ప్రధాన మంత్రి కార్యాలయం
సీఏపీఎఫ్‌లు, రాష్ట్ర పోలీసు దళాల నైపుణ్యాలు, సాహసాన్ని ప్రదర్శించిన బృహత్తర ఏకతా కవాతును ప్రశంసించిన ప్రధాని
Posted On:
31 OCT 2025 7:32PM by PIB Hyderabad
కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌లు), రాష్ట్ర పోలీసు దళాలు తమ నైపుణ్యాలను, సాహసాన్ని ప్రదర్శించడానికి ఏకతా కవాతు ఓ గొప్ప అవకాశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధ కళలు, ఆయుధరహిత పోరాట విన్యాసాల్లో మహిళా సిబ్బంది అందించిన ప్రదర్శనలను ప్రస్తావిస్తూ.. నారీ శక్తి కూడా ఈ కవాతులో అద్భుత భాగస్వామ్యాన్ని అందించిందని కొనియాడారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌లు), రాష్ట్ర పోలీసు దళాలు తమ నైపుణ్యాలను, సాహసాన్ని ప్రదర్శించడానికి ఏకతా కవాతు ఓ గొప్ప అవకాశం. మన నారీ శక్తి ఉత్సాహభరిత భాగస్వామ్యమూ దానికి ఏ మాత్రం తీసిపోలేదు. యుద్ధ కళలు, ఆయుధరహిత పోరాట విన్యాసాలను మహిళా సిబ్బంది ప్రదర్శించారు."
***
(Release ID: 2185544)
Visitor Counter : 3