ప్రధాన మంత్రి కార్యాలయం
భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను గౌరవపూర్వకంగా స్వాగతించినందుకు
భూటాన్ ప్రజలకూ, భూటాన్ నాయకత్వానికీ ధన్యవాదాలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
09 NOV 2025 3:43PM by PIB Hyderabad
భారత్ నుంచి పంపిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను గౌరవపూర్వకంగా స్వాగతించినందుకు భూటాన్ ప్రజలకూ, భూటాన్ నాయకత్వానికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ అవశేషాలు... శాశ్వతమైన శాంతి, కరుణ, సద్భావనలకు ప్రతీక అని శ్రీ మోదీ అన్నారు. ‘‘భగవాన్ బుద్ధుని ప్రబోధాలు మన ఇరు దేశాల ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వాల మధ్య ఒక పవిత్ర బంధాన్ని ఏర్పరిచాయి’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘భారత్ నుంచి పంపిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను గౌరవపూర్వకంగా స్వాగతించినందుకు భూటాన్ ప్రజానీకానికీ, భూటాన్ నాయకత్వానికీ నేను నా హార్దిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ అవశేషాలు... శాశ్వతమైన శాంతి, కరుణ, సద్భావనలకు ప్రతీక. భగవాన్ బుద్దుని ప్రబోధాలు మన రెండు దేశాల ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వాల మధ్య ఒక పవిత్రమైన బంధాన్ని ఏర్పరిచాయి’’ అని పేర్కొన్నారు.
https://facebook.com/share/p/16kev8w8rv/?mibextid=wwXIfr
***
(Release ID: 2188156)
Visitor Counter : 2