|
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
‘ఇఫి’లో 4వ రోజు: సృజనాత్మక మేధ... సంకేతాత్మక చిత్రీకరణల సమ్మేళనం
Posted On:
23 NOV 2025 7:13PM by PIB Hyderabad
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2025 (ఇఫి)లో నాలుగో రోజున అత్యుత్తమ అంతర్జాతీయ ప్రతిభా సంగమం ఆవిష్కృతమైంది. ఇందులో భాగంగా సృజనాత్మకత పరంగా ఎదురయ్యే తీవ్ర సవాళ్లు, నిపుణుల స్ఫూర్తిదాయక ప్రసంగాల (మాస్టర్‌క్లాస్)తో కార్యక్రమం ముగిసింది.
దాదాపు 48 గంటలపాటు సాగిన ‘భవిష్యత్ సృజనాత్మక మేధ’ (సీఎంఓటీ) పోటీల కోలాహలం ముగింపుతో ఇవాళ్టి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు యువ దర్శకుల అంతిమ ప్రతిభా ప్రదర్శన సమాప్తితో వారిలో గూడు కట్టుకున్న ‘ఉద్వేగం, ఉత్కంఠ’ మాయమై ‘ఊరట, ఉత్సాహం’ ఉరకలెత్తాయి.
ఈ ఉత్సవాలకు నిరంతర హృదయ స్పందనగా మారిన పాత్రికేయ సమాచార సంస్థ (పీఐబీ) మీడియా సెంటర్ వరుసగా ప్రధాన పాత్రికేయ సమావేశాలను నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో 'డి టాల్ పాలో' (ఇవాన్ డారియల్ ఓర్టిజ్ లాండ్రాన్, జోస్ ఫెలిక్స్ గోమెజ్), ‘పైక్ రివర్’ (రాబర్ట్ సర్కీస్) చిత్రాల దర్శకులు, నటులు తమ ఆకర్షణీయ అనుభవాలపై చర్చించారు. అలాగే ‘సీసైడ్ సెరెండిపిటీ’ (టోమోమి యోషిమురా), ‘టైగర్’ (అన్షుల్ చౌహాన్, కోసే కుడో, మినా మోటేకి) చిత్ర బృందాలు ఆసియా సినిమా ప్రభావశీల సామర్థ్యాన్ని ప్రస్ఫుటం చేశాయి.
దీనికి సమాంతరంగా భారత ప్రాంతీయ చిత్రాలు, డాక్యుమెంటరీలు కూడా తమ విశిష్టతను ఘనంగా చాటుకున్నాయి. ఈ మేరకు సందేశ్ కడూర్, పరేష్ మొకాషి, దేబాంగ్కర్ బోర్గోహైన్ తాము రూపొందించిన ‘నీలగిరిస్- ఎ షేర్డ్ వైల్డర్‌నెస్’, ‘ముక్కం పోస్ట్ బొంబిల్వాడి’, ‘సికార్’ వంటి విభిన్న చిత్రాల గురించి పాత్రికేయులతో సంయుక్తంగా ముచ్చటించారు. మరోవైపు విదేశీ దర్శకులు క్రిస్టినా థెరిసా టోర్నాజెస్ (‘కార్లా’), హయకావా చీ (‘రెనోయిర్’) తమ సృజనాత్మక అనుభవాలను పంచుకోవడంతో చిత్రోత్సవం ఆకర్షణీయ అంతర్జాతీయ కళాత్మకత కొనసాగింది.
ఉత్సవాల నాలుగో రోజు విశిష్ట కార్యక్రమం కళా అకాడమీలో నిర్వహించిన ‘మాస్టర్ క్లాస్’: ‘గివ్ అప్ ఈజ్ నాట్ ఎ ఛాయిస్!’ ఈ అంశంపై భారత చలనచిత్ర దిగ్గజ నటుడు-వక్త అనుపమ్ ఖేర్ తన ప్రసంగంతో ప్రేక్షకులను మైమరపించారు. ‘అభిరుచి-పునరుత్థాన సామర్థ్యం’ అనే నాలుగో రోజు వేడుకల ఇతివృత్తానికి ఈ స్ఫూర్తిదాయక, శక్తియుత ప్రసంగం పూర్తి న్యాయం చేసింది.
48 గంటల ‘సీఎంఓటీ’ ముగింపు
ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మొదట దాదాపు 48 గంటలపాటు నిర్వహించిన ‘భవిష్యత్ సృజనాత్మక మేధ’ (సీఎంఓటీ) పోటీల ముగింపు కార్యక్రమాన్ని గోవాలోని కళా అకాడమీలో నిర్వహించారు:
‘డి టాల్ పాలో’, ‘పైక్ రివర్’ చిత్రాలపై విలేకరుల సమావేశం

పీఐబీ మీడియా సెంటర్‌లో 2025 నవంబరు 23న విలేకరుల సమావేశంలో ‘డి టాల్ పాలో’ చిత్ర దర్శకుడు ఇవాన్ డారియల్ ఓర్టిజ్ లాండ్రాన్, నటుడు జోస్ ఫెలిక్స్ గోమెజ్‌లతోపాటు ‘పైక్ రివర్’ దర్శకుడు రాబర్ట్ సర్కీస్ ప్రసంగం.

‘సీసైడ్ సెరెండిపిటీ’, ‘టైగర్’ చిత్రాలపై విలేకరుల సమావేశం

పీఐబీ మీడియా సెంటర్‌లో 2025 నవంబరు 23న సంయుక్తంగా విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న ‘సీసైడ్ సెరెండిపిటీ’ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ టోమోమి యోషిమురా, ‘టైగర్’ దర్శకుడు అన్షుల్ చౌహాన్, నటుడు కోసీ కుడో, నిర్మాత మినా మోటేకి.

