ప్రధాన మంత్రి కార్యాలయం
తొలి అంధ మహిళల టీ20 ప్రపంచ కప్‌లో విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని అభినందన
Posted On:
24 NOV 2025 12:07PM by PIB Hyderabad
తొలి అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
సిరీస్‌లో ఓటమెరుగకుండా నిలిచి గెలిచిన జట్టు అద్భుత విజయాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు. కఠోర శ్రమ, సమష్టి కృషి, దృఢ సంకల్పానికి ఇదొక అద్భుత ఉదాహరణగా అభివర్ణించారు. జట్టులోని ప్రతి క్రీడాకారిణీ నిజమైన ఛాంపియన్ అని, వారి అంకితభావం దేశానికి కీర్తిని తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమత్రి ఇలా పేర్కొన్నారు:
“తొలి అంధ మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు. ఈ సిరీస్‌లో వారెప్పుడూ ఓటమిని ఎదుర్కోవకపోవడం మరింత ప్రశంసనీయం. ఇది నిజంగా చరిత్రాత్మక క్రీడా విజయం. కఠోర శ్రమ, సమష్టి కృషి, దృఢ సంకల్పానికి అద్భుత ఉదాహరణ. నిజంగా ప్రతి క్రీడాకారిణీ ఛాంపియనే! భవిష్యత్తులోనూ జట్టు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విజయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుంది.”
***
(Release ID: 2193859)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam