ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కర్ణాటకలోని ఉడుపి పర్యటన విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2025 10:01PM by PIB Hyderabad

కర్ణాటకలోని ఉడుపి పర్యటనకు సంబంధించిన కొన్ని ప్రత్యేక దృశ్యాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పంచుకున్నారు. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించిన ప్రధానమంత్రి.. లక్ష కంఠ గీతా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో విద్యార్థులుసాధువులుపండితులుసాధారణ పౌరులతో సహా 100,000 మంది భక్తులు ఏక కాలంలో శ్రీమద్ భగవద్గీతను పఠించారు.

కృష్ణ మందిరం ముందు ఉన్న సువర్ణ తీర్థ మండపాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పవిత్ర కనక కవచాన్ని (బంగారు తొడుగు)ను కూడా సమర్పించారు. ఇది సాధువు కనకదాసు భగవాన్ కృష్ణుడి దివ్య దర్శనం పొందాడని విశ్వసించే పవిత్ర కిటికీ. ఉడుపిలోని శ్రీ కృష్ణ మఠాన్ని 800 సంవత్సరాల క్రితం వేదాంతంతోని ద్వైత తత్వశాస్త్ర స్థాపకుడు శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో ప్రధానమంత్రి పలు పోస్టులు చేశారు.

‘‘భక్తిఅభ్యాసంసంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన ఉడుపిని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. ఉడుపిలో నాకు లభించిన స్వాగతం నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ చెక్కుచెదరదు. ప్రజలకు కృతజ్ఞతలు’’

“ఉడుపి అనేది ధర్మందయసామాజిక అభ్యున్నతిలో బలంగా పాతుకుపోయిన ప్రదేశం”

“పేదవారికి సహాయం చేసే మార్గాన్ని భగవాన్ శ్రీ కృష్ణుడు మనకు బోధిస్తాడు. ఆ స్ఫూర్తే ఆయుష్మాన్ భారత్ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి అనేక కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తోంది”

“గీత నుంచి స్ఫూర్తి పొందిమన వర్తమానంభవిష్యత్తు శ్రేయస్సు కోసం ఈ తొమ్మిది సంకల్పాలను తీసుకోవాలని మీ అందరినీ నేను వినయంగా కోరుతున్నాను’’

‘‘అద్భుతమైనదివ్యమైన లక్ష కంఠ గీతా పారాయణం అందరినీ శక్తితోలోతైన భక్తితో నింపింది. ఇంత పెద్ద సమూహం ఏకగ్రీవంగా గీతా పఠనాన్ని చూడటం మరచిపోలేని క్షణం.”

"నేడు ఉడుపి లోని శ్రీ కృష్ణ మఠం సందర్శన చాలా ప్రత్యేకమైనది. గీతా పఠనం మరపురాని అనుభవం. సువర్ణ తీర్థ మండపాన్ని ప్రారంభించికనకన కిండికి కనక కవచాన్ని అంకితం చేశాను. కనకన కిండి నుంచి భగవాన్ శ్రీ కృష్ణుడిని ప్రార్థనలు చేశాను. శ్రీ కనక దాసకు  నివాళులు అర్పించడం  గౌరవంగా ఉంది.’’

"ఉడిపిలోని శ్రీ కృష్ణ మఠం నుంచి మరికొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి.’’


(రిలీజ్ ఐడి: 2196698) సందర్శకుల సూచీ సంఖ్య : : 28