ఇఫి-2025 పీఐబీ మీడియా సెంటర్‌లో ‘నీలగిరిస్- ఎ షేర్డ్ వైల్డర్‌నెస్’,
‘ముక్కం పోస్ట్ బొంబిల్వాడి’, ‘సికార్’ చిత్రాలపై విలేకరుల సమావేశం

ఇఫి-2025 పీఐబీ మీడియా సెంటర్‌లో ‘నీలగిరిస్- ఎ షేర్డ్ వైల్డర్‌నెస్’, ‘ముక్కం పోస్ట్ బొంబిల్వాడి’, ‘సికార్’ చిత్రాలపై విలేకరులతో మాట్లాడుతున్న దర్శకులు సందేశ్ కడూర్, పరేష్ మొకాషి, దేబాంగ్కర్ బోర్గోహైన్.

ఇఫి-2025 పీఐబీ మీడియా సెంటర్‌లో ‘నీలగిరిస్- ఎ షేర్డ్ వైల్డర్‌నెస్’, ‘ముక్కం పోస్ట్ బొంబిల్వాడి’, ‘సికార్’ చిత్రాలపై దర్శకులు సందేశ్ కడూర్, పరేష్ మొకాషి, దేబాంగ్కర్ బోర్గోహైన్‌లతో విలేకరుల సమావేశానికి హాజరైన ప్రచురణ-ప్రసార మాధ్యమాల ప్రతినిధులు.
‘కర్లా’, ‘రెనోయిర్’ చిత్రాలపై విలేకరుల సమావేశం

ఇఫి-2025 పీఐబీ మీడియా సెంటర్‌లో విలేకరులతో సంయుక్తంగా మాట్లాడుతున్న ‘కర్లా’, ‘రెరోయిర్’ చిత్రాల దర్శకులు క్రిస్టినా థెరిసా టోర్నాజెస్, హయకావా చీ.

ఇఫి-2025 పీఐబీ మీడియా సెంటర్‌లో ‘కర్లా’, ‘రెరోయిర్’ చిత్రాలపై దర్శకులు క్రిస్టినా థెరిసా టోర్నాజెస్, హయకావా చీతో విలేకరుల సమావేశానికి హాజరైన ప్రచురణ-ప్రసార మాధ్యమాల ప్రతినిధులు.
మాస్టర్ క్లాస్: ‘గివింగ్ అప్ ఈజ్ నాట్ ఎ ఛాయిస్!
ఇఫి-2025లో నాలుగో రోజు కళా అకాడమీలో విశిష్ట కార్యక్రమం ‘గివ్ అప్ ఈజ్ నాట్ ఎ ఛాయిస్!’ అంశంపై దిగ్గజ నటుడు-వక్త అనుపమ్ ఖేర్ స్ఫూర్తిదాయక ‘మాస్టర్ క్లాస్’ నిర్వహించారు. ఆయన చలనచిత్ర జీవిత సాఫల్యానికి తోడ్పడిన అరుదైన విద్వత్, విజ్ఞానానుభవాలపై సన్నిహిత పరిశీలనకు ఈ కార్యక్రమం అవకాశమిచ్చింది.

కళా అకాడమీలో 2025 నవంబరు 23న ‘గివ్ అప్ ఈజ్ నాట్ ఎ ఛాయిస్!’ అంశంపై మాస్టర్ క్లాస్‌లో ప్రేక్షకులనుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రముఖ నటుడు-వక్త అనుపమ్ ఖేర్

బృంద గోష్ఠి: స్వతంత్ర సినిమా ద్వారా ప్రపంచ అవలోకనం

ఇఫి-2025లో భాగంగా కళా అకాడమీలో 2025 నవంబరు 23న ‘స్వతంత్ర సినిమా ద్వారా ప్రపంచ అవలోకనం’పై బృంద గోష్ఠిలో మీనాక్షి జయన్, రజనీ బాసుమటరీ, ఫౌజియా ఫాతిమా, రాచెల్ గ్రిఫిత్స్ చర్చిస్తున్న దృశ్యం.

ఇఫి-2025లో భాగంగా కళా అకాడమీలో 2025 నవంబరు 23న ‘స్వతంత్ర సినిమా ద్వారా ప్రపంచ అవలోకనం’పై బృంద గోష్ఠిలో మీనాక్షి జయన్, రజనీ బాసుమటరీ, ఫౌజియా ఫాతిమా, రాచెల్ గ్రిఫిత్స్ చర్చిస్తున్న దృశ్యం.
చర్చా గోష్ఠి: “ది రిథమ్స్ ఆఫ్ ఇండియా: ఫ్రం ది హిమాలయాస్
టు ది డెక్కన్” అంశంపై లతా మంగేష్కర్ స్మారక చర్చ:

గోవాలోని పణజి నగరంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-2025 నాలుగో రోజున “ది రిథమ్స్ ఆఫ్ ఇండియా: ఫ్రం ది హిమాలయాస్ టు ది డెక్కన్” అంశంపై చర్చా గోష్ఠిలో భాగంగా “లతా మంగేష్కర్ స్మారక చర్చ”లో పాల్గొన్న విశాల్ భరద్వాజ్, బి.అజనీష్ లోక్‌నాథ్, సుధీర్ శ్రీనివాసన్.

***
(Release ID: 2193880)
|