడటం కష్టమని బ్రిటిష్ వారికి అర్థమైందివారు దేశాన్ని విభజించకపోతే ప్రజలను విడగొట్టి తమ మధ్య గొడవలు సృష్టించకపోతే వారి పాలన మనుగడ సాగించదని వారు గ్రహించారుఅందుకే ‘‘విభజించి పాలించు’’ అనే విధానాన్ని అవలంబించారుబెంగాల్‌ను తమ ప్రయోగశాలగా చేసుకున్నారుఎందుకంటే బెంగాల్ మేధో బలం ఒకప్పుడు యావత్ దేశానికి దిశానిర్దేశం చేసిశక్తినిస్ఫూర్తిని ఇచ్చిందని వారికి తెలుసుఅందుకే ఆ శక్తిని బలహీనపరచాలని బ్రిటిష్ వారు కోరుకున్నారుబెంగాల్ విభజిస్తే దేశమంతా విచ్ఛిన్నమవుతుందనిఅప్పుడు తాము కోరుకున్నంత కాలం పాలించవచ్చని వారు ఆలోచించారు. 1905లో వారు బెంగాల్‌ను విభజించారుకానీ ఆ పాపం చేసినప్పుడు వందేమాతరం ఒక శిలలా స్థిరంగా నిలిచిందిఅది ప్రతి వీధిప్రతి మూల గొంతుకగా మారిందిబెంగాల్ ఐక్యత కోసం ప్రతిధ్వనించిందిఆ నినాదం ప్రజల స్ఫూర్తిగా మారిందిబెంగాల్ విభజనతోబ్రిటిష్ వారు భారతదేశాన్ని మరింత బలహీనపరచడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారుకానీ వందేమాతరం ఒకే గొంతుకగాఐక్యంగావారికి నిరంతరం పెరుగుతున్న సవాలుగాదేశానికి బలాన్నిచ్చే శిలగా మారిందిమన దేశంలోని చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టలేదువారిని కొరడాలతో కొట్టారుచిన్న వయసులో వారిని జైలులో పడేశారుఆ రోజుల్లోముఖ్యంగా బెంగాల్ సందులలోవందేమాతరం జపిస్తూ ఉదయం ఊరేగింపులు తప్పకుండా జరిగేవివారు బ్రిటిష్ వారికి నిరంతరం ఒక ముల్లుగా మారారుఆ సమయంలోబెంగాల్ అంతటా ఒక పాట ప్రతిధ్వనించింది:

 

గౌరవనీయులైన అధ్యక్షా,

బెంగాల్ విభజన జరిగిందిఅయినప్పటికీ దాని నేపథ్యంలో భారీ స్వదేశీ ఉద్యమం ఉప్పొంగిందిఆ సమయంలో వందేమాతరం ప్రతిచోటా ప్రతిధ్వనించిందిబెంగాల్ గడ్డ నుంచి అసాధారణమైనదేదో ఉద్భవించిందని బ్రిటిష్ వారు గ్రహించారుబంకిం దా ఈ భావోద్వేగ మంత్రం... సరేధన్యవాదాలుధన్యవాదాలుధన్యవాదాలునేను మీ భావాలను గౌరవిస్తానుబంకిం బాబు... బంకిం బాబుధన్యవాదాలుదాదాధన్యవాదాలునేను మిమ్మల్ని దాదా అని పిలవవచ్చాలేకపోతే మీరు కూడా దీనికి అభ్యంతరం చెప్పవచ్చుఈ ఉద్వేగభరితమైన నినాదం ద్వారా బంకిం బాబు సృష్టించిన భావోద్వేగ ప్రపంచం బ్రిటిష్ వారినివారి మూలాలను కుదిపేసిందిఈ పాటకు అమితమైన బలం ఉండటంతో బ్రిటిష్ వారు బెంబేలెత్తి దీనిపై చట్టపరమైన నిషేధాన్ని విధించారుదానిని పాడినందుకు శిక్షించారుముద్రించినందుకు శిక్షించారుచివరికి వందేమాతరం అనే పదాలను పలికినప్పటికీ శిక్షించారుఅలాంటి కఠిన చట్టాను అమలు చేశారుదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి వందలాది మంది మహిళలు నాయకత్వం వహించారులెక్కలేనంత మంది మహిళలు గొప్ప సంకల్పంతో సహకరించారునేను ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలనుకుంటున్నానుబారిసాల్‌లో వందేమాతరం పాడినందుకు అత్యంత దారుణమైన అకృత్యాలు జరిగాయిఆ బారిసాల్ నేడు భారతదేశంలో భాగం కాదుఆ సమయంలో మన తల్లులుసోదరీలుబారిసాల్ పిల్లలు వీధుల్లోకి వచ్చారుఈ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమతరం గౌరవం కోసం యుద్ధభూమిలోకి అడుగుపెట్టారుఅప్పుడు బారిసాల్‌కు చెందిన ఈ వీర మహిళ శ్రీమ సరోజిని ఘోష్ ఉద్భవించిందివందేమాతరంపై నిషేధం ఎత్తివేసే వరకు తాను ధరించిన గాజులు తీసివేస్తానని ఆమె ప్రకటించిందిదేశంలో ఆ రోజుల్లో గాజులు తీసివేయడం ఒక స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన చర్యగా పరిగణించేవారుఅయినప్పటికీ ఆమెకు వందేమాతరం అన్నిటికంటే గొప్ప భావోద్వేగంఆమె తన బంగారు గాజులు తీసివేసి వందేమాతరంపై నిషేధం ఉపసంహరించుకునే వరకు వాటిని మళ్లీ ధరించనని ప్రతిజ్ఞ చేసిందిఆమె చేసిన గొప్ప ప్రమాణం అలాంటిందిమన దేశంలోని చిన్న పిల్లలు కూడా వదిలిపట్టలేదువారిని కొరడాలతో కొట్టారుచిన్న వయస్సులోనే వారిని జైల్లో వేశారుఆ రోజుల్లో ముఖ్యంగా బెంగాల్ వీధుల్లో వందే మాతరం జపిస్తూ ఉదయం ఊరేగింపులు తప్పక జరిగేవిఅవి బ్రిటిష్ వారికి నిరంతరం ఇబ్బందిగా మారాయిఆ సమయంలో బెంగాల్ అంతటా ఒక పాట ప్రతిధ్వనించింది.

 

‘‘జీవితం సాగిపోతుందిజీవితం ముందుకు సాగుతూనే ఉంటుందిప్రపంచం నీ భుజం మీద వాలి వందేమాతరం పలుకుతుంది’’

అర్థంఓ తల్లీనిన్ను సేవిస్తూ వందేమాతరం జపిస్తూ జీవితం గడిచిపోతేఅలాంటి జీవితం కూడా ధన్యమేబెంగాల్ సందుల్లోని పిల్లలు ఇలా ప్రకటిస్తున్నారుఆ పాట ఆ పిల్లల ధైర్యానికి స్వరంవారి ధైర్యం దేశానికి బలాన్నిచ్చిందిబెంగాల్ సందుల నుంచి ఉద్భవించిన స్వరం మొత్తం దేశానికి స్వరం అయింది. 1905లో హరిత్‌పూర్‌లోని ఒక గ్రామంలో చిన్న పిల్లలు వందేమాతరం నినాదం ఇస్తుండగా బ్రిటిష్ వారు కనికరం లేకుండా వారిని కొరడాతో కొట్టారువారు జీవన్మరణాల మధ్య పోరాటం చేయాల్సి వచ్చిందివారిపై జరిగిన క్రూరత్వం అలాంటిది. 1906లో నాగ్‌పూర్‌లోని నీల్ సిటీ హైస్కూల్ పిల్లలపై బ్రిటిష్ వారు ఇలాంటి దారుణాలకే పాల్పడ్డారువారు చేసిన ఏకైక నేరం ఏంటంటే.. అందరూ కలిసి నిలబడి ఒకే ఒక్క నినాదం చేయడం.. అదే వందేమాతరంవారి బలం ద్వారా ఈ మంత్రం పవిత్ర శక్తిని ప్రదర్శించడానికి ఆ పిల్లలు ప్రయత్నించారుమన ధైర్యవంతులైన విప్లవకారులు భయం లేకుండా ఉరిశిక్షలను స్వీకరించారువారి చివరి శ్వాస వరకు చెప్పిన మాట ఒకటేవందేమాతరంవందేమాతరంవందేమాతరంఖుదీరామ్ బోస్మదన్ లాల్ ధింగ్రారామ్ ప్రసాద్ బిస్మిల్అష్ఫాకుల్లా ఖాన్రోషన్ సింగ్రాజేంద్రనాథ్ లాహిరిరామకృష్ణ బిస్వాస్ ఇలా లెక్కలేనంత మంది వందే మాతరం జపిస్తూ ఉరికొయ్యకు బలయ్యారుఇది వివిధ జైళ్లలో వివిధ ప్రాంతాలలో జరిగిందిహింసించిన వారి ముఖాలు భిన్నంగా ఉన్నాయిభిన్న ప్రజలకు హింసకు గురయ్యారువారి భాషలు భిన్నంగా ఉన్నాయికానీ ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ అనే మంత్రం అందరికీ ఒకటేవందేమాతరంస్వదేశీ విప్లవంలో బ్రిటిష్ వారిని సవాలు చేసిన చిట్టగాంగ్‌ యువకులు కూడా మన చరిత్రలో నిలిచిపోయిన పేర్లుహరగోపాల్ కౌల్పులిన్ బికాష్ ఘోష్త్రిపుర సేన్ దరూ దేశం కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. 1934లో మాస్టర్ సూర్య సేన్ను ఉరితీసినప్పుడు అతను తన సహచరులకు ఒక లేఖ రాశాడుఆ లేఖలో ఒకే ఒక పదం ప్రతిధ్వనించింది.. అదే వందేమాతరం.

