ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌తో కలసి భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


వాణిజ్యమైనా, దౌత్యమైనా, ఏ ఇతర భాగస్వామ్యానికైనా పరస్పర విశ్వాసమే పునాది, భారత్-రష్యా సంబంధాల బలం ఈ నమ్మకంలోనే దాగుంది, ఇదే ఉమ్మడి ప్రయత్నాలకు దిశను, వేగాన్ని అందిస్తుంది, కొత్త కలలను, ఆకాంక్షలను సాకారం చేసుకొనేలా స్పూర్తినిస్తుంది: పీఎం

2030కి ముందే భారత్-రష్యా మధ్య వాణిజ్యం 100 బిలియన్ డాలర్లను చేరుకోవాలన్నదే లక్ష్యం: పీఎం

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా సంస్కరణ, పని, పరివర్తన అనే సూత్రం మార్గదర్శకత్వంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది: పీఎం

प्रविष्टि तिथि: 05 DEC 2025 8:00PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన భారత్-రష్యా బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారుఈ కార్యక్రమంలో రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌ కూడా పాల్గొన్నారుతన ప్రసంగంలో అధ్యక్షుడు పుతిన్‌కుదేశవిదేశాలకు చెందిన నాయకులకువిశిష్ట అతిథులకు ప్రధాని నమస్కరించారుఅతి పెద్ద ప్రతినిధి బృందంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అధ్యక్షుడు పుతిన్ చూపిన చొరవను ఈ బిజినెస్ ఫోరం ప్రతిబింబిస్తుందని ప్రధాని అన్నారుఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ స్వాగతం పలుకుతూ.. వారి మధ్య ఉండటం తనకు ఆనందాన్నిస్తోందని చెప్పారుఈ కార్యక్రమంలో పాల్గొనివిలువైన సూచనలను అందించిన తన స్నేహితుడు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారువాణిజ్యానికి సరళమైనవిశ్వసనీయమైన వ్యవస్థలు ఏర్పాటవుతున్నాయని స్పష్టం చేశారుఅలాగేభారత్యురేషియన్ ఆర్థిక సంఘంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు.

భవిష్యత్తు అవకాశాల గురించి కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్అధ్యక్షుడు పుతిన్ వివరించినట్టుగా.. భారత్రష్యా తక్కువ సమయంలోనే గొప్ప లక్ష్యాలను సాధించగలవని శ్రీ మోదీ అన్నారువాణిజ్యమైనాదౌత్యమైనాఏ ఇతర భాగస్వామ్యానికైనా.. పరస్పర విశ్వాసమే పునాది అని వివరించారుభారత్-రష్యా సంబంధాల బలం ఈ నమ్మకంలోనే ఉందన్నారుఉమ్మడి ప్రయత్నాలకు దిశనువేగాన్ని ఈ నమ్మకమే అందిస్తుందనికొత్త కలలనుఆకాంక్షలను సాకారం చేసుకొనేలా స్పూర్తినిస్తుందని వెల్లడించారుగతేడాదిద్వైపాక్షిక వాణిజ్యం విలువ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని అధిగమించాలని అధ్యక్షుడు పుతిన్ సంకల్పించారని ప్రధాని గుర్తు చేశారుఅయితే అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన తాజా చర్చలుకనిపిస్తున్న సామర్థ్యాలను బట్టి చూస్తే 2030 వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారునిర్దేశించిన సమయం కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో భారత్రష్యా ముందుకు సాగుతున్నాయనే తన నమ్మకం మరింత బలపడుతోందని తెలియజేశారుసుంకాలుసుంకేతర అడ్డంకులను తగ్గిస్తున్నామని శ్రీ మోదీ వివరించారుఈ ప్రయత్నాల అసలైన బలం వ్యాపారవేత్తల్లోనే ఉందన్నారువారి శక్తిఆవిష్కరణలులక్ష్యాలే భారత్రష్యాల ఉమ్మడి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయని చెప్పారు.

గడచిన పదకొండేళ్లలో భారత్‌లో వచ్చిన మార్పుల వేగాన్నివాటి స్థాయిని వివరిస్తూ.. సంస్కరణపనిపరివర్తన అనే సూత్రాన్ని పాటిస్తూ.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ ప్రయాణిస్తోందని శ్రీ మోదీ వివరించారుఈ పదకొండేళ్ల సంస్కరణల ప్రయాణంలో భారత్ ఎప్పుడూ అలసిపోలేదనిఆగిపోలేదని చెప్పారుతన లక్ష్యాలను సాధించే దిశగా మునుపెన్నడూ లేని బలమైన సంకల్పంతోఆత్మవిశ్వాసంతోవేగంతో ప్రయాణిస్తోందన్నారువ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలనునిబంధనల్లో సడలింపులు చేపడుతున్నామని ప్రధానమంత్రి తెలిపారుప్రైవేటు రంగాన్ని రక్షణఅంతరిక్ష రంగంలో అనుమతించామనిఇది నూతన ఉద్యోగాలను సృష్టిస్తోందనిపౌర అణుశక్తి రంగంలో కూడా కొత్త అవకాశాలను కల్పిస్తోందని తెలియజేశారుఇవన్నీ పరిపాలనమైన సంస్కరణలు మాత్రమే కాదనివికసిత్ భారత్ అనే ఏకైక సంకల్పం ద్వారా నడిచే ఆలోచనాపరమైన మార్పులు అని చెప్పారు.

గత రెండు రోజులుగా ఉపయోగకరమైనఅర్థవంతమైన చర్చలు జరిగాయనిఅన్ని రంగాల్లోనూ భారత్-రష్యా మధ్య సహకారానికి ప్రాతినిధ్యం లభించిందని సంతోషం వ్యక్తం చేశారుఅలాగే ఈ చర్చల్లో పాల్గొన్న వారు ఇచ్చిన సలహాలనువారి ప్రయత్నాలను ఆయన మనస్ఫూర్తిగా ప్రశంసించారుఈ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక ఆలోచనలు అందించారన్నారుసరకు రవాణాఅనుసంధానం విషయంలో పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని అధ్యక్షుడు పుతిన్తాను గుర్తించామని శ్రీ మోదీ వెల్లడించారుచెన్నై-వ్లాడివోస్టోక్ కారిడార్‌తో సహా ఐఎన్‌సీటీసీఉత్తర సముద్ర మార్గం లాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారుఇవి పూర్తయితే రవాణా సమయంఖర్చులు తగ్గుతాయనివ్యాపారానికి కొత్త అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారువర్చువల్ వాణిజ్య కారిడార్ ద్వారా డిజిటల్ సాంకేతికత శక్తినిఎగుమతి లేదా దిగుమతి పన్నులనురవాణానునియంత్రణా వ్యవస్థలను అనుసంధానించవచ్చనితద్వారా వేగంగా కస్టమ్స్ అనుమతులు పొందవచ్చనికాగితపు పని తగ్గించవచ్చనిసరకు రవాణా మరింత సజావుగా సాగుతుందని వివరించారు.

సముద్ర ఉత్పత్తుల గురించి శ్రీ మోదీ వివరిస్తూ.. పాలుసముద్ర ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేలా ఇటీవలే అర్హత కలిగిన భారతీయ సంస్థల జాబితాను రష్యా విస్తరించిందనిఇది భారతీయ ఎగుమతిదారులకు నూతన అవకాశాలను సృష్టిస్తోందని తెలిపారుభారత్‌లో తయారవుతున్న అధిక నాణ్యత కలిగిన సముద్ర ఉత్పత్తులువిలువ ఆధారిత సముద్ర ఆహార ఉత్పత్తులుశుద్ధి చేసిన ఆహారానికి అంతర్జాతీయంగా ఎక్కువ డిమాండ్ ఉందన్నారుకోల్డ్ చెయిన్ లాజిస్టిక్స్డీప్-సీ ఫిషింగ్ఫిషింగ్ హార్బర్ల ఆధునికీకరణకు ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థలుసాంకేతిక భాగస్వామ్యాలు రష్యా అవసరాలను తీర్చగలవనిఅదే సమయంలో భారతీయ ఉత్పత్తులకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.

ఆటోమొబైల్ రంగం గురించి ప్రధానమంత్రి వివరించారుసరసమైనసమర్థవంతమైన ఈవీ ద్విచక్ర వాహనాలనుసీఎన్జీ పరిష్కారాలను అందించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందన్నారుఅదే సమయంలో రష్యా అధునాతన సామగ్రి ప్రధాన ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారుఈ రెండు దేశాలు ఈవీల తయారీఆటోమోటివ్ విడిభాగాల తయారీసరఫరాలో సహకరించుకోవచ్చన్నారుఫలితంగా దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు.. గ్లోబల్‌ సౌత్‌లో, ముఖ్యంగా ఆఫ్రికా అభివృద్ధికి తోడ్పడవచ్చనిి ప్రధానమంత్రి అన్నారు.

అత్యంత నాణ్యమైన ఔషధాలను అంతర్జాతీయంగా తక్కువ ధరలకు అందిస్తూ ‘ప్రపంచానికి ఫార్మసీ’ అనే గుర్తింపును భారత్ సొంతం చేసుకుందని ప్రధానమంత్రి వివరించారుఉమ్మడిగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంక్యాన్సర్ చికిత్సలురేడియో ఫార్మాసూటికల్స్ఏపీఐ రవాణా వ్యవస్థలుఆరోగ్య సేవల భద్రతకొత్త పరిశ్రమలను ప్రోత్సహించడంలో రెండు దేశాలు సహకరించుకోవచ్చన్నారు.

వస్త్ర పరిశ్రమ గురించి మాట్లాడుతూ.. సహజమైన నూలు నుంచి సాంకేతిక వస్త్రాల వరకు విస్తృతమైన సామర్థ్యం భారత్‌కు ఉందని మోదీ తెలిపారుడిజైన్హస్తకళలుకార్పెట్లలో భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందనిపాలిమర్స్‌సింథటిక్ ముడి ఉత్పత్తులకు రష్యా ప్రధాన ఉత్పత్తిదారుగా ఉందన్నారుఇది స్థిరమైన జౌళి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో రెండు దేశాలకు వీలు కల్పిస్తోందని తెలిపారుఎరువులుసిరామిక్స్సిమెంట్ తయారీఎలక్ట్రానిక్స్ రంగాల్లో సహకారానికి సైతం ఇదే తరహా అవకాశాలు ఉన్నాయన్నారు.

అన్ని రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించడంలో మానవ వనరుల శక్తి కీలకపాత్ర పోషిస్తుందంటూ.. ‘ప్రపంచ నైపుణ్య కేంద్రం’గా భారత్ ఎదుగుతోందని ప్రధానమంత్రి వివరించారుసాంకేతికతఇంజినీరింగ్ఆరోగ్య సేవలునిర్మాణ రంగంసరకు రవాణాలో భారతీయ యువతకు ప్రపంచ అవసరాలను తీర్చగలిగే సామర్థ్యం ఉందన్నారురష్యా ప్రజలఆర్థిక ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు అధిక ప్రయోజనం చేకూరుస్తుందన్నారురష్యన్ భాషభావ వ్యక్తీకరణ నైపుణ్యాల్లో భారతీయ యువతకు శిక్షణ ఇస్తే.. రష్యాకు అవసరమైన మానవ వనరులను సంయుక్తంగా అభివృద్ధి చేయవచ్చన్నారుఇది రెండు దేశాల ఉమ్మడి సంక్షేమాన్ని వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు.

రెండు దేశాల పౌరులకు పర్యాటక వీసాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నామని వివరించారుఇవి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయనికొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తాయనినూతన ఉపాధి అవకాశాలను అందిస్తాయన్నారు.

సహ ఆవిష్కరణలుసహ ఉత్పత్తిసహ రూపకల్పనల నూతన ప్రయాణాన్ని భారత్రష్యా ప్రారంభిస్తున్నాయని శ్రీ మోదీ తెలియజేశారుఇవి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రపచం ఎదుర్కొంటున్న సవాళ్లకు సుస్థిరమైన పరిష్కారాలు అందించడం ద్వారా మానవాళి సంక్షేమానికి కూడా దోహదపడతాయన్నారుఈ ప్రయాణంలో రష్యాతో కలసి నడిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలియజేశారుఅలాగే ‘‘రండిభారత్‌లో తయారు చేయండిభారత్‌తో భాగస్వామ్యులు కండిఈ ప్రపంచం కోసం మనం కలసి తయారుచేద్దాం’’ అని ప్రకటించారుఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇతరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.


(रिलीज़ आईडी: 2200041) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Kannada