రచన ఊహాజనిత భావోద్వేగం... ఎడిటింగ్ అనువైక భావోద్వేగం: రాజు హిరానీ
ఒక సినిమాకు ఇతివృత్తం ఆత్మ అయితే కథలోని సంఘర్షణ ఆక్సిజన్: హిరానీ
ఈ రోజు ఐఎఫ్ఎఫ్ఐలో దీపాలు మసకబారాయి. మనసులు తెరుచుకున్నాయి. సృజనాత్మకత గాలిలో నాట్యం చేసింది. జనం వర్క్‌షాప్‌కు తక్కువ... సినిమాటిక్ పవర్-బూస్ట్‌కు ఎక్కువ అనిపించే అనుభవం పొందారు. రాజు హిరానీ అడుగుపెట్టిన క్షణం... కళా అకాడమీ హాల్ సాధారణంగా బ్లాక్‌బస్టర్ శుక్రవారాల ఉత్సాహంతో సందడి చేసింది. అతను ముగించే సమయానికి... రచయితలు తొందరపడి రాస్తున్నారు. ఎడిటర్లు తెలిసీ తల ఊపుతున్నారు. సినీ ప్రియులు స్ఫూర్తికీ, ఆశ్చర్యానికి మధ్య ఎక్కడో తేలుతున్నారు.
అత్యంత విజయవంతమైన, ప్రఖ్యాత చిత్ర రూపకర్తల్లో ఒకరైన వ్యక్తి పంచ్ లైన్లు... “రచన ఊహించిన భావోద్వేగం అయితే ఎడిటింగ్ అనుభవించిన భావోద్వేగం... రచయిత మొదటి డ్రాఫ్ట్ రాస్తే, ఎడిటర్ చివరిది రాస్తారు.... ఇతివృత్తం ఒక సినిమాకు ఆత్మ అయితే కథలోని సంఘర్షణ ఆక్సిజన్ అవుతుంది” సినీ ప్రియుల హృదయాల్లో నిలిచిపోయాయి.

"చిత్రం రచన, ఎడిటింగ్ అనే రెండు బల్లలపై రూపొందుతుంది. ఒక దృక్పథం" అనే అంశంపై మాస్టర్ క్లాస్ కమ్ వర్క్‌షాప్‌లో ప్రసంగిస్తూ... రచనా ప్రక్రియ సారాంశాన్ని కవితాత్మక సరళతతో సమ్మిళితం చేస్తూ హిరానీ తన ఉపన్యాసం ప్రారంభించారు. "రచన కలలు కనే ప్రదేశం." అని చెప్పిన ఆయన రచయిత అపరిమితమైన స్వేచ్ఛను ఎలా ఆనందిస్తాడో వివరించాడు. దీనిలో అపరిమితమైన ఆకాశం, పరిపూర్ణ సూర్యోదయాలు, దోష రహిత నటులు ఉండగా... దీనికి ఎలాంటి బడ్జెట్లు... పరిమితులు ఉండవన్నారు. కానీ ఈ ఊహించిన దృశ్యాలు ఎడిటర్ టేబుల్‌కు చేరుకున్న క్షణం... వాస్తవికత తప్పనిసరిగా వాటిని మారుస్తుంది. "ఒక పాత్ర నిజంగా ఏదైనా కోరుకున్నప్పుడు మాత్రమే... "ఒక చిత్రం ప్రారంభమవుతుంది" అని హిరానీ పేర్కొన్నాడు. "ఆ కోరిక కథనానికి హృదయ స్పందన అవుతుంది. సంఘర్షణ... ఆక్సిజన్ అవుతుంది - అది లేకుండా, ఏదీ ఊపిరి పీల్చుకోదు." అని వివరించారు.

రచయితలు తమ కథలను ప్రత్యక్ష అనుభవంతో రూపొందించాలని ఆయన కోరారు. "ఒక మంచి రచయిత జీవితం నుంచి ప్రేరణలను ఎంచుకోవాలి. నిజమైన అనుభవాలు కథలను నమ్మశక్యం కానివిగా, ప్రత్యేకమైనవిగా, ఎంతో ఆకర్షణీయంగా చేస్తాయి" అని ఆయన స్పష్టం చేశారు. నాటకంలోకి వివరణ కనిపించకుండానే అల్లుకోవాలని... సినిమాకు ఆత్మ అయిన ఇతివృత్తం ప్రతి సన్నివేశం కింద నిరంతరం నెమ్మదిగా ప్రతిధ్వనించాలని ఆయన ప్రేక్షకులకు గుర్తు చేశారు.
తన తొలి ప్రేమ అయిన ఎడిటింగ్ గురించి హృదయపూర్వకంగా మాట్లాడుతూ... లోతైనది, దాగి ఉన్నది అయిన ఎడిటర్ శక్తిని హిరాణీ వివరించారు. "ఫుటేజ్ ఎడిటింగ్ టేబుల్‌కు చేరుకున్నప్పుడు"... "ప్రతిదీ భిన్నంగా మారుతుంది. ఎడిటర్ కథను తిరిగి ఊహించుకుంటాడు. అతను గుర్తింపు లభించని హీరో. అతని పని కనిపించదు, కానీ అది సినిమాను కలిపి ఉంచుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎడిటర్ టూల్‌కిట్‌నూ ఆయన చక్కగా వివరించారు. ఎడిటింగ్ యూనిట్ ఒక షాట్ అయితే... వేరే సందర్భంలో ఉంచిన ఆ షాట్ అర్థాన్ని పూర్తిగా మార్చగలదని ఆయన వివరించారు. ఎడిటింగ్ "చాలా శక్తిమంతమైనది" అని చెప్పిన ఆయన... "ఒక ఎడిటర్ కథను 180 డిగ్రీలు తిప్పగలడు." అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

తొలి తరం సినిమా మార్గదర్శకులను ఉటంకిస్తూ... "మంచి ఎడిటర్ మీ భావోద్వేగాలతో ఆడుకుంటాడు" అనే డీడబ్ల్యూ గ్రిఫిత్ ప్రసిద్ధ ఆలోచనను హిరాణీ గుర్తుచేసుకున్నారు. "రచయిత మొదటి డ్రాఫ్ట్ వ్రాస్తే... ఎడిటర్ చివరిది రాస్తాడు." అనే ఒక అద్భుత సత్యాన్ని వేదికపై ప్రతిధ్వనింపజేసిన ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
"కథానాయకుల పాత్రల మాదిరిగానే ప్రతినాయకుల పాత్ర కూడా బలమైన దృక్కోణాన్ని కలిగి ఉండాలని హిరానీ స్పష్టం చేశారు. "ప్రతి పాత్ర"... "తనకు తాను సరైనవారని నమ్ముతారు. కథ అసలు శక్తి అక్కడే మొదలవుతుంది. ఈ సత్యాల ఘర్షణ... దృక్కోణాల మధ్య ఈ ఉద్రిక్తత... కథనానికి ప్రాణం పోస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఉత్సాహభరితమైన సంభాషణలో పాల్గొన్న ప్రముఖ స్క్రీన్ రైటర్ అభిజత్ జోషి... కథ చెప్పడంలో నిజ జీవిత జ్ఞాపకాల అసాధారణ శక్తిని ప్రతిబింబించారు. హాస్యాస్పదం, హృదయ విదారకం, ఆశ్చర్యకరం అయిన మన జీవితంలోని కొన్ని క్షణాలు దశాబ్దాల పాటు మన మనస్సులలో నిలిచి ఉంటాయనీ, అందుకే స్క్రిప్ట్ చేసిన ఆవిష్కరణలు తరచుగా అసమాన ప్రామాణికతను కలిగి ఉంటాయని ఆయన వివరించారు. అలాంటి అనేక జ్ఞాపకాలు తరువాతి కాలంలో 3 ఇడియట్స్ చిత్రంలోకి ప్రవేశించాయనీ... వాటిలో ప్రసిద్ధి చెందిన విద్యుత్ షాక్ హాస్య సన్నివేశం, అతను సంవత్సరాలుగా గమనించిన వ్యక్తుల నుంచి తీసుకున్న అనేక లక్షణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
ప్రతి పాత్రకు ఒక బలమైన కోరిక ఉండాలి... సంఘర్షణే సినిమాకు ఆక్సిజన్... చెల్లుబాటయ్యే రెండు వ్యతిరేక సత్యాలు ఢీకొన్నప్పుడు బలమైన నాటకం పుడుతుంది... వంటి గొప్ప స్క్రీన్ రైటింగ్ సత్యాలను పేర్కొంటూ జోషి తన ప్రసంగాన్ని ముగించారు.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం దక్షిణాసియాలోనే పురాతనమైన, అతిపెద్ద సినిమా వేడుకగా నిలుస్తుంది. నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్... భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ... గోవా రాష్ట్ర ప్రభుత్వం... గోవా ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం ప్రపంచ సినిమాకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. ఇక్కడ అలనాటి అపురూప చిత్రాలు, సాహసోపేతమైన ప్రయోగాత్మక చిత్రాలు, లెజెండరీ మాస్ట్రోలు, నిర్భయంగా రూపొందించిన తొలి సినిమాలు ఒకే చోట కలిసి ఈ వేడుకలకు హాజరైన ప్రేక్షకులను అలరిస్తాయి. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, ఘన నివాళులతో పాటు... ఆలోచనలు, ఒప్పందాలు, సహకారాలకు అపార అవకాశాలను అందించే శక్తిమంతమైన వేవ్స్ ఫిల్మ్ బజార్ వంటి కార్యక్రమాలు ఐఎఫ్ఎఫ్ఐని మరింత అద్భుత వేదికగా మార్చుతున్నాయి. నవంబర్ 20–28 వరకు అందమైన గోవా తీరప్రాంతంలో ప్రదర్శితమయ్యే 56వ ఎడిషన్.... ప్రపంచ వేదికపై భారత సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించే ఒక అద్భుతమైన వేడుకగా... భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
మరింత సమాచారం కోసం, క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
Release ID:
2193837
| Visitor Counter:
2