ప్రధాన మంత్రి కార్యాలయం
కబడ్డీ ప్రపంచ కప్-2025 కైవసంపై భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి అభినందన
Posted On:
24 NOV 2025 8:11PM by PIB Hyderabad
కబడ్డీ ప్రపంచ కప్-2025లో అద్భుత విజయంతో టైటిల్ కైవసం చేసుకున్న భారత మహిళల కబడ్డీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“కబడ్డీ ప్రపంచ కప్ కైవసం చేసుకోవడం ద్వారా యావద్భారతం గర్వపడేలా చేసిన మన మహిళల కబడ్డీ జట్టుకు హృదయపూర్వక అభినందనలు! జట్టు సభ్యులందరూ అకుంఠిత దీక్ష, పట్టుదల, అత్యుత్తమ నైపుణ్యంతో ప్రత్యర్థి మీద పైచేయి సాధించారు. ఈ స్ఫూర్తిదాయక విజయం అనేకమంది వర్ధమాన కబడ్డీ క్రీడాకారులకు ఉజ్వల భవితపై ఆకాంక్షను ప్రేరేపించి, ఉన్నత లక్ష్యాల సాధన వైపు నడిపిస్తుంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
***
(Release ID: 2194049)
Visitor Counter : 4
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil