ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యోలో జరిగిన 25వ వేసవి డెఫ్లింపిక్స్-2025లో అద్భుత ప్రదర్శన చేసిన భారత డెఫ్లింపియన్లకు ప్రధాని అభినందనలు
प्रविष्टि तिथि:
27 NOV 2025 5:10PM by PIB Hyderabad
టోక్యోలో జరిగిన 25వ వేసవి డెఫ్లింపిక్స్ 2025లో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత డెఫ్లింపియన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
చరిత్రాత్మక రీతిలో 9 స్వర్ణాలతో సహా 20 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మన క్రీడాకారులు.. దృఢ సంకల్పం, అంకితభావంతో గొప్ప ఫలితాలను సాధించవచ్చని మరోసారి నిరూపించారు.
ప్రతి అథ్లెట్, కోచ్, సహాయక సిబ్బంది చేసిన నిరంతర కృషిని, కనబరిచిన నిబద్ధతను ప్రధానమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు కీర్తిని పెంచుతూ వారు సాధించిన విజయాలతో దేశమంతా గర్వంతో ఉప్పొంగుతోందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ చేసిన పోస్టు:
‘‘టోక్యోలో జరిగిన 25వ వేసవి డెఫ్లింపిక్స్ 2025లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మన డెఫ్లింపియన్లకు హృదయపూర్వక అభినందనలు. చరిత్రాత్మక రీతిలో 9 స్వర్ణాలతో సహా 20 పతకాలు సాధించిన మన అథ్లెట్లు.. దృఢ సంకల్పం, అంకితభావంతో గొప్ప ఫలితాలను సాధించవచ్చని మరోసారి నిరూపించారు. ప్రతి అథ్లెట్, కోచ్, సహాయక సిబ్బందికి అభినందనలు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది!’’
***
(रिलीज़ आईडी: 2195635)
आगंतुक पटल : 47
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam