ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని ఫలోడీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని
प्रविष्टि तिथि:
02 NOV 2025 10:17PM by PIB Hyderabad
రాజస్థాన్లోని ఫలోడీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘రాజస్థాన్లోని ఫలోడీ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాను.
పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్టపరిహారం అందుతుంది: పీఎం”
**********
MJPS/ST
(रिलीज़ आईडी: 2185798)
आगंतुक पटल : 28
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam