ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం


పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియా ప్రకటన

प्रविष्टि तिथि: 07 DEC 2025 7:08AM by PIB Hyderabad

గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారుఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.

 

ప్రమాద స్థలంలో పరిస్థితి గురించి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్‌తో మాట్లాడానని ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ విషాదంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

 

ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొన్నారు:

గోవాలోని అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం చాలా బాధాకరంప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానుగాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానుపరిస్థితి గురించి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ గారితో మాట్లాడానుబాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది.

 

మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.

 

ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఇలా పేర్కొంది:

"గోవాలోని అర్పోరాలో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తున్నాంశ్రీ నరేంద్ర మోదీ


(रिलीज़ आईडी: 2200029) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam