ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవాలో జరిగిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి

"శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకోవటం నిజంగా ఒక చారిత్రక సందర్భం"

"గత 550 సంవత్సరాల్లో కాలం విసిరిన లెక్కలేనన్ని సవాళ్లను తట్టుకున్న మఠం”

యుగాలు- తరాలు మారినా, దేశం- సమాజం అనేక పరివర్తనలకు లోనైనా కూడా మారుతున్న కాలం,

సవాళ్ల మధ్య ఎప్పుడూ దిశను కోల్పోని మఠం

‘‘ప్రజలకు మార్గాన్ని చూపుతూ ఒక మార్గదర్శక కేంద్రంగా ఉద్భవించిన

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం"

తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొన్న గోవాలోని దేవాలయాలు, స్థానిక సంప్రదాయాలు

భాష- సాంస్కృతిక గుర్తింపు ఒత్తిడికి లోనైనప్పుడు కూడా

సమాజపు ఆత్మ బలహీనపడలేదు. భిన్నంగా అవి దీనిని మరింత బలోపేతం చేశాయి."

"గోవాకు ప్రత్యేక లక్షణం ఉంది. ప్రతి మార్పులో కూడా సంస్కృతికి ఉన్న ఆత్మను గోవా కోల్పోలేదు.. కాలంతో పాటు సంస్కృతి పునరుజ్జీవనకు గురైంది. ఈ ప్రయాణంలో పర్తగాలి మఠం వంటి సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి."

"నేడు భారతదేశం అద్భుతమైన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూస్తోంది. అయోధ్యలోని రామ మందిరం పునరుద్ధరణ, కాశీ విశ్వనాథ ధామ్ ఘనమైన పునరుజ్జీవనం, ఉజ్జయినిలోని మహాకాల్ మహాలోక్ విస్తరణ..

ఇవన్నీ మన దేశ జాగృతిని తెలియజేస్తున్నాయి"


"ఇది మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని నూతన శక్తితో ముందుకు తీసుకువస్తోంది"

"కొత్త సంకల్పం, నూతన విశ్వాసంతో సాంస్కృతిక గుర్తింపును ముందుకు తీసుకెళ్తోన్న నేటి భారత్‌"

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2025 6:05PM by PIB Hyderabad

ఈ రోజు గోవాలో నిర్వహించిన శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారుఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ పవిత్రమైన క్షణంలో మనస్సు గాఢమైన శాంతితో నిండిందని వ్యాఖ్యానించారుసాధువుల సమక్షంలో కూర్చోవడం అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం అని ఆయన చెప్పారుఇక్కడకు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు ఈ మఠానికి ఉన్న శతాబ్దాల నాటి జీవశక్తిని మరింతగా పెంచుతున్నారన్న ఆయన.. ఈ వేడుకలో ఇక్కడ ప్రజల మధ్య ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారుఇక్కడికి రాకముందు రామ మందిరంవీర్ విఠల్ మందిరాన్ని సందర్శించే అవకాశం లభించినట్లు ప్రస్తావించారుఇక్కడున్న శాంతివాతావరణం ఈ వేడుక ఆధ్యాత్మికతను మరింతగా పెంచాయని పేర్కొన్నారు

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం 550వ వార్షికోత్సవాన్ని చేసుకుంటోందిఇది చాలా చారిత్రాత్మక సందర్భంగత 550 సంవత్సరాలలో ఈ మఠం అనేక కల్లోల పరిస్థితులను ఎదుర్కొందితరాలు మారినాకాలాలు మారినా.. దేశంతో పాటు సమాజంలో అనేక పరివర్తనలు వచ్చినా మఠం ఎప్పుడూ దిశను కోల్పోలేదుదీనికి బదులు ఈ మఠం ప్రజలకు మార్గదర్శక కేంద్రంగా మారిందిమఠానికి ఉన్న గొప్ప గుర్తింపు ఏంటంటే.. చరిత్రతో గట్టిగా పాతుకుపోయి ఉన్నప్పటికీ కాలంతో పాటు మారుతూ ముందుకు కదులుతూనే ఉంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుమఠం స్థాపించటంలో ఉన్న స్ఫూర్తి ఈ రోజు కూడా అదే విధంగా సజీవంగా ఉందని ఆయన పేర్కొన్నారుఆ స్ఫూర్తే సాధనను సేవతోసంప్రదాయాన్ని ప్రజా సంక్షేమంతో మిలితం చేస్తోందన్నారు. ‘జీవితానికి స్థిరత్వంసమతుల్యతవిలువలను అందించడం’ అనే ఆధ్యాత్మికతకు ఉన్న నిజమైన భావనను తరతరాలుగా మఠం తెలియజేస్తోందని ప్రధాని అన్నారుకష్ట సమయాల్లో కూడా సమాజాన్ని నిలబెట్టే బలానికి మఠం చేసిన 550 సంవత్సరాల ప్రయాణమే నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారుఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని మఠాధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీకమిటీలోని సభ్యులందరూఈ వేడుకతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఒక సంస్థ సత్యంసేవల ఆధారంగా నిలబడినప్పుడు అది కాలంలో వచ్చే మార్పులకు కుంగిపోవటానికి బదులుగా సమాజానికి నిలబడే శక్తిని ఇస్తుందని ప్రధాని పేర్కొన్నారుఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మఠం ఈ రోజు ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తోందని ఆయన చెప్పారుఇక్కడ 77 అడుగుల ఎత్తయిన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆయన పేర్కొన్నారుకేవలం మూడు రోజుల క్రితం అయోధ్యలోని అద్భుతమైన శ్రీరామ జన్మభూమి మందిరంపై ధర్మధ్వజాన్ని ఎగురవేసే అదృష్టం పొందాననిఈ రోజు ఇక్కడ గొప్ప శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించే సద్భాగ్యం లభించిందని ఆయన అన్నారుఈ సందర్భంగా రామాయణం ఆధారంగా రూపొందించిన ఒక థీమ్ పార్క్‌ కూడా ప్రారంభమైనట్లు ఆయన వ్యాఖ్యానించారు.

ఈ మఠంతో ముడిపడి ఉన్న కొత్త సౌకర్యాలు భవిష్యత్ తరాలకు జ్ఞానంప్రేరణఆధ్యాత్మిక సాధనను ఇచ్చే శాశ్వత కేంద్రాలుగా మారబోతున్నాయని ప్రధానమంత్రి చెప్పారుఇక్కడ నిర్మాణంలో ఉన్న మ్యూజియంఆధునిక సాంకేతికతతో కూడిన 3డీ థియేటర్ మఠానికి ఉన్న సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే కొత్త తరానికి దీని వారసత్వాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారుదేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తుల భాగస్వామ్యంతో 550 రోజులకు పైగా నిర్వహించిన శ్రీరామ నామ జప యజ్ఞంరామ రథ యాత్ర సమాజంలో భక్తిక్రమశిక్షణకు సంబంధించిన సామూహిక శక్తికి చిహ్నాలుగా మారాయని ఆయన పేర్కొన్నారుఈ సామూహిక శక్తి ఈ రోజు దేశంలోని ప్రతి మూలలో ఒక నూతన చైతన్యాన్ని వ్యాప్తి చేస్తోందని ఆయన ఉద్ఘాటించారు.

ఆధ్యాత్మికతను ఆధునిక సాంకేతికతతో అనుసంధానించే ఈ ఏర్పాట్లు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారుఈ కొత్త నిర్మాణల విషయంలో ఆయన అందరినీ అభినందించారుశతాబ్దాలుగా సమాజాన్ని ఐక్యం చేసిన ఆధ్యాత్మిక శక్తికి చిహ్నంగా స్మారక నాణేలుపోస్టల్ స్టాంప్‌లు కూడా విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.

ద్వైత వేదాంతం అనే దివ్య పునాదిని స్థాపించిన గొప్ప గురు పరంపర ఈ మఠానికి నిరంతరాయంగా శక్తినిస్తోందని ప్రధాని మోదీ ప్రముఖంగా చెప్పారుఅద్వితీయ ఆచార్య జగద్గురు శ్రీ మధ్వాచార్యులవారు అందించిన జ్ఞాన సంప్రదాయ విస్తరణే 1475లో ఈ మఠాన్ని శ్రీమద్ నారాయణ తీర్థ స్వామీజీ స్థాపించారని మోదీ గుర్తు చేశారుఈ సందర్భంగా ఆచార్యులకు వందనం చేసిన ఆయన.. ఉడుపిపర్తగాలి మఠాలు ఒకే ఆధ్యాత్మిక నదికి జీవధారలుగా ఉండటం చాలా ముఖ్యమైనదని ఆయన చెప్పారుభారత పశ్చిమ తీర సాంస్కృతిక ప్రవాహానికి మార్గనిర్దేశం చేస్తోన్న గురుశక్తి ఒకటే అని ఆయన వ్యాఖ్యానించారుఒకే రోజున ఈ సంప్రదాయానికి ముడిపడి ఉన్న రెండు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించడం ఒక ప్రత్యేకమైన యాదృచ్చికమని ఆయన పేర్కొన్నారు.

ఈ సంప్రదాయంతో అనుబంధం ఉన్న కుటుంబాలు తరతరాలుగా జీవితాలకు క్రమశిక్షణజ్ఞానంకష్టపడి పనిచేయడంశ్రేష్ఠతను పునాదిగా చేసుకున్నాయనేది గర్వకారణం అని ప్రధానమంత్రి అన్నారువాణిజ్యం నుంచి ఆర్థికం వరకువిద్య నుంచి సాంకేతికత వరకు వారిలో కనిపించే నైపుణ్యంనాయకత్వంఅంకితభావం అనేవి జీవితానికి ఉన్న లోతైన అర్థాన్ని కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారుఈ సంప్రదాయంతో ముడిపడి ఉన్న కుటుంబాలువ్యక్తులకు అనేక స్ఫూర్తిదాయకమైన విజయ గాథలు ఉన్నాయని ఆయన తెలిపారుఈ విజయాలన్నింటికీ మూలాలు వినయంవిలువలుసేవలో ఉన్నాయని అన్నారుఈ విలువలను పరిరక్షించడంలో ఈ మఠం మూలస్తంభంగా ఉందన్న ఆయన.. ఇది భవిష్యత్ తరాలకు శక్తినిస్తూనే ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు

ఈ చారిత్రక మఠానికి మరొక ముఖ్యమైన లక్షణం ఉందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారుశతాబ్దాలుగా సమాజంలోని ప్రతి ఒక్కరికి సహాయం చేసిన సేవా స్ఫూర్తిని గుర్తు చేసిన ఆయన..  శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు ప్రజలు తమ ఇళ్లను వదిలి కొత్త ప్రదేశాలలో ఆశ్రయం వెతుక్కోవాల్సి వచ్చిందనిఅప్పుడు ఈ మఠమే ఆయా ప్రజలకు అండగా నిలుస్తూ వ్యవస్థీకృతంగా సహాయం చేసిందని తెలిపారుదీనితో పాటు కొత్త ప్రదేశాలలో ఆలయాలుమఠాలుఆశ్రయాలను ఈ మఠం స్థాపించినట్లు పేర్కొన్నారుమఠం కేవలం ధర్మాన్ని మాత్రమే కాకుండా మానవత్వంసంస్కృతిని కూడా రక్షించిందని వ్యాఖ్యానించారుకాలక్రమేణా సేవల పరిధి మరింతగా విస్తరించిందని అన్నారుఈ రోజు విద్య నుంచి  హాస్టళ్ల వరకువృద్ధుల సంరక్షణ నుంచి అవసరంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేసే వరకు మఠం ఎల్లప్పుడూ సొంత వనరులను ప్రజా సంక్షేమానికి ఉపయోగించిందని అన్నారువివిధ రాష్ట్రాల్లో నిర్మించిన హాస్టళ్లు కావొచ్చు.. ఆధునిక పాఠశాలలు కావొచ్చు లేదా కష్ట సమయాల్లో సహాయక చర్యలు కావచ్చు.. ఆధ్యాత్మికతసేవ కలిసి నడిచినప్పుడు స్థిరత్వంముందుకు సాగేందుకు కావాల్సిన ప్రేరణ రెండింటినీ సమాజం పొందుతుందనే దానికి ఈ మఠం తీసుకున్న ప్రతి కార్యక్రమం నిదర్శనమని అన్నారు

