యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ద్వారా శారీరక దృఢత్వంపై అవగాహన కల్పించటాన్ని అభినందించిన పీఎం
ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలంతా కలిసి రావాలని పీఎం పిలుపు
"ఆరోగ్యం, సంక్షేమం గురించి పిలుపునిచ్చిన శ్రీ నరేంద్ర మోదీ వంటి ప్రధానమంత్రిని
నేను ఎప్పుడూ చూడలేదు": కల్నల్ రాజ్యవర్థన్ రాథోడ్
జర్నలిస్టులు ప్రత్యేక అతిథులుగా దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 51వ ఎడిషన్
రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో ఇవాళ 'ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్'
కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
01 DEC 2025 9:05AM by PIB Hyderabad
ఇవాళ 128వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. "యువత పాల్గొనే ప్రాచుర్యం పొందిన ఎన్నో క్రీడలున్నాయి. ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటున్నారు. ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించే మార్గాలు" అని అన్నారు.
యాధృచ్చికంగా, ఈ ఆదివారం దేశవ్యాప్తంగా 51వ ఎడిషన్ సైక్లింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏథెన్స్ 2004 ఒలింపిక్స్ రజత పతక విజేత, క్రీడామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ జైపూర్‌లో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు.
మంచి ఆరోగ్యం, సంక్షేమ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లటంలో దేశాన్ని ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కల్నల్ రాథోడ్ అభినందించారు.
ఇవాళ ఉదయం జైపూర్‌లో అమర జవాన్ జ్యోతి వద్ద జరిగిన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో "ప్రపంచవ్యాప్తంగా, దేశ ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ఉత్తేకరమైన పిలుపునిచ్చే ప్రధానమంత్రులు చాలా తక్కువ మంది ఉంటారు. ఫిట్ ఇండియా గురించి శ్రీ నరేంద్ర మోదీ చాలాసార్లు మాట్లాడారు" అని కల్నల్ రాథోడ్ అన్నారు.
"ఊబకాయాన్ని తగ్గించేందుకు అంకితభావంతో నూనె వాడకాన్ని తగ్గించటం నుంచి చిరు ధాన్యాలను (శ్రీ అన్న) తీసుకోవటం వరకు, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, సైక్లింగ్, రన్నింగ్ లేదా ఇతర విధానాలను ఎంచుకోవాలని గౌరవ ప్రధానమంత్రి ఎల్లప్పుడూ చెబుతూనే ఉన్నారు. సండేస్ ఆన్ సైకిల్ ద్వారా దేశంలో ఏర్పడిన ఈ ఉద్యమమే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ. ఇవాళ జైపూర్‌లో దాదాపు 1,000 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా, వారికి సైకిళ్లను అందుబాటులో ఉంచాం" అని కల్నల్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన మొదటి భారతీయుడిగా కల్నల్ రాథోడ్ గుర్తింపు పొందారు.
దేశవ్యాప్తంగా నవంబర్ 30న జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో జర్నలిస్టులు తమ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి పాల్గొన్నారు.
రాజస్థాన్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడల సందర్భంగా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ప్రత్యేక ఫిట్ ఇండియా జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇది సందర్శకులకు శక్తిమంతమైన, ఆకర్షణీయమైన, పరస్పరం చర్చలతో కూడిన అనుభూతి కలిగేలా కీలకమైన ఫిట్‌నెస్ అంశాలను ప్రత్యేక జోన్‌లో పొందుపరిచారు.
ఈ జోన్లో మూడు ప్రధాన అంశాలున్నాయి. ఉత్తేజకరమైన బహుమతులతో జుంబా, రోప్ స్కిప్పంగ్ వంటి హై-ఎనర్జీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ జోన్, ప్రత్యేక సైక్లింగ్ జోన్, అభివన్ బింద్రా టార్గెట్ ప్రదర్శనల్లో భాగంగా శారీరక, మానసిక దృఢత్వ అంచనాలున్నాయి.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ మార్గదర్శకత్వంలో డిసెంబర్ 2024లో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
"ఫిట్‌నెస్ కా డోస్, ఆదా ఘంటా రోజ్, స్థూలకాయంపై పోరాటం" వంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాలను బలోపేతం చేసేందుకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వారానికోసారి నిర్వహిస్తున్నారు.
సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఇవాళ నిజమైన ప్రజా ఉద్యమంలా మారింది. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
దేశంలో 4,000లకు పైగా నమో ఫిట్ ఇండియా సైక్లింగ్ క్లబ్బులు లక్షలాది మంది ప్రజలను ప్రతివారం సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తూ, ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్త సామాజిక-ఆధారిత ఫిట్‌నెస్ విప్లవంగా మారుస్తున్నారు. ఈ క్లబ్బులు ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతి వారం నిర్వహిస్తున్నాయి.
ఇండియా స్పోర్ట్స్ అథారిటీ (ఎస్‌ఏఐ) పరిధిలోని ఎస్‌ఏఐ శిక్షణ కేంద్రాలైన (ఎస్టీసీలు) అస్సాంలోని కోక్రాఝర్, పంజాబ్‌లోని జగత్‌పుర్, బాదల్, మణిపూర్‌లోని ఉట్లౌ, లడఖ్‌లోని కార్గిల్, ఇతర కేంద్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎస్ఓసీ కార్యక్రమాలతో విస్తృతమైన ప్రాతినిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న 23 ఎస్‌ఏఐ నేషనల్ ఎక్సలెన్స్ సెంటర్లు (ఎన్సీఓఈలు) లతో పాటు భద్రక్, ఝార్సుగూడ, డెంకనాల్లోని ఖేలో ఇండియా కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
***
(रिलीज़ आईडी: 2196939)
आगंतुक पटल : 2