ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ వాతావరణ ఆర్థిక వనరుల ముఖచిత్రాన్ని మార్చడంలో భారత్ ముందున్న అవకాశాలు…. ఓ వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 18 NOV 2025 12:48PM by PIB Hyderabad

ప్రపంచ వాతావరణ ఆర్థిక వనరుల ముఖచిత్రాన్ని మరింత పారదర్శకంగాసార్వజనీన ప్రమాణాలతో మార్చడానికి భారత్ ముందున్న అవకాశాల గురించి కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఒక వ్యాసాన్ని రాశారుదీనిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.

వాతావరణ పరిరక్షణ విషయంలో ఆర్థిక సాయానికి సంబంధించి భారత్ అనుసరిస్తున్న వర్గీకరణ ముసాయిదాదేశీయంగా హరిత ప్రధాన పథకాలకు అందిస్తున్న ఆర్థిక సహాయం.. ఇవి భవిష్యత్తులో మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగిన ప్రపంచవ్యాప్త విధానానికి మార్గదర్శకత్వం వహించగల ఉదాహరణలుగా నిలవగలుగుతాయని ఈ వ్యాసం తెలిపింది.

కేంద్ర మంత్రి రాసిన వ్యాసంపై శ్రీ మోదీ స్పందిస్తూ -

‘‘వాతావరణ పరిరక్షణకు సంబంధించి ప్రపంచ దేశాలు అందిస్తున్న ఆర్థిక సాయానికి కొత్త రూపురేఖల్ని.. ఇప్పటి కన్నా ఎక్కువ పారదర్శకత్వంతోఉమ్మడి ప్రమాణాలతో సమకూర్చాల్సిన అవసరం ఎంతయినా ఉందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ వివరించారు.

భారత్ అనుసరిస్తున్న వర్గీకరణ ముసాయిదాదేశీయంగా హరిత ప్రధాన పథకాలకు చేస్తున్న ఆర్థిక సహాయం.. ఇవి భవిష్యత్తులో మరింత ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగిన ప్రపంచవ్యాప్త విధానానికి మార్గదర్శకత్వం వహించగల ఉదాహరణలుగా నిలవగలుగుతాయన్నది ఆయన ఆలోచన’’ అని పేర్కొన్నారు.

 

***


(Release ID: 2191207) Visitor Counter : 6