గోవాలో ఆలయాలుస్థానిక సంప్రదాయాలు సంక్షోభాలను ఎదుర్కోవటంభాషసాంస్కృతిక గుర్తింపు ఒత్తిడికి లోనైన సమయాలు ఉన్నాయన్న ప్రధాని.. ఈ పరిస్థితులు సమాజ ఆత్మను బలహీనపరచలేదనిబదులుగా మరింత బలోపేతం చేశాయని ప్రధాని వ్యాఖ్యానించారుప్రతి మార్పులో కూడా గోవా అసలైన  సాంస్కృతిక సారాన్ని కాపాడుకుందనికాలంతో పాటు పునరుజ్జీవింపజేసుకుందన్న ఆయన.. ఇదే గోవా ప్రత్యేక లక్షణమని అన్నారుఈ విషయంలో పర్తగాలి మఠం వంటి సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించాయని ఆయన ప్రధానంగా చెప్పారు

"ఈ రోజు భారత్‌ ఒక అద్భుతమైన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని చూస్తోందిఅయోధ్యలో రామ మందిరం పునరుద్ధరణకాశీ విశ్వనాథ్ ధామ్ ఘనమైన పునరాభివృద్ధిఉజ్జయినిలో మహాకాల్ మహాలోక్ విస్తరణ.. ఇవన్నీ దేశ జాగృతిని తెలియజేస్తున్నాయిఇది నూతన శక్తితో దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పునరుద్ధరిస్తోందిఅని మోదీ వ్యాఖ్యానించారురామాయణ సర్క్యూట్కృష్ణ సర్క్యూట్గయాలో అభివృద్ధి పనులుఅపూర్వమైన కుంభమేళా నిర్వహణ వంటి కార్యక్రమాలు నేటి భారత్‌ సాంస్కృతిక గుర్తింపును కొత్త సంకల్పంవిశ్వాసంతో ఎలా ముందుకు తీసుకువెళుతుందో చూపించే ఉదాహరణలని ఆయన పేర్కొన్నారుఈ జాగృతే మూలాలతో భవిష్యత్ తరాలు అనుబంధంగా ఉండేందుకు ప్రేరణనిస్తాయని చెప్పారు

పవిత్రమైన గోవా నేలకు శతాబ్దాల నాటి భక్తిసాధు సంప్రదాయంసాంస్కృతిక అభ్యాసాల నిరంతర ప్రవాహంతో కూడిన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపు ఉందని ప్రధాని పేర్కొన్నారుఈ నేలకు సహజ సౌందర్యంతో పాటు ‘దక్షిణ కాశీ’ అనే గుర్తింపు ఉందన్న ఆయన.. దీనిని పర్తగాలి మఠం మరింతగా ధృడంగా చేసిందని అన్నారుమఠం ప్రభావం కొంకణ్గోవాకు మాత్రమే పరిమితం కాలేదనిదీని సంప్రదాయం దేశంలోని వివిధ ప్రాంతాలువారణాసి పవిత్ర భూమికి కూడా ముడిపడి ఉందని పేర్కొన్నారువ్యవస్థాపకులు ఆచార్య శ్రీ నారాయణ తీర్థ ఉత్తర భారతదేశంలో పర్యటించే సమయంలో వారణాసిలో ఒక కేంద్రాన్ని స్థాపించడం ద్వారా మఠానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రయాణాన్ని దక్షిణం నుంచి ఉత్తరానికి తీసుకెళ్లారన్నారువారణాసి పార్లమెంట్ సభ్యుడిగా ఈ విషయంలో గర్వంగా ఉన్నట్లు పేర్కొన్నారుప్రస్తుతం కూడా వారణాసిలో ఉన్న ఈ కేంద్రం సమాజానికి సేవలను అందిస్తూనే ఉందని తెలిపారు

ఈ పవిత్ర మఠం 550 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనం కేవలం చరిత్రను వేడుకగా చేసుకోవటమే కాకుండా భవిష్యత్తు దిశను కూడా నిర్ణయిస్తున్నామని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారుఅభివృద్ధి చెందిన భారత్‌కు మార్గం ఏకత్వమేనని ఆయన అన్నారుసమాజం కలిసి వచ్చినప్పుడు ప్రతి ప్రాంతంప్రతి వర్గం ఐక్యంగా నిలబడినప్పుడు దేశం గొప్ప పురోగతిని సాధిస్తుందన్నారుశ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం ప్రాథమిక లక్ష్యం ‘ప్రజలను అనుసంధానించడంమనస్సులను అనుసంధానించడంసంప్రదాయం ఆధునికత మధ్య ఒక వారధిని నిర్మించడం’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారుఅందుకే అభివృద్ధి చెందిన భారత్‌ దిశగా దేశం చేస్తోన్న ప్రయాణంలో ఈ మఠం ఒక ముఖ్యమైన ప్రేరణా కేంద్రం పాత్ర పోషిస్తుందన్నారు

ఎక్కడ అనురాగం ఉంటుందో అక్కడ గౌరవంగా కొన్ని అభ్యర్థనలు చేస్తానని ప్రధాని అన్నారుఈ రోజు ప్రజల మధ్యకు వచ్చినందున సహజంగా మనస్సులోకి కొన్ని ఆలోచనలు వచ్చాయని.. వాటిని పంచుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారుఈ మఠం ప్రజలకు తెలియజేయాల్సిన తొమ్మిది విజ్ఞప్తులను చెబుతున్నట్లు ఆయన ప్రధానంగా చెప్పారుఇవి తొమ్మిది సంకల్పాల వంటివని అన్నారుభూమి మనందరి మాతమఠం బోధనలు ప్రకృతిని గౌరవించమని మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి కాబట్టి పర్యావరణ పరిరక్షణను మన కర్తవ్యంగా భావించినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ అనే కల నెరవేరుతుందని ప్రధాని పేర్కొన్నారునీటిని సంరక్షించడం.. నీటిని ఆదా చేయడం.. నదులను రక్షించడం అనేది మొదటి సంకల్పం అయి ఉండాలని తెలిపారుమొక్కలు నాటడాన్ని రెండో సంకల్పంగా తెలియజేసిన ఆయన.. తల్లి పేరు మీద ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని ప్రస్తావించారుఈ దేశవ్యాప్త కార్యక్రమం ఉపందుకుంటోందన్న ఆయన.. ఈ సంస్థకు ఉన్న బలం కూడా తోడైతే దీని ప్రభావం మరింత పెరుగుతుందన్నారుపరిశుభ్రత అనేది మూడో సంకల్పం అయి ఉండాలన్న ఆయన.. ప్రతి వీధిపరిసర ప్రాంతాలునగరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కోరారునాలుగో సంకల్పం ‘స్వదేశీని స్వీకరించడం’ అన్న ఆయన.. నేడు దేశం ఆత్మనిర్భర్ భారత్స్వదేశీ మంత్రంతో ముందుకు సాగుతోందన్నారుదేశం "వోకల్ ఫర్ లోకల్అని నినదిస్తోందన్నారుఈ సంకల్పాన్ని మనం కూడా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

'దేశ్ దర్శన్'ను ఐదో సంకల్పంగా ప్రస్తావించిన ఆయన.. దేశంలోని వివిధ ప్రాంతాల గురించి తెలుసుకోవటంఅర్థం చేసుకునేందుకు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలని అన్నారుఆరో సంకల్పమైన ‘సహజ వ్యవసాయాన్ని’ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారుఆరోగ్యకరమైన జీవనశైలిని స్వీకరించటాన్ని ఏడో సంకల్పంగా పేర్కొన్న ఆయన..  శ్రీ అన్నం – చిరుధాన్యాలను తింటూ ఆహారంలో నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గించాలని సూచించారు. 8వ సంకల్పం ‘యోగాక్రీడలను స్వీకరించడం’  అయి ఉండాలని పేర్కొన్నారుపేదలకు ఏదో ఒక రూపంలో సహాయం చేయటాన్ని 9వ సంకల్పంగా చెప్పారు.

ఈ సంకల్పాలను సామూహిక ప్రజా నిబద్ధతలుగా ఈ మఠం మార్చగలదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారుకాలంతో పాటు బాధ్యతలను కూడా పెంచుకున్నప్పుడే సంప్రదాయం అనేది సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందన్న గొప్ప విషయాన్ని ఈ మఠానికి ఉన్న 550 సంవత్సరాల అనుభవం మనకు తెలియజేస్తోందని ఆయన అన్నారుశతాబ్దాలుగా ఈ మఠం సమాజానికి ఇచ్చిన శక్తినిప్పుడు భవిష్యత్ భారత్‌ను తయారు చేసేందుకు మళ్లించాలని ఆయన కోరారు

ఆధునిక అభివృద్ధి మాదిరిగానే గోవాకు ఉన్న ఆధ్యాత్మిక వైభవం కూడా విలక్షణమైనదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారుఅత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలలో గోవా ఒకటనిపర్యాటక రంగంఫార్మా సేవా రంగానికి ఈ రాష్ట్ర గణనీయంగా దోహదపడుతోందని అన్నారుఇటీవలి సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విద్యఆరోగ్యంలో కొత్త ఘనతలను సాధించిందని తెలిపారుకేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గోవా మౌలిక సదుపాయాలను ఆధునికీకరిస్తున్నాయని తెలిపారురహదారులువిమానాశ్రయాలురైలు అనుసంధానత పెరగటం వల్ల భక్తులుపర్యాటకులకు కూడా ప్రయాణం సులభతరం అవుతోందని అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ అనే  జాతీయ దార్శనికతలో పర్యాటకం ఒక ప్రధాన భాగంగా ఉందని చెప్పారుదీనికి గోవా అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు

భారత్‌ ఒక నిర్ణయాత్మక దశలో ఉందిఇక్కడ యువత బలంపెరుగుతున్న దేశ ఆత్మవిశ్వాసంసాంస్కృతిక మూలాల మీద మక్కువ అన్నీ కలిసి ఒక నూతన భారత్‌ను రూపొందిస్తున్నాయిఅని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారుఆధ్యాత్మికతజాతీయ సేవఅభివృద్ధి కలిసి ముందుకు సాగినప్పుడే అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పం నెరవేరుతుందని ఆయన ప్రముఖంగా చెప్పారుఈ దిశగా పవిత్రమైన గోవా నేలఈ మఠం ఒక ముఖ్యమైన సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారుప్రసంగాన్ని ముగించిన ఆయన.. ఈ పవిత్రమైన సందర్భాన్ని పురస్కరించుకొని మరోసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజుగోవా ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ ప్రమోద్ సావంత్కేంద్ర మంత్రి శ్రీ శ్రీపాద నాయక్‌తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు

నేపథ్యం:

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం ‘సార్ధ పంచశతామనోత్సవ’ అంటే 550వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. దక్షిణ గోవాలోని కానకోనాలో ఉన్న మఠాన్ని సందర్శించారు.

ప్రధానమంత్రి శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠంలో 77 అడుగుల ఎత్తు ఉన్న కాంస్యంతో తయారు చేసిన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారుమఠం అభివృద్ధి చేసిన ‘రామాయణ థీమ్ పార్క్ గార్డెన్‌ను’ కూడా ఆయన ప్రారంభించారుఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుస్మారక నాణేన్ని కూడా విడుదల చేశారు.

శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాలి జీవోత్తమ్ మఠం అనేది మొదటి గౌడ సారస్వత బ్రాహ్మణ వైష్ణవ మఠంక్రీస్తు శకం 13వ శతాబ్దం‌లో జగద్గురు మధ్వాచార్యులవారు స్థాపించిన ద్వైత సిద్ధాంతాన్ని ఇది అనుసరిస్తుందిఈ మఠం ప్రధాన కేంద్రం దక్షిణ గోవాలోని ఒక చిన్న పట్టణమైన పర్తగాలిలో కుశావతి నది ఒడ్డున ఉంది.


(రిలీజ్ ఐడి: 2196704) సందర్శకుల సూచీ సంఖ్య : : 26