ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2025’లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత విలువిద్య క్రీడాకారుల జట్టును అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
17 NOV 2025 5:59PM by PIB Hyderabad
‘ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2025’లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత విలువిద్య క్రీడాకారుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ఈ పోటీలో దేశ విలువిద్య జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిందని, 6 స్వర్ణాలు సహా మొత్తం 10 పతకాలను సాధించిందని శ్రీ మోదీ అన్నారు. 18 సంవత్సరాల తర్వాత సాధించిన చారిత్రాత్మక రికర్వ్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వ్యక్తిగత విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనలు, కాంపౌండ్ విభాగంలో విజయవంతమైన టైటిల్ రక్షణలు కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఈ అద్భుతమైన విజయం దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఆశావహులైన యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
ప్రధాననమంత్రి ఇలా పేర్కొన్నారు..
“ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్ 2025లో భారత విలువిద్య జట్టు ఇప్పటివరకు సాధించిన అత్యుత్తమ విజయానికి హృదయపూర్వక అభినందనలు. వారు 6 బంగారు పతకాలు సహా మొత్తం 10 పతకాలను భారత్‌కు అందించారు. వీటిలో 18 సంవత్సరాల తర్వాత వచ్చిన చారిత్రాత్మక రీకర్వ్ పురుషుల స్వర్ణ పతకం ప్రత్యేకంగా నిలుస్తుంది. అదే సమయంలో వ్యక్తిగత విభాగాల్లో కూడా అద్భుత ప్రదర్శనలు, కంపౌండ్ విభాగంలో విజయవంతమైన టైటిల్ రక్షణలు కూడా ఉన్నాయి. ఇది నిజంగా ఒక గొప్ప విజయగాధ, రాబోయే అనేకమంది యువతరం క్రీడాకారులకు స్పూర్తినిస్తుంది.”
***
(रिलीज़ आईडी: 2191036)
आगंतुक पटल : 29
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada