ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక సంస్కరణలు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుతాయో వివరించిన వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 24 NOV 2025 2:33PM by PIB Hyderabad

ప్రభుత్వం తీసుకొచ్చిన పరివర్తనాత్మక కొత్త కార్మిక సంస్కరణలు.. దేశం విశ్వసనీయ ప్రపంచ భాగస్వామిగా ఎదుగుతున్న విషయాన్నిభవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థను ఎలా తీర్చిదిద్దుతాయనే అంశాలను వివరిస్తూ కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రాసిన ఓ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ఈ సంస్కరణలు కలిగించే  ప్రభావాన్ని ఇటీవల ఒక వ్యాసంలో కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్సుఖ్ మాండవియా వివరించారుఇవి నిబంధనలను సులభతరం చేయడంతోపాటు, మహిళా కార్మికులకు సాధికారత కల్పిస్తాయి. ప్రపంచ సరాఫరా వ్యవస్థలో భారత స్థానాన్ని బలోపేతం చేస్తాయి.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో పీఎంఓ ఇండియా చేసిన పోస్టులో ఇలా పేర్కొంది:

"భారతదేశం విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని ప్రపంచం గుర్తిస్తోందిప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కార్మిక సంస్కరణలు భవిష్యత్తును మెరుగు పరిచే ఆర్థిక వ్యవస్థ పట్ల నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. ఇవి నిబంధనలను సులభతరం చేస్తాయిమహిళా కార్మికులకు సాధికారత కల్పిస్తాయిప్రపంచ సరాఫరా వ్యవస్థలో భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తాయి.

కేంద్రమంత్రి డాక్టర్ @mansukhmandviya లోతైన విశ్లేషణలతో రాసిన వ్యాసం ద్వారా  దీని గురించి ఆలోచించండి.”

 

***


(Release ID: 2193857) Visitor Counter : 3