 

అధ్యక్షా,

భారతీయులమైన మనం గర్వించాలిశతాబ్దాలుగా లక్షలాది ప్రజలకు ఒకే లక్ష్యం దిశగా ప్రేరణ కలిగిస్తున్నఆ లక్ష్యం కోసమే వారి జీవితాలను అంకితం చేసేలా స్ఫూర్తినిస్తున్న పద్యమూస్ఫూర్తిదాయకమైన గేయమూ ప్రపంచ చరిత్రలో మరొకటి లేదువందేమాతరం తప్పఅలాంటి ఉద్వేగభరిత గేయం ప్రపంచంలో మరెక్కడా లేదుదేశం దాస్య శృంఖలాల్లో ఉన్న సమయంలో కూడా ఈ రకమైన గేయాలను సృజించగల అసాధారణ వ్యక్తులు ఈ దేశంలో జన్మించారని ప్రపంచానికి తెలియాలిప్రపంచం దీన్నో అద్భుతంలా చూస్తుందిమనం ఈ విషయాన్ని గర్వంగా చాటాలిఅప్పుడు ప్రపంచం కూడా దీన్ని గౌరవించడం మొదలుపెడుతుందిఅది మన స్వతంత్రతా మంత్రంనివేదనా మంత్రంశక్తిదాయక మంత్రంపవిత్రతా మంత్రంనిబద్ధతా మంత్రంత్యాగమూ తపమూ కూడిన మంత్రంకష్టాలను తట్టుకుని నిలిచే బలాన్నిచ్చిన మంత్రం... ఆ మంత్రం వందేమాతరంఅందుకే గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా రాశారుఏక కార్యే సోంపియాఛి సహస్ర జీవన్ – వందేమాతరం (బెంగాలీలో). అంటే, “ఒకే సూత్రం వేలాది హృదయాలను పెనవేసుకుందివేలాది జీవితాలు ఒకే లక్ష్యానికి అంకితమయ్యాయివందేమాతరం”.. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిందిది.

 

అధ్యక్షా,

అదే సమయంలో వందేమాతరం రికార్డింగులు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరాయివిప్లవకారులకు లండన్ ఒక పవిత్ర క్షేత్రంగా మారిందిఆ లండన్ ఇండియా హౌస్‌లో వీర సావర్కర్ వందేమాతరాన్ని ఆలపించారుఆ గేయం ఎన్నోసార్లు అక్కడ ప్రతిధ్వనించిందిదేశం కోసమే జీవించిదేశం కోసమే ప్రాణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్న యోధులకు ఇదెంతగానో స్ఫూర్తిదాయకంఅదే సమయంలో బిపిన్ చంద్రపాల్మహర్షి అరబిందో ఘోష్ ఒక వార్త పత్రికను ప్రారంభించారుదానికి ‘వందేమాతరం’ అని పేరు పెట్టారునిజానికి బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేసేందుకు ‘వందేమాతరం’ ఒక్కటి చాలుఅందుకే వారు ఈ పేరును ఎంచుకున్నారుబ్రిటిష్ వారు వార్త పత్రికలపై నిషేధం విధించిన సమయంలో మేడమ్ భికాజీ కామా పారిస్‌లో ఓ పత్రికను ప్రారంభించిదానికి ‘వందేమాతరం’ పేరు పెట్టారు.

