56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్' పుస్తకావిష్కరణ
సినిమాను ఆకర్షణకు మించి అర్థం చేసుకోవాలని కోరుకునే ఎవరికైనా
ఈ పుస్తకం ముఖ్యమైనది: పబ్లికేషన్ డివిజన్ ప్రిన్సిపల్ డీజీ
గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) లో ఈ సాయంత్రం 'లెజెండ్స్ ఆఫ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్' పుస్తకాన్ని ఆవిష్కరించారు. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్ డివిజన్ (డీపీడీ) ఈ పుస్తకాన్ని తాజాగా ప్రచురించింది. ఐఎఫ్ఎఫ్ఐ లోని పీఐబీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో డీపీడీ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ భూపేంద్ర కైంతోలా ప్రఖ్యాత కొంకణి చిత్ర దర్శకుడు రాజేంద్ర తలక్ తో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

శ్రీ కైంతోలా ఈ పుస్తకం ప్రాముఖ్యతను వివరిస్తూ, "భారత అత్యున్నత చలనచిత్ర పురస్కారం-దాదాసాహెబ్ ఫాల్కే- అవార్డును గెలుచుకున్న దిగ్గజాల ప్రయాణాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 1969 నుంచి 1991 మధ్య ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న దేవికా రాణి, సత్యజిత్ రే, వి. శాంతారాం, లతా మంగేష్కర్ వంటి దిగ్గజాలతో సహా, 23 మంది జీవితాలను ఈ పుస్తకం ఆవిష్కరిస్తుంది” అని అన్నారు.
"ఈ పుస్తకం సంకలన సంపాదకుడు సంజిత్ నార్వేకర్ కాగా, 17 మంది రచయితలు రాసిన 23 వ్యాసాల సమాహారం" అని శ్రీ కైంతోలా తెలిపారు. ఇద్దరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, మిథున్ చక్రవర్తి, ఆశా పరేఖ్ ఈ పుస్తకానికి ముందుమాటలను రాయడం మరో ఆసక్తికరమైన అంశమని ఆయన తెలిపారు. పుస్తకంలోని అంశాలను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి, శ్రీ కైంతోలా ముందుమాట నుంచి కొన్ని భాగాలను చదివి వినిపించారు.
“సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలోని పబ్లికేషన్ డివిజన్ ఇలాంటి ముఖ్యమైన విశేషాలను పుస్తకాలుగా ముద్రించి తక్కువ ధరకు అందించే బాధ్యత కలిగి ఉంది. పరిశోధకులకు, అలాగే కేవలం సినిమాను ఆకర్షణ, శోభ మాత్రమే కాకుండా, అంతకు మించి దాని చరిత్రను అర్థం చేసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ పుస్తకం ఎంతో విలువైంది” అని శ్రీ కైంతోలా చెప్పారు.
ఈ పుస్తకాన్ని ప్రచురించిన పబ్లికేషన్ డివిజనుకు కొంకణి చిత్ర దర్శకుడు రాజేంద్ర తలక్ అభినందనలు తెలిపారు. "నేటి తరానికి ఊహించడం కూడా కష్టమైన అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఈ దిగ్గజాలు సినిమాలను సృష్టించారు. చిత్ర నిర్మాణ కళను అర్థం చేసుకోవాలనుకునే ఎవరికైనా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది" అని ఆయన అన్నారు.
చిత్ర విజయం లేదా వైఫల్యంతో సంబంధం లేకుండా, కఠోర శ్రమపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ప్రముఖంగా చెబుతూ, ఆ దిగ్గజాల ప్రేరణాత్మక సినీ ప్రయాణమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
"నిస్సందేహంగా, సినిమా అనేది సున్నితంగా ప్రభావం చూపే శక్తి. అయితే, ఇది భారతదేశంలో ఒక వారసత్వం కూడా. మనం ఆ వారసత్వం నుంచి నేర్చుకోవాలి. దానిని పైపై ఆకర్షణను దాటి చూడాలి” అని ఒక ప్రశ్నకు సమాధానంగా శ్రీ కైంతోలా అన్నారు. రచనలో ప్రామాణికత ప్రాముఖ్యతను కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా పుస్తకం భాష సరళంగా ఉండాలని అన్నారు. వివిధ ఆన్‌లైన్ వేదికల్లో, అలాగే ఐఎఫ్ఎఫ్ఐ వేదిక వద్ద ఉన్న పబ్లికేషన్ డివిజన్ స్టాల్‌లో కూడా ఈ పుస్తకం కొనుగోలుకు అందుబాటులో ఉందని శ్రీ కైంతోలా తెలియజేశారు.
1991 తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న వారి జీవితాలను పరిశోధించే విధంగా, ఈ పుస్తకం రెండో ఎడిషన్‌ను కూడా ప్రచురించాలని శ్రీ రాజేంద్ర తలక్ చేసిన సూచనకు శ్రీ కైంతోలా సానుకూలంగా స్పందించారు.
ఇఫీ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), దక్షిణ ఆసియాలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద సినిమా ఉత్సవంగా పేరు గాంచింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), గోవా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్జీ) సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయి. పునరుద్ధరించిన పాత సినీ కళాఖండాలు, ఆధునిక ప్రయోగ చిత్రాల ప్రదర్శనతో దిగ్గజ దర్శకులు, మొదటిసారి చిత్రాలు తీసిన కొత్త, సాహసోపేత దర్శకులు ఒకే వేదికను పంచుకునే ఈ ఉత్సవం, అంతర్జాతీయ సినీశక్తి కేంద్రంగా ఎదిగింది. అంతర్జాతీయ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, నివాళులు ఆలోచనలు, ఒప్పందాలు, భాగస్వామ్యాలు, అత్యంత ఉత్సాహభరితమైన 'వేవ్స్ ఫిల్మ్ బజార్' వంటి వైవిధ్యభరిత అంశాల కలయిక ఇఫీని ప్రకాశవంతంగా మార్చాయి. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా సుందర తీరప్రాంత నేపథ్యంలో జరిగే 56వ ఎడిషన్ భాషలు, శైలులు, ఆవిష్కరణలు, స్వరాల అద్భుతమైన వైవిధ్యాన్ని హామీ ఇస్తోంది. ఇది ప్రపంచ వేదికపై భారతదేశ సృజనాత్మక ప్రతిభను సమగ్రంగా ప్రదర్శించే వేడుక.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
IFFI Website: https://www.iffigoa.org/
PIB’s IFFI Microsite: https://www.pib.gov.in/iffi/56new/
PIB IFFIWood Broadcast Channel: https://whatsapp.com/channel/0029VaEiBaML2AU6gnzWOm3F
X Post Link: https://x.com/PIB_Panaji/status/1991438887512850647?s=20
X Handles: @IFFIGoa, @PIB_India, @PIB_Panaji
* * *
रिलीज़ आईडी:
2193233
| Visitor Counter:
24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Kannada
,
English
,
Konkani
,
Marathi
,
हिन्दी
,
Gujarati
,
Assamese
,
Urdu
,
Bengali
,
Tamil