ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్రమైన గీతా జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 01 DEC 2025 3:23PM by PIB Hyderabad

పవిత్ర గీతా జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శుభాకాంక్షలు తెలిపారువిధి నిర్వహణపై అమూల్యమైన సందేశాలతో రూపొందించిన ఈ దివ్య గ్రంథం.. భారతీయ కుటుంబసామాజికఆధ్యాత్మిక జీవితాల్లో అత్యంత విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ‘‘భగవదగీత దివ్య శ్లోకాలు నిస్వార్థ చర్య వైపు ప్రతి తరాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో మోదీ ఇలా పేర్కొన్నారు

‘‘శ్రీమద్ భగవద్గీత ఆవిర్భావ దినోత్సవమైన  ‘‘గీతా జయంతి’’ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలువిధి నిర్వహణకు సంబంధించిన విలువైన సందేశాలతో అలంకరించిన ఈ దివ్య గ్రంథం భారతీయ కుటుంబసామాజికఆధ్యాత్మిక జీవితాల్లో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందిఇందులోని దివ్య శ్లోకాలు ప్రతి తరాన్ని నిస్వార్థ సేవకు ప్రేరేపిస్తూనే ఉంటాయిజై శ్రీ కృష్ణ!’’

 


(रिलीज़ आईडी: 2196964) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Malayalam