ప్రధాన మంత్రి కార్యాలయం
నారీ శక్తి వందన్ అధినియం పై రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
21 SEP 2023 10:14PM by PIB Hyderabad
గౌరవ అధ్యక్షా,
గత రెండు రోజులుగా ఈ అత్యంత ముఖ్యమైన బిల్లుపై విస్తృతమైన చర్చ జరిగింది. ఉభయ సభల నుంచి సుమారు 132 మంది గౌరవ సభ్యులు కలిసి చాలా అర్థవంతమైన చర్చలో పాల్గొన్నారు. ఈ చర్చలోని ప్రతి మాట మన ముందున్న ప్రయాణంలో మన అందరికీ లాభదాయకంగా ఉంటుంది. అందువల్ల ఈ అంశంలోని ప్రతి పార్శ్వం తన స్వంత ప్రాముఖ్యత, విలువను కలిగి ఉంది.
తమ ప్రసంగాల మొదట్లోనే సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలియచేసినందుకు సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ స్ఫూర్తి మన దేశ ప్రజలలో ఒక నూతన విశ్వాసాన్ని నింపుతుంది. ఈ విషయంలో గౌరవ సభ్యులందరూ, అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. మహిళా సాధికారత కేవలం ఈ బిల్లు ఆమోదంతో మాత్రమే సాధ్యం కాదు. ఇంతకు మించి అవసరం. ఈ బిల్లు పట్ల దేశంలోని అన్ని రాజకీయ పార్టీల సానుకూల దృక్పథం మన దేశ మహిళా శక్తికి ఒక నూతన శక్తిని ఇవ్వబోతోంది. వారు నాయకత్వంతో ముందుకు వచ్చి, ఒక నూతన విశ్వాసంతో దేశ నిర్మాణానికి తోడ్పడతారు. అది దానంతట అదే మన ఉజ్వల భవిష్యత్తుకు ఒక హామీ అవుతుంది.
గౌరవ అధ్యక్షా,
నేను సభా సమయాన్ని ఎక్కువ తీసుకోదలచుకోలేదు. మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు నా కృతజ్ఞతను మాత్రమే తెలియజేస్తున్నాను. ఓటింగ్ విషయానికి వస్తే, ఇది ఎగువ సభ అయినందున, ఒక మంచి చర్చకు ప్రయత్నాలు జరిగాయి. అందువల్ల, ఈ బిల్లుపై ఏకగ్రీవంగా ఓటుచేసి దేశానికి ఒక నూతన విశ్వాసాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఆకాంక్షతో నేను మరోసారి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
గమనిక: ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి సుమారు తెలుగు అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2199702)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam