ప్రధాన మంత్రి కార్యాలయం
అనువాదం: అంధ మహిళల T20 ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
प्रविष्टि तिथि:
28 NOV 2025 11:44AM by PIB Hyderabad
క్రీడాకారిణి: సర్... ఆమె పాటలు పాడుతుందని మీకు ఎలా తెలుసు?
ప్రధానమంత్రి: అది అంతే... మీ అందరినీ నేను పట్టించుకుంటాను.
క్రీడాకారిణి: సర్ మీతో మాట్లాడిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది.
ప్రధానమంత్రి: ఆనందంగా ఉన్నారా?
ప్రధానమంత్రి: మీరు చాలా కష్టపడి ఆడినవాళ్లు. మీరు మీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకున్నారు.
ప్రధానమంత్రి: అందరి సంతకాలు ఉన్నాయా?
క్రీడాకారిణి: ఉన్నాయి సర్.
ప్రధానమంత్రి: నేను దీనిపై సంతకం చేయాలా?
క్రీడాకారిణి: అవును సర్.
ప్రధానమంత్రి: చూడండి.. వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
క్రీడాకారిణి: అవును సర్.
ప్రధానమంత్రి: అందుకే నేను వందేమాతరం అని రాశాను.
ప్రధానమంత్రి: మీరు చాలా బాగా పాడతారని విన్నాను?
క్రీడాకారిణి: అవును సర్. గంగాధరా శంకరా కరుణా కరా, మామవ భవసాగర తారకా, భో శంభూ, శివ శంభూ స్వయంభూ.
ప్రధానమంత్రి: అద్భుతం. నేను కాశీ నుంచి పార్లమెంట్ సభ్యుడిని అని మీకు తెలుసు కదా. అందుకే మీరు ఈశ్వరున్ని గుర్తు చేశారు కదా!
క్రీడాకారిణి: అవును సర్.
క్రీడాకారిణి: సర్ మా జట్టులో మేమంతా ఆల్-రౌండర్లం.
ప్రధానమంత్రి: బాగా చెప్పారు. కాబట్టి ఇది రాజకీయాల లాంటిదే. రాజకీయాల్లో అందరూ ఆల్-రౌండర్లే. కొన్నిసార్లు ఒకరు మంత్రి అవుతారు. కొన్నిసార్లు ఎమ్మెల్యే అవుతారు. కొన్నిసార్లు ఎంపీ అవుతారు.
ప్రధానమంత్రి: జై జగన్నాథ్!
క్రీడాకారిణి: జై జగన్నాథ్. నేను మోదీ సర్‌తో ఫోటో తీసుకోవడానికి వెళ్ళాను. 'నువ్వు పాటలు పాడతావా?' అని సర్ అకస్మాత్తుగా అడిగారు. "సర్‌కు ఎలా తెలుసు?" అని అనుకున్నాను. సర్‌కు ఎలా తెలుసో నాకు తెలియదు. ఒక క్షణం నేను ఆశ్చర్య పోయాను.
ప్రధానమంత్రి: కావ్య ముందు మీరు రండి.
క్రీడాకారిణి: ధన్యవాదాలు
క్రీడాకారిణి: సర్ ఆమె పాటలు పాడుతుందని మీకు ఎలా తెలుసు?
ప్రధానమంత్రి: అంటే నేను మీ అందరి గురించీ నేను పట్టించుకుంటాను.
క్రీడాకారిణి: మా నాన్నకు కూడా ఒక పెద్ద కల ఉండేది. ఆయనకు మీరంటే చాలా ఇష్టం. కానీ మా నాన్న ఇప్పుడు ఇక్కడ లేరు. కానీ మా నాన్న చూసి ఉంటే చాలా సంతోషించి ఉండేవారని నేను అనుకుంటున్నాను.
ప్రధానమంత్రి: అంటే ఇక్కడ ఇంత తక్కువే తినడానికి ఉందని కాదు. ఇంకా ఉంది. జమ్మూ కాశ్మీర్‌కి చెందిన ఆల్-రౌండర్‌కు తినిపిద్దాం.
క్రీడాకారిణి: ఊరు మొత్తం మా గురించి మాట్లాడుతుంది. మీరు అంధులు. మీరు ఏం చేస్తారు? మీరు ఏమీ చేయరు అని అనేవారు. ఎప్పుడూ ఇలా మాట్లాడుతుండేవారు. మా తల్లిదండ్రులు అవి వినేవారు. వారికి కొంచెం బాధగా ఉండేది.
ప్రధానమంత్రి: గ్రామస్తులు ఇప్పుడు దీనికి భిన్నంగా మాట్లాడటం మొదలుపెట్టి ఉంటారు కదా!
క్రీడాకారిణి: అవును సర్.
క్రీడాకారిణి: మొదటిసారిగా ఆయన చేతులతో తీపి తినడం బాగా అనిపించింది. చాలా మంచి అనుభవం ఇది. నేను ఏం చెప్పలేను. నాకు ఒక కల ఉండేది. నా కల నిజమైంది.
ప్రధానమంత్రి: మొదలు పెట్టు... అమ్మా దీపిక. ఇది నచ్చలేదా?
క్రీడాకారిణి: నచ్చింది సర్.
ప్రధానమంత్రి: కేవలం తీపి మాత్రమే తింటారా?
క్రీడాకారిణి: సర్ మీతో మాట్లాడిన తర్వాత చాలా ఆనందంగా ఉంది.
ప్రధానమంత్రి: ఆనందంగా ఉన్నారన్నమాట...(నవ్వుతూ)
ప్రధానమంత్రి: కష్టపడి ముందుకొచ్చే వారి శ్రమ ఎప్పుడూ విఫలం కాదు. క్రీడా మైదానంలోనే కాదు జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. మీరు కష్టపడి ముందుకొచ్చిన వారు. మీరు మీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకున్నారు. మీరు గమనిస్తే ఇప్పుడు మీ ఆత్మవిశ్వాసం చాలా పెరిగి ఉంటుంది.
క్రీడాకారిణి: అవును సర్.
ప్రధానమంత్రి: ఇంతకుమందు మీరు గ్రామంలో ఒక ఉపాధ్యాయుడితో మాట్లాడవలసి వచ్చినా.. వారితో మాట్లాడాలా వద్దా అని మీరు ఆలోచించి ఉండి ఉంటారు. ఈ రోజు మీరు ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు.
క్రీడాకారిణి: అవును సర్. మీరు మాతో చాలా బాగా మాట్లాడుతున్నారు. మేమంతా స్వేచ్ఛగా ఉన్నట్లు అనిపిస్తోంది.. మాట్లాడాలనిపిస్తుంది.
ప్రధానమంత్రి: మీరు నా సొంత వారు. కాబట్టి నేను మీతో అలానే మాట్లాడతాను.
క్రీడాకారిణి: ఆయన నాయకత్వంలో మా క్రీడ చాలా బాగా పురోగమిస్తోంది. ప్రతి రంగంలోనూ ఆయన చాలా బాగా చేస్తున్నారు. చాలా జట్లు పురోగమిస్తున్నాయి.
ప్రధానమంత్రి: నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను కూడా 'వారెవ్వా.. ‘మన దేశం ఇంతగా అభివృద్ధి చెందుతోంది. ఈ పిల్లలకు ఎంత ధైర్యం ఉంది’ అని అనిపిస్తోంది. మనం ఎన్నికల్లో పోటీ చేసినట్లుగానే....
క్రీడాకారిణి: అవును సర్.
ప్రధానమంత్రి: ప్రత్యర్థి కనీస ఓట్లు రాకుండా డిపాజిట్టు కోల్పోయినప్పుడు ప్రజలు నాతో ఇలా అంటారు. మీరు ఎలాంటి వారు? మీరు వారి డిపాజిట్ కూడా కాజేశారు. మీరు ఈ సారి 10 ఓవర్లలోనే ప్రత్యర్థులను పెవిలియన్‌కు పంపారు.
క్రీడాకారిణి: సర్ వారిని మూడు ఓవర్లలోనే వెనక్కి పంపాం.
ప్రధానమంత్రి: అంత క్రూరంగా మాట్లాడతారెందుకు?! సరే అందరికీ శుభాకాంక్షలు. మీరు దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చారు. ఇది అందరినీ ప్రేరేపిస్తుంది.
క్రీడాకారిణి: అవును సర్.
క్రీడాకారిణి: ధన్యవాదాలు సర్.
ప్రధానమంత్రి: కేవలం దివ్యాంగులకే కాదు ఇతరులకు కూడా ఇది ప్రేరణనిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2196711)
आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada