ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అసోం దివస్ సందర్భంగా అస్సాం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 DEC 2025 3:47PM by PIB Hyderabad

అసోమ్ దివస్ సందర్భంగా అస్సాంలోని సోదరీ సోదరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుస్వర్గదేవ్ ఛావొలుంగ్ సుకఫా దార్శనికతను సాకారం చేయాలన్న మన నిబద్ధతను పునరుద్ఘాటించాల్సిన సందర్భం ఈ రోజు అని శ్రీ మోదీ అన్నారు. ‘‘అస్సాం ప్రగతిని పెంపొందించడానికి గత కొన్నేళ్లుగా కేంద్రంలోఅస్సాంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయిమౌలిక ససదుపాయాలతో పాటు సామాజిక స్థితిగతులను కూడా మెరుగుపరచడంలో ఇదివరకు ఎరుగని అడుగులు పడ్డాయితాయి-అహోమ్ సంస్కృతితో పాటు తాయి భాషకు ప్రజాదరణను పెంచే దిశగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాంఇది అస్సాం యువతకు ఎంతో మేలు చేస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
అసోమ్ దివస్ సందర్భంగా అస్సాంలోని నా సోదరీ సోదరులకు ఇవే నా శుభాకాంక్షలు.
స్వర్గదేవ్ ఛావొలుంగ్ సుకఫా దార్శనికతను సాకారం చేయాలన్న మన నిబద్ధతను పునరుద్ఘాటించాల్సిన సందర్భం ఇదిఅస్సాం ప్రగతిని పెంపొందించడానికి కేంద్రంలోఅస్సాంలో ఎన్‌డీఏ ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయిమౌలిక ససదుపాయాలనూసామాజిక స్థితిగతులనూ మెరుగుపరచడంలో ఇదివరకు ఎరుగని విధంగా ముందడుగు పడింది.
తాయి-అహోమ్ సంస్కృతితో పాటు తాయి భాషకు ప్రజాదరణను పెంచే దిశగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాంఇది అస్సాం యువతకు ఎంతో మేలు చేస్తుంది’’ అని పేర్కొన్నారు.

 

****


(रिलीज़ आईडी: 2197627) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Malayalam