అధ్యక్షా,

వందేమాతరం భారత్‌కు స్వావలంబన పథాన్నీ నిర్దేశించిందిఅప్పట్లో అగ్గిపెట్టెల నుంచి పెద్ద పెద్ద ఓడల వరకు.. వాటిపై వందేమాతరం రాసే సంప్రదాయం మొదలైందిఅది విదేశీ కంపెనీలను సవాలు చేసే సాధనంగాస్వదేశీ మంత్రంగా మారిందిస్వదేశీ మంత్రంలాగే స్వతంత్రతా మంత్రమూ విస్తరించడం మొదలైంది.

అధ్యక్షా,

మరో సంఘటననూ నేను ప్రస్తావిస్తున్నాను. 1907లో వి.వొచిదంబరం పిళ్ళై స్వదేశీ కంపెనీ ఓడను రూపొందించిన సమయంలో దానిపై వందేమాతరం అని రాశారుజాతీయ కవి సుబ్రమణ్య భారతి వందేమాతరాన్ని తమిళంలోకి అనువదించి స్తుతి కీర్తనలు కూర్చారుఆయన రాసిన అనేక తమిళ దేశభక్తి గీతాల్లో వందేమాతరం పట్ల అనురక్తి స్పష్టంగా కనిపిస్తుందిబహుశా తమిళనాడు ప్రజలకు ఇది తెలిసే ఉండవచ్చుకానీ ఇతరులకు అంతగా తెలిసుండకపోవచ్చుభారతీయ పతాక గీతాన్ని స్వయంగా విసుబ్రమణ్య భారతే రాశారువందేమాతర గేయానికి ఆధారభూతంగా నిలిచిన పతాకమే.. సుబ్రమణ్య భారతి పతాక గేయ వర్ణనకూ ఆధారంగా ఉందితమిళంలో ఈ గీతానికి శీర్షిక ‘థాయిన్ మణికోడి పరీర్తఝండు పానింతు పుకజంథిద వరీర్!’. అంటే “మాతృభూమి ప్రేమికులారా.. రండిఇదిగోభక్తితో నమస్కరించండినా తల్లి దివ్య పతాకాన్ని స్తుతించండి.”

 

అధ్యక్షా,

 

వందేమాతరంపై మహాత్మాగాంధీ భావాలనూ ఈ సభలో ప్రస్తావించదలిచానుదక్షిణాఫ్రికా నుండి ప్రచురితమయ్యే ‘ఇండియన్ ఒపీనియన్’ అనే వారపత్రిక 1905 డిసెంబరు 2న మహాత్మాగాంధీ రాసిన విషయాలను ప్రచురించిందిదాన్ని నేను ఉటంకిస్తున్నానుగాంధీ ఇలా రాశారు: “బంకించంద్ర రచించిన వందేమాతర గేయం బెంగాల్ అంతటా విశేష ప్రజాదరణ పొందిందిస్వదేశీ ఉద్యమ సమయంలో బెంగాల్‌లో భారీ సమావేశాలు జరిగాయిఅక్కడ లక్షలాది మంది ఒక్కచోటకు వచ్చి బంకించంద్ర రచించిన గేయాన్ని ఆలపించారు.” గాంధీజీ ఇంకా ఇలా రాశారు.. ఇది చాలా ముఖ్యమైనదిఆయన 1905లో ఇలా రాశారు: “ఈ గేయం ఎంతలా ప్రజాదరణ పొందిందంటే.. అది మన జాతీయ గీతంలా మారిపోయిందిఇందులోని భావోద్వేగాలు ఉదాత్తమైనవివేరే దేశాల గేయాల కన్నా మధురమైనది ఇదిమనలో దేశభక్తి స్ఫూర్తిని మేల్కొల్పడమే దీని ఏకైక లక్ష్యంఇది భారత్‌ను తల్లిగా భావించిఆమెను కీర్తిస్తుంది.”

 

అధ్యక్షా,

 

1905లోనే మహాత్మాగాంధీ జాతీయగీతంగా పరిగణించిన వందేమాతరం.. దేశంలో నలుమూలలాదేశం కోసం జీవించిదేశభక్తినే శ్వాసించిన ప్రతీ వ్యక్తి జీవితంలో మార్మోగిన ఈ గేయం భారత్‌కోసం జాగరూకులైన ప్రతిఒక్కరికీ అపారమైన శక్తినిచ్చిందివందేమాతరం చాలా గొప్పదిదాని స్ఫూర్తి ఉన్నతమైనదిఅలాంటప్పుడు గత శతాబ్ద కాలంగా దానికి ఇంత దారుణమైన అన్యాయం ఎందుకు జరిగిందివందేమాతరానికి ఎందుకు ద్రోహం జరిగిందిఎందుకీ అన్యాయం జరిగిందిపూజ్య బాపూజీ మనోభావాల కన్నా కూడా శక్తిమంతమైన ఆ తలంపులు ఎమై ఉంటాయివందేమాతరం వంటి పవిత్ర భావోద్వేగాన్ని వివాదంలోకి లాగిందెవరునేడు మనం వందేమాతర 150 వసంతాల వేడుక నిర్వహిస్తున్న తరుణంలో.. ఈ ద్రోహానికి దారితీసిన పరిస్థితుల గురించి కొత్త తరాలకు చెప్పడం మన బాధ్యతగా నేను భావిస్తున్నానువందేమాతరాన్ని వ్యతిరేకించే ముస్లిం లీగ్ రాజకీయాలు తీవ్రతరమవుతున్న సమయమది. 1937 అక్టోబరు 15 న ముహమ్మద్ అలీ జిన్నా లక్నో నుండి వందేమాతరానికి వ్యతిరేకంగా గట్టి నినాదాలు చేశారుఅప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్ లాల్ నెహ్రూ తన రాజకీయ పునాదులు కదిలిపోతున్నాయని భావించారుముస్లిం లీగ్ నిరాధార ప్రకటనలను గట్టిగా తిప్పికొట్టడానికి బదులువాటిని ఖండించడానికి బదులువందేమాతరం పట్ల తనకూ కాంగ్రెస్ పార్టీకీ ఉన్న విధేయతను వ్యక్తపరచడానికి బదులు... అందుకు పూర్తి విరుద్ధంగా జరిగిందిఆయనలా ఎందుకు ప్రవర్తించారో ఎవరికీ తెలియదు.. ఆయననెవరూ అడగలేదువందేమాతరాన్ని ఆసాంతం పరిశీలించారుజిన్నా వ్యతిరేకత వ్యక్తపరిచిన అయిదు రోజుల తర్వాత అక్టోబరు 20న నేతాజీ సుభాష్ బోస్‌కు నెహ్రూ ఒక లేఖ రాశారుజిన్నా వ్యక్తం చేసిన భావాలే ధ్వనించేలా.. ఆనంద మఠ్ నేపథ్యమున్న ‘వందేమాతరం’ ముస్లింలకు అసౌకర్యాన్ని కలిగించవచ్చని ఆ లేఖలో అంగీకరించారునెహ్రూ గారు ఏం రాశారో నేను చదువుతాను. “వందేమాతరం గేయం నేపథ్యాన్ని నేను అధ్యయనం చేశాను” అని ఆయన అన్నారు. “ఈ నేపథ్యం ముస్లింలను రెచ్చగొట్టవచ్చని నేను భావిస్తున్నాను” అని అప్పుడు నెహ్రూ రాశారు.

 

మిత్రులారా,

 

దీని తరువాత.. వందేమాతర గేయాలాపనను సమీక్షించడం కోసం అక్టోబరు 26 నుంచి కలకత్తాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమవుతుందని కాంగ్రెస్ నుంచి ఓ ప్రకటన వెలువడిందిబంకిం బాబు పుట్టిన బెంగాల్‌నేఆయన నడిచిన కలకత్తా నగరాన్నే ఈ సమీక్ష కోసం ఎంచుకున్నారుదేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైందిదేశం మొత్తం ఆశ్చర్యపోయిందిఇందుకు నిరసనగా దేశవ్యాప్తంగా వందేమాతరం ఆలపిస్తూ.. దేశభక్తులు ఉదయం వేళ కవాతులు చేశారుకానీ దురదృష్టవశాత్తు అక్టోబరు 26న వందేమాతరం విషయంలో కాంగ్రెస్ రాజీపడిందివందేమాతరాన్ని ముక్కలుగా విడగొట్టాలని వారు నిర్ణయించారు. ‘సామాజిక సామరస్యం’ అన్న ముసుగులో వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారుకానీముస్లిం లీగ్ ఎదుట కాంగ్రెస్ మోకరిల్లిందని చరిత్ర స్పష్టంగా చెబుతోందిముస్లింలీగ్ ఒత్తిడితోనే కాంగ్రెస్ దీనికి అంగీకరించిందివారి బుజ్జగింపు రాజకీయాలను కొనసాగించేందుకు ఇదొక మార్గంగా చూశారు.

 

అధ్యక్షా,

 

బుజ్జగింపు రాజకీయాల ఒత్తిడితో వందేమాతర విభజన కోసం కాంగ్రెస్ తలవంచిందిఅందుకే దేశ విభజన కోసమూ కాంగ్రెస్ తలొగ్గాల్సి వచ్చిందికాంగ్రెస్ తన నిర్ణయాధికారాన్ని పొరుగు సేవలకు అప్పగించినట్టు కనిపిస్తోందిదురదృష్టవశాత్తు కాంగ్రెస్ విధానాలు ఇంకా అలాగే ఉన్నాయిఅంతేకాదు.. ఐఎన్సీ క్రమంగా ఎంఎంసీగా మారిందినేటికీ కాంగ్రెస్దాని మిత్రపక్షాలుకాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న వారంతా.. ఇప్పటికీ వందేమాతరంపై వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 

అధ్యక్షా,

 

అత్యుత్తమ దశలో ఉన్నప్పుడు కాదు.. సవాళ్లూసంక్షోభాల సమయంలోనే నిజానికి ఏ దేశ సామర్థ్యమైనా వెల్లడవుతుందిమనం ఎంత దృఢంగా ఉన్నామోఎంత శక్తిమంతులమోఎంతటి సమర్థులమో పరీక్షను ఎదుర్కొన్నప్పుడే.. అది మన వాస్తవిక బలానికి పరీక్ష. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు మారాయిదేశ ప్రాధాన్యాలు మారాయికానీఆ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ.. దేశ స్వభావమూచైతన్యమూ అలాగే ఉన్నాయిసంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారీ.. వందేమాతరం స్ఫూర్తితో భారత్ ముందుకు సాగిందిమధ్యలో కొన్నేళ్లలో ఏమైనా జరిగి ఉండనివ్వండికానీ నేటికీ ఆగస్టు 15జనవరి 26న లేదా ‘హర్ ఘర్ తిరంగా’ సమయంలో అదే భావోద్వేగం ప్రతిచోటా స్పష్టంగా కనిపిస్తోందిత్రివర్ణ పతాకాలు సగర్వంగా రెపరెపలాడుతున్నాయిఒకప్పుడు దేశం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో.. వందేమాతరం స్ఫూర్తితోనే మన రైతులు విశేషంగా కృషి చేసి మన ధాన్యాగారాలను నిండుకుండలుగా చేశారుదేశ స్వాతంత్ర్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగిన వేళరాజ్యాంగంపై దాడి చేసిన వేళఎమర్జెన్సీ విధించిన వేళ... వందేమాతరం ఇచ్చిన శక్తివల్లే దేశం ఉవ్వెత్తున లేచిఆ కుయుక్తులను తిప్పికొట్టిందిదేశంపై యుద్ధాలు జరిగిన ప్రతిసారీమనం సంఘర్షణలో చిక్కుకున్న ప్రతిసారీ... వందేమాతర స్ఫూర్తే మన సైనికులు సరిహద్దుల్లో దృఢంగా నిలిచేలా చేసిందిఆ స్ఫూర్తే భరతమాత జయధ్వజం రెపరెపలాడేలా చేసిందికరోనా వంటి అంతర్జాతీయ సంక్షోభం తలెత్తినప్పుడు కూడా దేశం అదే స్ఫూర్తితో కలిసి నిలబడిందిదానిని అధిగమించి ముందుకు సాగింది.

 

అధ్యక్షా,

 

ఇది దేశ బలంగాఢమైన భావోద్వేగంతో దేశమంతటినీ ఏకం చేసే ఉత్తేజకరమైన శక్తి ప్రవాహంఅవిచ్ఛిన్నమైన మన సాంస్కృతిక వాహినిని ప్రతిబింబిస్తూ.. నిరంతరం దాన్ని చాటే చేతనా స్రవంతి ఇదివందేమాతరం మనమేదో కేవలం గుర్తుంచుకోవాల్సిన అంశం మాత్రమే కాదు.. కొత్త శక్తినీకొత్త స్ఫూర్తినీ పొందేలా మనం పునరంకితం కావాలిఇంతకుముందే నేను చెప్పినట్టుగా.. వందేమాతరానికి మనం రుణపడి ఉన్నాంఈ రోజు మనమున్న స్థితికి చేరుకునేందుకు బాటలు వేసింది వందేమాతరమేఅందుకే మనం దానికి రుణపడి ఉన్నాంప్రతి సవాలునూ అధిగమించే శక్తి భారత్‌కు ఉందివందేమాతరమే దీనికి స్ఫూర్తివందేమాతరం కేవలం ఓ గేయమోస్ఫూర్తిదాయకమైన శ్లోకమో మాత్రమే కాదు.. దేశం పట్ల విధ్యుక్తులమయ్యేలా మనల్ని జాగరూకులను చేసే చోదక శక్తిఅందుకే మనం దీన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ‘ఆత్మనిర్భర భారత్’ సంకల్పంతో మనం ముందుకు సాగుతున్నాందానిని మనం నెరవేర్చుకోవాలివందేమాతరమే మనకు స్ఫూర్తిమనం స్వదేశీ ఉద్యమాన్ని బలోపేతం చేయదలిచాంకాలం మారి ఉండొచ్చురూపాలు మారి ఉండొచ్చు.. కానీ పూజ్య బాపూజీ వ్యక్తపరిచిన స్ఫూర్తి నేటికీ సజీవంగా ఉందివందేమాతరం మనల్నింకా ఏకం చేస్తూనే ఉందిమహనీయులైన మన నాయకుల స్వప్నం ‘స్వతంత్ర భారత్’ కాగా... నేటి నవ తరం ‘సంపన్న భారత్‌’ను సాకారం చేయాలని స్వప్నిస్తోందివందే భారత్ స్ఫూర్తి స్వతంత్ర భారత స్వప్నాన్ని సాకారం చేసింది.. వందేమాతర స్ఫూర్తి సంపన్న భారత్ కలను సాకారం చేసి తీరుతుందిఈ భావోద్వేగాలతోనే మనం ముందుకు సాగాలి. ‘ఆత్మనిర్భర్ భారత్’ను సాకారం చేసుకోవాలి. 2047 నాటికి దేశం ‘వికసిత భారత్’గా నిలచి తీరాలిస్వాతంత్ర్యానికి 50 ఏళ్లకు ముందుగానే వారు స్వతంత్ర భారతాన్ని స్వప్నించారు కదా.. అలాగే మనమూ 2047కు 25 ఏళ్ల ముందే సంపన్న, ‘వికసిత భారత్’ను స్వప్నిద్దాంఈ కలను సాకారం చేసుకోవడానికి పునరంకితమవుదాంఇదే మంత్రప్రదంగాఇదే సంకల్పంతో.. వందేమాతరం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందివందేమాతరానికి రుణపడి ఉన్నామని గుర్తిద్దాందాని స్ఫూర్తిని ముందుకు తీసుకెళదాందేశ ప్రజలనూ ఇందులో భాగం చేద్దాంకలిసి నడుద్దాం... కలను సాకారం చేసుకుందాంఈ భావనతోనే నేడు ఈ చర్చ ప్రారంభమవుతోందిఇది దేశంలో స్ఫూర్తిని రగిలిస్తుందనిపార్లమెంటు ఉభయ సభల్లోనూ మన నవ తరాన్ని శక్తిమంతం చేస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నానుఈ మాటలతో.. నాకు ఈ అవకాశాన్నిచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలుధన్యవాదాలు!

వందేమాతరం!

వందేమాతరం!

వందేమాతరం!

 

***


(रिलीज़ आईडी: 2201191) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam