ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పలు ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 OCT 2023 10:54PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కేబినెట్ సహచరులుమధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులుఎంపీలుఎమ్మెల్యేలువేదికపై ఉన్న ఇతర ప్రముఖులుమమ్మల్ని ఆశీర్వదించటానికి పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలుపెద్దలారా!

మాతా నర్మదా పుణ్యభూమికి నా ప్రణామాలు సమర్పిస్తూఇవాళ నేను జబల్‌పూర్‌ కొత్త రూపాన్ని చూస్తున్నానుజబల్‌పూర్‌లోని ఉత్సాహం, 'మహాకౌశల్‌'లోని ఆనందంఉద్వేగాన్ని నేను చూస్తున్నానుమహాకౌశల్ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ఈ ఉత్సాహంఈ ఆసక్తి ప్రతిబింబిస్తున్నాయిఈ ఉత్సాహం మధ్య ఇవాళ యావత్ దేశం ధైర్యవంతురాలైన రాణి దుర్గావతి 500వ జయంతిని జరుపుకుంటోందిరాణి దుర్గావతి గౌరవ యాత్ర ముగింపు సందర్భంగాఆమె జయంతిని జాతీయస్థాయిలో నిర్వహించాలని నేను పిలుపునిచ్చానుమనమంతా ఒక పవిత్రమైన కార్యనిర్వహణకుపూర్వీకుల రుణాన్ని తీర్చుకోవటానికే ఇక్కడకు వచ్చాంకాసేపటి కిందటే మనం ఇక్కడ రాణి దుర్గావతి భవ్య స్మారక మందిరానికి భూమి పూజ చేశాంఆ స్మారక మందిరం ఎలా నిర్మిస్తారని నేను ఆలోచిస్తున్నానుదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మ్యాప్ ద్వారా శివరాజ్నాకు వివరించారుఇది పూర్తయిన తర్వాత భారతదేశంలోని ప్రతి తల్లియువతీయువకులు ఈ ప్రాంతాన్ని దర్శించాలని కోరుకుంటారని నేను విశ్వసిస్తున్నానుఇది ఒక పుణ్యక్షేత్రంగా మారుతుందిరాణి దుర్గావతి జీవితం మనందరికీ సర్వజన సంక్షేమాన్ని బోధిస్తుందిమన మాతృభూమి కోసం ఏదైనా చేయాలనే ధైర్యాన్నిస్తుందిగిరిజన సమాజానికిమధ్యప్రదేశ్ రాష్ట్రానికి, 140 కోట్ల దేశ ప్రజలకు రాణి దుర్గావతి జయంతి సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నానుఏ దేశానికైనా రాణి దుర్గావతి లాంటి నాయకురాలు ఉండి ఉంటేఆమెకు ఆ దేశంప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించి ఉండేదిస్వాతంత్ర్యం వచ్చాక మన దేశంలోనూ అలా జరగాల్సింది కానీగొప్ప వ్యక్తిత్వాలను విస్మరించారుఅద్భుతమైనజ్ఞానవంతులైన.. త్యాగానికిపట్టుదలకు నిదర్శనమైన గొప్ప వ్యక్తులనువీరులనువీరవనితలను మర్చిపోయారు.

 

 

నా కుటుంబ సభ్యులారా,

ఇవాళ రూ.12 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనప్రారంభోత్సవాలు జరిగాయిజలగ్యాస్ పైప్ లైన్లు, 4 వరుసల రహదారి వ్యవస్థ వంటివి లక్షలాది మంది ప్రజల జీవితాల్లో మార్పును తీసుకువస్తాయిదీనివల్ల రైతులకు తప్పకుండా లాభం చేకూరుతుందికొత్త ఫ్యాక్టరీలుసంస్థల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
 

నా కుటుంబ సభ్యులారా,
మా అక్కాచెల్లెళ్లకు పొగ రహిత వంటశాలలను అందించటమే బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల్లో ముఖ్యమైనదిఓ పరిశోధన ప్రకారంఒక తల్లి.. పొగ వచ్చే స్టవ్కట్టెలు లేదా బొగ్గు మండించి వంట చేసేప్పుడు ప్రతి 24 గంటలకు ఆమె శరీరం ఎదుర్కొనే పొగ, 400 సిగరెట్ల పొగకు సమానమని తేలిందినా తల్లులుఅక్కాచెల్లెళ్లు ఈ సమస్య నుంచి బయటపడాలావద్దామీ శక్తి మేరకు బదులివ్వండిఇది మన తల్లులుఅక్కాచెల్లెళ్లకు సంబంధించిన విషయంవంటశాలలోని పొగ నుంచి మన ఆడబిడ్డలు విముక్తి పొందాలా లేదాఈ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే పరిష్కరించి ఉండాల్సిందికానీ పరిష్కరించలేదుమన తల్లులుఅక్కాచెల్లెళ్ల గురించివారి ఆరోగ్యంసంక్షేమం గురించి పట్టించుకోలేదు.

సోదరీసోదరులారా,
అందుకే మేం ఒక భారీ కార్యక్రమాన్ని ప్రారంభించికోట్లాది మంది పేద మహిళలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించాంగతంలో గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఎంపీ ఇంటికి వెళ్లాల్సి వచ్చేందిమీకు తెలుసురక్షాబంధన్ సందర్భంగా ఒక సోదరుడుతన సోదరికి బహుమతి ఇస్తారుఈ ఏడాది రక్షాబంధన్ సందర్భంగా సోదరిణిలకు మా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించిందిదీంతో ఉజ్వల లబ్ధిదారులకు రూ.400కే సిలిండర్ అందుతుందిమరికొన్ని రోజుల్లో దుర్గాపూజనవరాత్రిదసరాదీపావళి పండుగలు ప్రారంభమవుతాయినిన్న మోదీ ప్రభుత్వం ఉజ్వల సిలిండర్ ధరను మరో రూ.100కు తగ్గించిందిఅంటే కొద్ది రోజుల్లోనే ఉజ్వల లబ్ధిదారులకు సిలిండర్ ధర రూ.500 తగ్గిందిప్రస్తుతం పథకం కింద లబ్ధి పొందుతున్న పేద తల్లులుఅక్కాచెల్లెళ్లుకుమార్తెలకు గ్యాస్ సిలిండర్ కేవలం రూ.600కే లభిస్తుందిబీజేపీ ప్రభుత్వం సిలిండర్లకే పరిమితం కాకుండాపైపులైన్ల ద్వారా వంటశాలలకు చౌకగా గ్యాస్ సరఫరా చేసేందుకుపైపులైన్ నిర్మాణ పనులు చేపట్టిందిఈ కార్యక్రమం ద్వారా మధ్యప్రదేశ్ లోని లక్షలాది కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.

 

నా కుటుంబ సభ్యులారా,
కళాశాల విద్యార్థులకుమన యువ మిత్రులకుయువతీయువకులకు ఇవాళ కొన్ని పాత సంఘటనలను గుర్తు చేయాలనుకుంటున్నాను. 2014 నాటి కొన్ని సంఘటనల గురించి చెప్పాలనుకుంటున్నానుఈరోజు 20-22 ఏళ్ల వయసున్నవారు ఆ సమయంలో 8, 10, 12 ఏళ్ల వయసులో ఉండి ఉంటారుకాబట్టివారికి ఆ విషయాలు తెలియకపోవచ్చుమోదీ ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో వారికి తెలియకపోవచ్చుఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల కుంభకోణాల గురించి వార్తాపత్రికల్లో హెడ్ లైన్లు వచ్చేవిపేదలకు ఖర్చు చేయాల్సిన డబ్బు కాంగ్రెస్ నాయకుల ఖజానాలో చేరేవిఇప్పటి యువత ఆన్‌లైన్ తరానికి చెందినవారు కాబట్టిదీనికి సంబంధించిన అంశాలను గూగుల్‌లో వెతకమని చెబుతాను. 2013-14 నాటి వార్తా పత్రికల శీర్షికలను ఒకసారి చదవండిదేశ పరిస్థితి ఎలా ఉండేదో తెలుస్తుంది.

 

సోదరీసోదరులారా,
2014 
తర్వాత దేశానికి సేవ చేసే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినప్పుడుకాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి వ్యవస్థను మార్చటానికి మేం కృషి చేశాంఅవినీతిలోనూ పరిశుభ్రతా ఉద్యమాన్ని మొదలుపెట్టాందాదాపు 11 కోట్ల నకిలీ పేర్లను తొలగించేందుకు సాంకేతికతను ఉపయోగించాంఈ సంఖ్యను మీరు గుర్తుంచుకోగలరాజవాబివ్వండిఈ లెక్క మీకు గుర్తుంటుందాప్రభుత్వ రికార్డుల నుంచి మేం 11 కోట్ల నకిలీ పేర్లను తొలగించాంఎన్నిఎన్ని అని చెప్పానుగట్టిగా చెప్పండి. 11 కోట్లుఈ 11 కోట్ల పేర్లు ఎవరివిఅసలు పుట్టని వ్యక్తుల పేర్లుకానీ ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఖజానాను కొల్లగొట్టటానికి ఒక మార్గం ఏర్పడిందికాంగ్రెస్ ఈ తప్పుడునకిలీ పేర్లకు పత్రాలను సృష్టించింది.

మధ్యప్రదేశ్ఛత్తీస్‌గఢ్‌ల మొత్తం జనాభా కంటే ఈ 11 కోట్ల సంఖ్య ఎక్కువనిజమైన పేద ప్రజల హక్కులను హరించిఈ 11 కోట్ల నకిలీ పేర్లతో ఖజానాను దోచుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం వీటన్నింటిని తొలగించిందిమోదీ వచ్చి అంతా తొలగించివారికి వెళ్లాల్సిన భాగంకమీషన్ ఆపినందున ఆ వ్యక్తులు కోపంగా ఉన్నారుపేదల డబ్బును దోచుకోవటానికి నేను అనుమతించనుకాంగ్రెస్ నాయకుల ఖజానాలు నిండటానికి ఒప్పుకోనుమేం సృష్టించిన త్రిశక్తి జన్‌ధన్-ఆధార్-మొబైల్ ద్వారా కాంగ్రెస్ హయాంలోని అవినీతి వ్యవస్థ నాశనమైందిఈ త్రి-శక్తి కారణంగా రూ.2.5 లక్షల కోట్లకు పైగా సొమ్ము చోరీకి గురికాకుండా ఆపగలిగాంతప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నచోరీకి గురయ్యే రూ.2.5 లక్షల కోట్లకు పైగా డబ్బుని ఆదా చేసే పనిని మోదీ చేశారునేను ఎంత చెప్పాను? 2.5 లక్షల కోట్లుపేదవారి డబ్బు ఇవాళ పేదవారి సంక్షేమానికి ఉపయోగిస్తున్నాంకేవలం రూ.600లకే ఉజ్వల సిలిండర్లను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోందికోట్లాది కుటుంబాలకు ఉచిత రేషన్ అందించేందుకు ఖర్చుచేసే రూ.3 కోట్లను ఖజానా నుంచి అందిస్తున్నాంఏ ఒక్క పేద బిడ్డ కూడా రాత్రిపూట ఆకలితో నిద్రించకూడదుపేదల ఇళ్లల్లో వంట ఆగిపోకూడదుఆయుష్మాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల కుటుంబాలు ఉచిత వైద్యం పొందాయిఆయుష్మాన్ ఆరోగ్య కార్డుల కోసం ప్రభుత్వం రూ.70 వేల కోట‌్లు ఖర్చు చేసిందిరైతులకు యూరియా చౌకగా అందాలిప్రపంచ మార్కెట్లో బస్తా యూరియా ధర రూ.3,000 ఉంటేమోదీ దాన్ని రూ.300 కంటే తక్కువకే అందిస్తున్నారునా దేశ రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం ఖజానా నుంచి రూ.8 లక్షల కోట్లు ఖర్చు చేసిందిపీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.2.5 లక్షల కోట్లు జమ అవుతున్నాయిపేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించేందుకు మన ప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేసిందిఈ రోజు మీరు కూడా చూశారుఇండోర్‌లో ఆధునిక సాంకేతికతతో నిర్మించిన 1000 బహుళ అంతస్తుల పక్కా ఇళ్లను పేద కుటుంబాలకు అందించాను.

నా కుటుంబ సభ్యులారా,

ఈ నిధులన్నీ కలిపితే ఎంత మొత్తం అవుతుందో తెలుసాదానికి ఎన్ని సున్నాలుంటాయో ఊహించగలరాకాంగ్రెస్ నాయకులు కనీసం లెక్కించలేరు. 2014కు ముందుఈ సున్నాలను కుంభకోణాల ద్వారా పోగేసిన డబ్బును లెక్కించటానికి మాత్రమే వాడేవారుఇప్పుడు ఊహించండి. "ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపితేలబ్ధిదారుడికి 15 పైసలు మాత్రమే చేరుతుంది. 85 పైసలు మధ్యలోనే ఎవరో దొంగిలిస్తారువారు ఒక రూపాయి పంపితేలబ్ధిదారుడికి కేవలం 15 పైసలు మాత్రమే చేరేదిఅని కాంగ్రెస్ ప్రధానమంత్రి ఒకరు అనేవారుమనం ఇప్పుడు లెక్కించినంత డబ్బు పేదలకు పంపించి ఉంటే కాంగ్రెస్ పాలనలో ఎంత దోపిడీకి గురయ్యేదో మీరు ఊహించవచ్చుకానీఆ మొత్తాన్ని ఈరోజు పేదల సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

నా కుటుంబ సభ్యులారా,

ఇది నా మధ్యప్రదేశ్‌కు ముఖ్యమైన కాలంఇవాళ నేను సాక్షాత్తు మాతా నర్మదా నది తీరాన నిలబడి ఈ విషయం చెబుతున్నానుమధ్యప్రదేశ్‌ మొత్తానికిమధ్యప్రదేశ్‌లోని యువతకు మాతా నర్మదా సమక్షంలో నేను ఈ మాట చెబుతున్నానుఎందుకంటే నేను కూడా మాతా నర్మదా ఒడిలోనే జన్మించానుమాతా నర్మదా నది ఒడ్డున ఇవాళ నేను ఈ విషయం చెబుతున్నానుయువతీ యువకులారానా మాటలు గుర్తు పెట్టుకోండిమధ్యప్రదేశ్ ఈరోజున కీలకమైన ఘట్టంలో ఉందిఅభివృద్ధికి ఆటంకం కలిగితేఅభివృద్ధి వేగం తగ్గితేఅది అన్నింటినీ నాశనం చేస్తుందిఇలాంటి అభివృద్ధి మళ్లీ 20-25 సంవత్సరాల తర్వాత కూడా జరగదుఅందువల్లఈ అభివృద్ధి వేగాన్ని ఆగిపోయేలా లేదా నిలిచపోయేలా చేయకూడదుఈ 25 సంవత్సరాలు మీకు అత్యంత కీలకమైనవిప్రస్తుతం 25 ఏళ్ల లోపు ఉన్నవారు కొత్తగాఅభివృద్ధి చెందుతున్న మధ్యప్రదేశ్‌ను మాత్రమే చూశారురాబోయే 25 ఏళ్లలో వారి పిల్లలు ఎదిగేసరికివారు ఒక అభివృద్ధి చెందినసుసంపన్నమైనగౌరవమర్యాదలతో కూడిన మధ్యప్రదేశ్‌ను చూస్తారుఅందుకోసం ఇవాళ మరింత కష్టపడి పనిచేయడం అవసరంసరైన నిర్ణయం తీసుకోవాలిగడిచిన సంవత్సరాల్లో వ్యవసాయ ఎగుమతుల విషయంలో మధ్యప్రదేశ్‌ను బీజేపీ ప్రభుత్వం అగ్రస్థానానికి చేర్చిందిఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధిలోనూ మధ్యప్రదేశ్ నంబర్ వన్ కావాలిభారత్‌లో ఏళ్లుగా రక్షణ వస్తువుల ఉత్పత్తిరక్షణ ఎగుమతులు ఎంతో పెరిగాయిఇందుకు జబల్‌పూర్ కూడా దోహదపడుతోందిమధ్యప్రదేశ్‌లో ఒక్క జబల్‌పూర్‌లోనే రక్షణ సంబంధిత వస్తువులను తయారుచేసే కర్మాగారాలున్నాయిఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తమ సైన్యానికి 'మేడ్ ఇన్ ఇండియాఆయుధాలను అందిస్తోందిప్రపంచంలో కూడా భారత రక్షణ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందిదీనివల్ల మధ్యప్రదేశ్‌కు కూడా మేలు జరగనుందిస్థానికులకు వేలాది ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి.

నా కుటుంబ సభ్యులారా,

నేడు భారతదేశ ఆత్మవిశ్వాసం నూతన శిఖరాలకు చేరుకుందిఆటస్థలం నుంచి పంట పంటపొలాల వరకు భారత జెండా రెపరెపలాడుతోందిప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శను మనం చూస్తున్నాందేశంలోని యువత ఇది భారత యువతర కాలం అని భావిస్తోందియువతకు ఇటువంటి అవకాశాలున్నప్పుడుఅభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలనే ఉత్సాహం పెరుగుతుందిఅందుకే జీ20 వంటి గొప్ప ప్రపంచ కార్యక్రమాలను భారత్ గర్వంగా నిర్వహించగలుగుతోందిమరే ఇతర దేశం చేరుకోలేని ప్రదేశానికి భారత చంద్రయాన్ చేరుకుంది. ‘వోకల్ ఫర్ లోకల్’ అనే మంత్రం నలుమూలలకూ వినిపిస్తోందిదేశం ఒకవైపు చంద్రయాన్‌ను అంతరిక్షంలోకి పంపిందిమరోవైపు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఢిల్లీలోని ఓ ఖాదీ దుకాణంలో ఒక్క రోజులోనే రూ.1.5 కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులు అమ్ముడయ్యాయిఇదే దేశ బలంఈ స్వదేశీ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న భావన పెరుగుతోందిఈ ప్రయత్నంలో దేశ యువతపుత్రులుకుమార్తెలు పగ్గాలు చేపట్టారుఅందుకే స్టార్టప్‌ల ప్రపంచంలో దేశ యువత అద్భుతాలు సృష్టిస్తోందిఅందుకే పరిశుభ్రంగా మారేందుకు భారత్ శక్తిమంతమైన ప్రతిజ్ఞ తీసుకుంటుందిఅక్టోబర్ 1న దేశవ్యాప్తంగా ప్రారంభించిన స్వచ్ఛతా ఉద్యమంలో లక్షలకు పైగా ప్రాంతాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించారుఈ ఉద్యమంలో దేశంలోని కోట్లకు పైగా ప్రజలు పాల్గొన్నారువారు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చిచీపుర్లు పట్టి దేశంలోని రహదారులుపార్కులను శుభ్రం చేశారుమధ్యప్రదేశ్ ప్రజలుయువత ఇంకా అద్భుతాలు చేశారుపరిశుభ్రత విషయంలో మధ్యప్రదేశ్ అత్యధిక స్కోరు సాధించిదేశంలోనే మొదటి స్థానంలో ఉందిమనం ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలిరాబోయే ఏళ్లలో వీలైనన్ని ఎక్కువ రంగాల్లో మధ్యప్రదేశ్‌ను ప్రథమ స్థానంలో నిలబెట్టాలి.

నా కుటుంబ సభ్యులారా,

స్వప్రయోజనాల్లో నిమగ్నమైన రాజకీయ పార్టీలను మనం సులభంగా గుర్తించవచ్చుప్రపంచమంతా ఇవాళ భారత్ సాధించిన విజయాల గురించి మాట్లాడుతోందికానీఅన్నీ కోల్పోయిఅధికారం తప్ప ఏమీ చూడని ఈ రాజకీయ పార్టీలు బీజేపీని తిట్టే క్రమంలో భారతదేశాన్ని దూషించే స్థాయికి దిగజారాయియావత్ ప్రపంచం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రశంసిస్తోందికానీ డిజిటల్ ఇండియా గురించి వీళ్లంతా మనల్ని ఎలా అపహాస్యం చేశారో మీకు గుర్తుండే ఉంటుందిప్రపంచంలోనే ప్రభావవంతమైన కరోనా వ్యాక్సిన్ ను భారత్ తయారుచేసిందివీళ్లంతా దానిపైన కూడా ప్రశ్నలు లేవనెత్తారుటీకా ఆధారంగా 'వ్యాక్సిన్ వార్పేరుతో కొత్త సినిమా వచ్చిందని ఇప్పుడే నాకు చెప్పారుప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలిసేలా మన దేశంలో చిత్రీకరించిన ఈ సినిమాభారత శాస్త్రవేత్తలు చేసిన అద్భుతమైన కృషికోట్లాది మంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన అంశంపై 'వ్యాక్సిన్ వార్ను రూపొందించారు.

సోదరీసోదరులారా,

భారత సైన్యం చెప్పే విషయాలనుసైన్యం శౌర్యాన్ని కూడా ఈ వ్యక్తులు ప్రశ్నిస్తున్నారుదేశ శత్రువులుఉగ్రవాదుల మాటలు నిజమని నమ్మే వీళ్లు.. నా దేశ ఆర్మీసైనికుల మాటలను విశ్వసించటం లేదుభారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం అమృత్ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకోవటం మీరు చూశారుఇది కేవలం బీజేపీ కార్యక్రమం కాదుదేశ కార్యక్రమంప్రతి భారతీయుడికి స్వాతంత్య్రం ఒక పండుగకానీ ఈ వ్యక్తులు ఆజాదీ కా అమృత్ కాల్‌ను కూడా పరిహస్యం చేస్తున్నారుభవిష్యత్ తరాల కోసం దేశం నలుమూలలా అమృత్ సరోవర్లను నిర్మిస్తున్నాంజల సంరక్షణకు పెద్దఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయికానీ ఈ వ్యక్తులకు ఈ పని పట్ల కూడా విముఖత ఉంది.

నా కుటుంబ సభ్యులారా,

స్వాతంత్య్రానంతరం దేశంలో ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ గిరిజన సమాజానికి కనీస గౌరవాన్ని అందించలేదుస్వాతంత్య్ర పోరాటం నుంచి సాంస్కృతిక వారసత్వ సంపద వరకు మన గిరిజన సమాజ పాత్ర కీలకంప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన సమాజాల్లో గోండ్ ఒకటిఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నానుఎంతో కాలం అధికారంలో ఉన్నవారు గిరిజన సమాజం చేసిన సేవలకు జాతీయ గుర్తింపు ఎందుకు ఇవ్వలేదుబీజేపీ కోసం దేశం ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందిమన గిరిజన యువకులకు ఈ విషయం తప్పకుండా తెలియాలిఅటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం గిరిజన సమాజం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖనుప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేసిందిగత ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ఎన్నో రెట్లు పెంచిందిదేశానికి తొలి గిరిజన మహిళా అధ్యక్షురాలిని అందించే అవకాశం బీజేపీకి దక్కిందిభగవాన్ బిర్సా ముండా జయంతిని గిరిజన గౌరవ దినోత్సవంగా బీజేపీ ప్రకటించిందిదేశంలోనే అత్యంత ఆధునిక రైల్వేస్టేషన్లలో ఒకదానికి రాణి కమలాపతి పేరు పెట్టారుపతల్‌పానీ స్టేషన్‌ను ఇప్పుడు జననాయక్ తంత్యా భిల్ స్టేషన్‌గా పిలుస్తున్నారుగోండు సమాజానికి స్ఫూర్తిప్రదాతైన రాణీ దుర్గావతి పేరు మీద ఇంతటి అద్భుతమైనఆధునిక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారుగోండు సంస్కృతిచరిత్రకళను కూడా ఈ మ్యూజియం ప్రదర్శిస్తుందిరాబోయే తరాలకు గోండు సంప్రదాయం గురించి తెలిసేలా చేయటమే మా ప్రయత్నంఅంతర్జాతీయ నేతలను కలిసినప్పుడు వారికి నేను గోండు చిత్రాలను బహుమతిగా ఇస్తారుఈ అద్భుతమైన గోండు కళను వారు పొగిడినప్పుడు నా హృదయం ఎంతో గర్వంతో నిండిపోతుంది.

మిత్రులారా,

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ కేవలం ఒకే ఒక్క పని చేసిందిఅది కుటుంబాన్ని ఆరాధించటంఆ కుటుంబాన్ని పూజించటం తప్ప వాళ్లు దేశాన్ని పట్టించుకోలేదుదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదుదేశాభివృద్ధిని ఒక కుటుంబమే సాధించలేదుఇది మా ప్రభుత్వంఅందరినీ గౌరవిస్తుందిఅందరి సంరక్షణను చూసుకుంటుందిప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు సంబంధించిన స్థలాలను మహూతో సహా 'పంచతీర్థ్'గా బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందికొన్ని వారాల క్రితంసాగర్‌లో సంత్ రవిదాస్ జీ స్మారక స్థలానికి భూమిపూజ చేసే అవకాశం లభించిందిఇది సామాజిక సామరస్యంవారసత్వం పట్ల బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.

మిత్రులారా,

కుటుంబ పాలనఅవినీతిని పోషించిన పార్టీలు గిరిజన సమాజ వనరులను దోచుకున్నాయి. 2014 కంటే ముందు, 8-10 అటవీ ఉత్పత్తులకు మాత్రమే ఎంఎస్‌పీ అందించేవారుమిగిలిన అటవీ ఉత్పత్తులను దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేయటంతో గిరిజనులకు ఏమీ మిగిలేది కాదుఈ పరిస్థితిని మేము మార్చాముఇవాళ సుమారు 90 అటవీ ఉత్పత్తులను ఎంఎస్‌పీ పరిధిలోకి తీసుకువచ్చాం.

మిత్రులారా,

మన గిరిజన రైతులుసన్నకారు రైతులు పండించే కోడో కుట్కీ వంటి చిరుధాన్యాలకు గతంలో పెద్దగా ప్రాధాన్యత లభించేది కాదుజీ20 సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ నాయకులు ఢిల్లీకి వచ్చారని మీకు తెలుసుఅధిక సంఖ్యలో నేతలు హాజరయ్యారుకోడో కుట్కీతో చేసిన వంటకాలను వారికి రుచి చూపించాం. 'శ్రీ అన్నరూపంలో కోడో కుట్కీని దేశవిదేశాల్లోని మార్కెట్లకు చేర్చాలని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందిగిరిజనసన్నకారు రైతులకు గరిష్ఠ ప్రయోజనాలను అందించేందుకు మా ఈ ప్రయత్నం.

నా కుటుంబ సభ్యులారా,

వెనుకబడిన వర్గాలకు ప్రాముఖ్యత కల్పించటం బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిపేదల ఆరోగ్యానికిమహిళల సౌకర్యానికి సురక్షిత తాగునీటిని పైపుల ద్వారా సరఫరా చేయటం ముఖ్యమైనదిఇవాళ ఇక్కడ సుమారు 1,600 గ్రామాలకు నీటి సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేశాంమహిళల ఆరోగ్యం ఎల్లప్పుడూ దేశానికి ప్రాధాన్యతగా ఉండాలిగతంలో ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశారునారీశక్తి వందన్ అధినియం ద్వారా లోక్‌సభఅసెంబ్లీలో మహిళలకు హక్కులను కల్పించే పని బీజేపీ చేసింది.

మిత్రులారా,

గ్రామ సామాజిక-ఆర్థిక జీవితానికి మా విశ్వకర్మ మిత్రులు గొప్ప తోడ్పాటును అందిస్తున్నారువారిని శక్తిమంతం చేయటం ఒక ప్రాధాన్యతగా ఉండాల్సిందిరూ.13 వేల కోట్ల విలువైన పీఎం విశ్వకర్మ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తీసుకొచ్చాం.

నా కుటుంబ సభ్యులారా,

బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వంఅవినీతిబంధుప్రీతి కోసం కొందరు వ్యక్తులు రకరకాల ఎత్తుగడలను వేస్తున్నారుఅయితేఅభివృద్ధి పథంలో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుందని మోదీ హామీ ఇస్తున్నారుమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ సంకల్పాన్ని మహాకౌశల్మధ్యప్రదేశ్ రాష్ట్రం మరింత బలపరుస్తాయని నేను విశ్వసిస్తున్నానుమరోసారి వీర వనిత రాణీ దుర్గావతికి నా వందనాలుమమ్మల్ని ఆశీర్వదించటానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానునేను రాణీ దుర్గావతి అని చెప్తానుమీరు అమర్ రహేఅమర్ రహేఅని చెప్పాలిరాణీ దుర్గావతి అమర్ రహేఅమర్ రహేఈ నినాదం మధ్యప్రదేశ్ అంతా ప్రతిధ్వనించాలి.

రాణీ దుర్గావతి అమర్ రహేఅమర్ రహే.

రాణీ దుర్గావతి అమర్ రహే

 

***


(रिलीज़ आईडी: 2200046) आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam