ప్రధాన మంత్రి కార్యాలయం
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
07 DEC 2025 10:58AM by PIB Hyderabad
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సాయుధ దళాల్లో సేవలందిస్తున్న ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు ప్రధానమంత్రి ఈ రోజు కృతజ్ఞతలు తెలిపారు.
సాయుధ దళాల సిబ్బంది క్రమశిక్షణ, దృఢ సంకల్పం, అజేయ స్ఫూర్తి దేశాన్ని రక్షిస్తున్నాయని, దేశ ప్రజలను బలోపేతం చేస్తున్నాయనీ ఆయన అన్నారు. దేశం పట్ల వారి కర్తవ్యం, క్రమశిక్షణ, అంకితభావానికి వారి నిబద్ధతే నిలువెత్తు నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సాయుధ దళాల పరాక్రమం, సేవలను గౌరవిస్తూ... సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరూ విరాళాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కోరారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంలో... అచంచల ధైర్యంతో మన దేశాన్ని రక్షిస్తున్న ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి క్రమశిక్షణ, సంకల్పం, అజేయ స్ఫూర్తి మన ప్రజలను సదా కాపాడుతూ, మన దేశాన్ని బలోపేతం చేస్తున్నాయి. వారి నిబద్ధత... మన దేశం పట్ల వారి కర్తవ్యం, క్రమశిక్షణ, అంకితభావానికి శక్తిమంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి మనమంతా విరాళాలు అందిద్దాం."
***
(रिलीज़ आईडी: 2200028)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam