వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విత్తనాల ముసాయిదా బిల్లు - 2025పై ప్రజల సూచనలు కోరిన ప్రభుత్వం విత్తనాల చట్టం - 1966తో పాటు విత్తనాల (నియంత్రణ) ఉత్తర్వు - 1983 స్థానంలో కొత్త బిల్లు


నాణ్యమైన విత్తనాలు, రైతుల హక్కుల రక్షణతో పాటు వాణిజ్య నిర్వహణలో సౌలభ్యాన్ని ప్రోత్సహించడం బిల్లు లక్ష్యాలు

ఆసక్తిదారులు సూచనలను 2025 డిసెంబరు 11 కల్లా సమర్పించవచ్చు

प्रविष्टि तिथि: 13 NOV 2025 2:48PM by PIB Hyderabad

విత్తనాల ముసాయిదా బిల్లు - 2025ను వ్యవసాయరైతు సంక్షేమ విభాగం (డీఏ అండ్ ఎఫ్‌ డబ్ల్యూరూపొందించిందిఈ విభాగం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయరైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేస్తోందిబిల్లును ప్రస్తుత వ్యవసాయనియంత్రణ సంబంధిత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారుప్రతిపాదిత శాసనాన్ని ఇప్పుడున్న విత్తనాల చట్టం - 1966తో పాటు విత్తనాల (నియంత్రణఉత్తర్వు - 1983 స్థానంలోకి తీసుకు రావాలన్న ఉద్దేశంతో సిద్ధం చేశారు.

విత్తనాల ముసాయిదా బిల్లు - 2025లో - 

మార్కెట్లో లభిస్తున్న విత్తనాల నాణ్యతను క్రమబద్ధీకరించడం, రైతులకు గిట్టుబాటు ధరల్లో మంచి విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంనకిలీ విత్తనాలునాసిరకం విత్తనాల అమ్మకాన్ని అరికట్టడంరైతులు నష్టపోకుండా చూడటంనవకల్పనను ప్రోత్సహించడంవిత్తనాల పరంగా ప్రపంచ రకాలను రైతుల చెంతకు చేర్చే ఉద్దేశంతో విత్తనాల దిగుమతిని సరళతరం చేయడంతో పాటు విత్తనాల సరఫరా వ్యవస్థల్లో పారదర్శకతనుజవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రైతుల హక్కులను కాపాడాలనే అంశాలను బిల్లులో పొందుపరిచారు.

చిన్న చిన్న నేరాలను నేర పరిధి నుంచి తప్పించాలనే ప్రస్తావనను ముసాయిదా బిల్లులో చేర్చారుదీని ద్వారా వాణిజ్య నిర్వహణలో సౌలభ్యాన్ని పెంచాలనీనియమాలను అనుసరించాల్సిన బాధ్యతలను చాలావరకూ తగ్గించాలనీ పేర్కొన్నారుకొన్ని ఉల్లంఘనలను మాత్రం తీవ్రంగా పరిగణించిజరిమానాలను విధించాలని స్పష్టం చేశారు.

శాసనపరమైన పూర్వ సంప్రదింపుల ప్రక్రియలో భాగంగావిత్తనాల ముసాయిదా బిల్లు - 2025తో పాటు నిర్దేశిత ప్రతిస్పందన నమూనాను మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్లో https://agriwelfare.gov.in లో అందుబాటులోకి తీసుకువచ్చారు.

ముసాయిదా బిల్లు పైనా, బిల్లులోని అంశాలపైనా  సూచనలనుసలహాలను ఇవ్వాల్సిందిగా ప్రజలతో పాటు ఈ విషయంలో ఆసక్తి ఉన్న వారిని కోరారుఅభిప్రాయాలను jsseeds-agri[at]gov[dot]inకు ఈమెయిల్లో పంపవచ్చు.

అభిప్రాయాలను ఎమ్ఎస్ వర్డ్ లో లేదా పీడీఎఫ్ విధానంలో వీలయినంత త్వరగా, 2025 డిసెంబరు 11వ తేదీ లోపు పంపవచ్చు. (ఫార్మేట్ ‌ను ఈ కింది విధంగా పొందుపరిచారు).

 Click on the Link to see the draft copy of the Seeds Bill

అభిప్రాయాలు, సూచనలను ఇలా పేర్కొనండి..

పేరు, ఉద్యోగం

 

సంప్రదించేందుకు వివరాలు

చిరునామా, ఈమెయిల్, మొబైల్

 

సంస్థ లేదా ఏజెన్సీ పేరు (వాటితో అనుబంధం ఉంటేనే)

 

సంప్రదించేందుకు వివరాలు

చిరునామా, ఈమెయిల్, మొబైల్

 

 

 పార్ట్-బీ 

అభిప్రాయాలు లేదా సూచనలు

 

క్రమ సంఖ్య

 సెక్షను

అంశం

అభిప్రాయాలు, సూచనలు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

***


(रिलीज़ आईडी: 2190018) आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam