ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 31 OCT 2025 12:41PM by PIB Hyderabad

కెవాడియాలోని ‘ఐక్యతా విగ్రహం’ (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీవద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

దేశ ఐక్యతశక్తిపై సర్దార్ పటేల్  దార్మనికతకు  ఐక్యతా విగ్రహం ఓ స్మారక చిహ్నమని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా నిలిచిన ఈ ప్రతిమ.. దేశ గర్వానికి, సర్దార్ పటేల్ స్వప్నాలను నెరవేర్చాలనే సమిష్టి సంకల్పానికి చిహ్నమని తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు..

కెవాడియాలోని ఐక్యతా విగ్రహం’ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించాను.

ఐక్యతా విగ్రహం’ సర్దార్ పటేల్ గారికి అంకితమైన మహత్తర ఘన నివాళి. ఇది దేశ ఐక్యతశక్తిపై ఆయన కలల దృక్పథానికి శక్తిమంతమైన ప్రతీక. ప్రపంచంలోనే త్యంత ఎత్తైన విగ్రహంగా నిలిచిన ఈ ప్రతిమ.. దేశ గర్వానికి, సర్దార్ పటేల్ స్వప్నాలను నెరవేర్చాలనే సమిష్టి సంకల్పానికి ప్రతీక’’


(रिलीज़ आईडी: 2184626) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam