ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్- 2025లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలుగొట్టిన భారత క్రీడాకారులకు ప్రధాని అభినందనలు
Posted On:
24 NOV 2025 12:06PM by PIB Hyderabad
ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్-2025లో అద్భుత ప్రదర్శనతో రికార్డులు బద్దలుగొట్టిన భారత క్రీడాకారులకు ప్రధానమంత్రి శ్రీ నరంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
క్రీడాకారులు మునుపెన్నడూ లేనివిధంగా 9 స్వర్ణాలు సహా 20 పతకాలను దేశానికి అందించారని ప్రశంసించారు. భారత బాక్సింగుకు ఇదో చరిత్రాత్మక విజయమన్నారు. దేశ బాక్సర్ల సంకల్పం, కృతనిశ్చయం, అలుపెరుగని స్ఫూర్తే ఈ విజయానికి కారణమన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్- 2025లో మన అద్భుత క్రీడాకారులు అసాధారణమైన, రికార్డు స్థాయి ప్రదర్శన కనబరిచారు. మునుపెన్నడూ లేనివిధంగా 9 స్వర్ణాలు సహా 20 పతకాలను దేశానికి సాధించి పెట్టారు. మన బాక్సర్ల సంకల్పం, కృతనిశ్చయమే దీనికి కారణం. వారికి అభినందనలు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.”
***
(Release ID: 2193863)
Visitor Counter : 2
Read this release in:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada