ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రవేశిక పఠనంలో పాల్గొన్న పీఎంవో అధికారులు
Posted On:
26 NOV 2025 9:18PM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు భారత రాజ్యాంగ ప్రవేశిక పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పవిత్ర గ్రంథ పఠన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి-2 శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అతీష్ చంద్ర, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
‘ఎక్స్’ వేదికగా భారత ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"ఈ రోజు రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రవేశిక పఠన కార్యక్రమం నిర్వహించాం. ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా, ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి-2 శ్రీ శక్తికాంత దాస్, ప్రధానమంత్రి సలహాదారు శ్రీ తరుణ్ కపూర్, ప్రధానమంత్రి ప్రత్యేక కార్యదర్శి శ్రీ అతీష్ చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు."
(Release ID: 2195095)
Visitor Counter : 6