ప్రధాన మంత్రి కార్యాలయం
గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా దేవ్‌మోగ్రా మాత ఆలయంలో ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు.
Posted On:
15 NOV 2025 3:00PM by PIB Hyderabad
గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సందర్శించారు. భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఈ రోజున గిరిజన గౌరవ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేడు ఆయన 150వ జయంతి.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి దేవ్‌మోగ్రా మాతకు ప్రార్థనలు చేశారు. పౌరులందరూ ఆరోగ్యం, క్షేమం, ప్రగతి కోసం మాత ఆశీస్సులు కోరారు. ఆలయ సందర్శన అనుభవాన్ని పవిత్రమైనదిగా అభివర్ణించిన శ్రీ మోదీ.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఇలా పేర్కొన్నారు.
‘‘దేవ్‌మోగ్రా మాతకు నమస్కారం!
నేడు గిరిజన గౌరవ దినోత్సవం, భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా.. దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది.
దేశ ప్రజలందరి ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశాను’’
(Release ID: 2190435)
Visitor Counter : 3