ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి భారత పర్యటన సందర‌్భంగా తీర్మానాలు
प्रविष्टि तिथि:
05 DEC 2025 5:43PM by PIB Hyderabad
అవగాహన ఒప్పందాలు, అంగీకారాలు...
వలసలు, స్థాన చలనం:
ఒక దేశ పౌరులు మరొక దేశ భూభాగానికి తాత్కాలిక కార్మిక కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రభుత్వం, రష్యా ఫెడరేషన్
అక్రమ వలసలు ఎదుర్కోవటానికి సహకారంపై భారత్, రష్యా ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం
ఆరోగ్యం, ఆహార భద్రత:
ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్య, విజ్ఞాన శాస్త్ర రంగాల్లో సహకారంపై భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు రష్యన్ ఫెడరేషన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మధ్య ఒప్పందం
ఆహార భద్రతా రంగంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణ, మానవ సంక్షేమానికి భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత ఆహార భద్రతా, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), రష్యన్ ఫెడరేషన్ మధ్య కుదిరిన ఒప్పందం
సముద్రయాన సహకారం, ధృవ ప్రాంత జలాలు:
ధృవ ప్రాంతాల సముద్రజాలాల్లో నడిచే నౌకలకు సంబంధించిన నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు భారత ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, రష్యన్ ఫెడరేషన్ రవాణా మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం
భారత ప్రభుత్వ ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, రష్యా ప్రభుత్వ సముద్రయాన బోర్డు మధ్య సహకారానికి అవగాహనా ఒప్పందం
ఎరువులు:
మెస్సర్స్ జేఎస్‌సీ ఉరల్ కెమ్, మెస్సర్స్ రాష్ట్రీయ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సంస్థ, జాతీయ ఎరువుల సంస్థ, ఇండియన్ పొటాష్
సంస్థల మధ్య కుదరిన అవగాహనా ఒప్పందం
కస్టమ్స్, వాణిజ్యం:
భారత్, రష్యా మధ్య తరలించే సరుకులు, వాహనాల ముందస్తు సమాచారం పరస్పరం పంచుకునేందుకు సహకారం కోసం భారత ప్రభుత్వ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు, ఫెడరల్ కస్టమ్స్ సర్వీస్ (రష్యన్ ఫెడరేషన్) మధ్య కుదిరిన ఒప్పందం
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలోని తపాలా విభాగం, రష్యన్ పోస్టు జేఎస్‌సీ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం
విద్యా సహకారం:
శాస్త్రీయ, విద్యా సహకారంపై పూణెలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, టామ్స్క్లోని ఫెడరల్ స్టేట్ అటానమస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ "నేషనల్ టామ్స్క్ యూనివర్సిటీ" మధ్య అవగాహనా ఒప్పందం
ముంబై విశ్వవిద్యాలయం, లోమోనోసోవ్ మాస్కోస్టేట్ యూనివర్సిటీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు సంబంధించిన జాయింట్-స్టాక్ కంపెనీ మేనేజ్‌మెంట్ కంపెనీ మధ్య సహకారానికి ఒప్పందం
మీడియా సహకారం:
ప్రసార రంగంలో సహకారం, సమన్వయానికి భారతదేశ ప్రసార భారతి, రష్యా ఫెడరేషన్ జాయింట్ స్టాక్ కంపెనీ గాజ్‌ప్రోమ్-మీడియా హోల్డింగ్ మధ్య అవగాహనా ఒప్పందం
ప్రసార రంగంలో సహకారం, సమన్వయానికి భారతదేశ ప్రసార భారతి, రష్యా జాతీయ మీడియా గ్రూప్ మధ్య అవగాహనా ఒప్పందం
ప్రసార సహకారం, భాగస్వామ్యానికి భారతదేశ ప్రసార భారతి, బిగ్ ఏషియా మీడియా గ్రూప్ మధ్య అవగాహనా ఒప్పందం
ప్రసార సహకారం, భాగస్వామ్యానికి భారతదేశ ప్రసార భారతి, ఏఎన్ఓ "టీవీ-నోవోస్తి" మధ్య అవగాహనా ఒప్పందానికి అనుబంధ అంగీకారం
"టీవీ బ్రిక్స్" జాయింట్-స్టాక్ కంపెనీ, "ప్రసార భారతి (పీబీ)” మధ్య అవగాహనా ఒప్పందం
ప్రకటనలు
2030 వరకు భారత్-రష్యా ఆర్థిక సహకార వ్యూహాత్మక రంగాల అభివృద్ధి కార్యక్రమం
అంతర్జాతీయ బిగ్ క్యాట్ కూటమి (ఐబీసీఓఏ)లో చేరటానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఆమోదించాలని నిర్ణయించిన రష్యా
"ఇండియా: ఫ్యాబ్రిక్ ఆఫ్ టైమ్" ప్రదర్శనకు జాతీయ హస్తకళల మ్యూజియం, హస్తకళా అకాడమీ (న్యూఢిల్లీ, భారత్), జారిట్సినో చారిత్రక, నిర్మాణ, కళా ప్రకృతి మ్యూజియం-రిజర్వ్ (మాస్కో, రష్యా) మధ్య ఒప్పందం
పరస్పర ప్రాతిపదికన రష్యా పౌరులకు ఉచితంగా 30 రోజుల ఈ-టూరిస్ట్ వీసా మంజూరు
రష్యా పౌరులకు ఉచితంగా గ్రూప్ టూరిస్ట్ వీసా మంజూరు
***
(रिलीज़ आईडी: 2199704)
आगंतुक पटल : 5