ఇఫిలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.. ఇఫి వేడుకల్లో రాజ్యాంగ పీఠికను పఠించిన పీఐబీ అధికారులు
దేశవ్యాప్తంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా, 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం వేడుక చేసుకుంటోంది. ఇఫిలో జరిగిన ఈ కార్యక్రమానికి పీఐబీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వట్స్ శర్మ, ఇండియన్ మాస్ కమ్యూనికేషన్ ఇనిస్టిట్యూట్ (ఐఐఎంసీ) వైస్ ఛాన్సలర్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ పీఠికను అధికారులంతా కలిసి పఠించిన తర్వాత దాని విలువలను పరిరక్షించేందుకు సంకల్పం చెప్పుకున్నారు.
"భారతదేశ ప్రజలమైన మేం, దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా స్థాపించటానికి, పౌరులకు భద్రత కల్పించటానికి దృఢ నిశ్చయంతో సంకల్పించాం..” అన్న మాటలతో ఈ కార్యక్రమం... ప్రారంభమైంది.
ఈ ఉత్సవంలో పాల్గొన్న మీడియా, కమ్యూనికేషన్ నిపుణుల్లో రాజ్యాంగ బాధ్యత, పౌరుల విధి, జాతీయ సమైక్యత స్ఫూర్తిని ఈ కార్యక్రమం చాటి చెప్పింది.
దేశ రాజ్యాంగం, మార్గదర్శక సూత్రాలపై ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తూ "జై హింద్" అనే దేశభక్తి నినాదంతో కార్యక్రమం ముగిసింది.
Release ID:
2194846
| Visitor Counter:
2